ఇక బీజేపీవారి రాజసూయం!
posted on Oct 21, 2022 @ 11:16AM
రాజసూయం అంటే ప్రాచీన భారతదేశపు రాజులు తమ సార్వభౌమత్వాన్ని ప్రకటించుకోవడానికి చేసే ఒక వైదిక క్రతువు. రాజు నుంచి చక్రవర్తిగా మారే క్రమంలో ఈ యాగాన్ని నిర్వహిస్తారు. మహాభారతంలో ధర్మ రాజు రాజసూయ యాగం చేసినట్లు ప్రముఖంగా ప్రస్తావించబడి ఉంది. ఈ యాగం చివరలో ధర్మ రాజు శ్రీకృష్ణునికి అగ్ర తాంబూలం ఇవ్వబోగా అందరూ అంగీకరించినా శిశుపాలుడు అంగీకరించక, కృష్ణుణ్ణి తులనాడతాడు. శ్రీకృష్ణుడు అతని నూరు తప్పులు క్షమించి తర్వాత తన సుదర్శన చక్రంతో సంహరి స్తాడు.
మునుగోడు ఉప ఎన్నిక తర్వాత రాష్ట్రంలో రాజకీయ రాజసూయ యాగం చేస్తామని మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్యగౌడ్ ప్రకటించారు. తమ పార్టీ ముఖ్యులతో కలిసి కేంద్రం పథకాలు, అభివృద్ధిని.. టీఆర్‌ఎస్ ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తామని పేర్కొన్నారు. ఉప ఎన్నిక తర్వాత బీజేపీలో చేరి కలు వెల్లు వలా ఉంటాయని చెప్పారు. తెలంగాణలో సంక్షేమ పథకాల స్ఫూర్తి ప్రదాత ఎవరో త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. బీజేపీ మునుగోడు ఉప ఎన్నిక దృష్ట్యా తెలంగాణాలో కేసీఆర్‌ను శిశుపాలునిగా భావించి వారి పాలన లోపాలను ఫుల్ సౌండ్‌లో మైకుల్లో మళ్లీ మరో మరోసారి ప్రజల చెవులు చిల్లులు పడేలా వినిపించి టీఆర్ ఎస్‌ను గద్దె దించేయ మని యుద్ధానికి ఓటర్లను సమాయత్తం చేస్తుందిట. మును గోడు భారీ మెజారిటీతో గెలిచి ప్రధాని మోదీకి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు విజయాన్ని కానుకగా ఇవ్వడానికి బీజేపీ శ్రేణులు ఇలా సిద్ధమవుతున్నారనే అనుకోవాలేమో!
ముందుముఖ్యంగా, మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరైడ్ సమస్య లేదంటున్న మంత్రి హరీశ్, అక్కడ ఫ్లోరోసిస్ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని ఎందుకు అడుగుతున్నారో చెప్పాలని బూర డిమాండ్ చేశారు. బీజేపీలో చేరాక గురువారం తొలిసారిగా రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన బూర.. మీడియాతో మాట్లా డారు. ఉద్యమ వ్యతిరేకులు, పక్క రాష్ట్రం నాయకులకు టీఆర్‌ఎస్ అడ్డాగా మారిందని విమర్శించారు. ప్రగతి భవన్‌లోకి వెళ్లాలంటే ప్రజలకు వీసా దొరకట్లేదని అన్నారు. ఉమ్మడి ఏపీలో కంటే కఠినమైన నిర్బంధాలు కొనసాగుతున్నాయని చెప్పారు.
సినిమాల్లో ఒకప్పుడు సిల్క్ స్మిత పాపులర్. ఇప్పుడు మునుగోడు నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డిని చూస్తే అదే అభిపాయ్రం కలుగుతోంది. లింగభేదం ఒక్కటే తేడా అని అన్నారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల పై 2014 ఎన్నికల ముందు కేసీఆర్ చూపించిన సినిమా దృశ్యాలను మరిచిపోలేకపోతున్నానని నర్సయ్య తెలిపారు.