పీ.కే.వి పిల్ల చేష్టలు... నీతిష్ కుమార్
posted on Oct 21, 2022 @ 3:40PM
తాను రాజకీయ విశ్లేషకుడినని, వ్యూహకర్తనని భారీ ప్రచారం చేసుకుంటూ దేశంలో అన్ని పార్టీల దశ దిశా మార్చగల వ్యూహకర్తనని భారీ ప్రచారం చేసుకుంటున్న ప్రశాంత్ కిషోర్ బీహార్ విషయంలో ఏమీ చేయ లేకపోయాడని పైగా అంతే అగౌరవంగా నీతిష్ కుమార్ కి దూరమయ్యాడనే ప్రచారం ఉంది. ఆయనకు ఎంతో స్వేచ్ఛగా మాట్లాడేస్తుంటారని, వాటిని అంతా లెక్కలోకి తీసుకోవాలన్నట్టుగానే వ్యవహరిస్తుంటారన్న ప్రచారం ఉంది. కానీ ఆయన్ను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని నీతిష్ అనడం గమనార్హం.
తనకు బీజేపీతో రహస్యసంబంధాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ ఆరోపించ డాన్ని బీహార్ ముఖ్యమంత్రి నీతిష్ కుమార్ తప్పికొట్టారు. కిషోర్ యువకుడు, అతను తనకు తోచినట్టు ఏదో ఒకటి ఏదో ఒకటి మాట్లాడేస్తుంటాడని అన్నారు. శుక్రవారం నీతిష్ మీడియాతో మాట్లాడుతూ, ప్రశాంత్ కిషోర్ తన పబ్లిసీటీ కోసం ఏదయినా మాట్లాడేస్తుం టాడని, అతన్ని పట్టించుకోవద్దని, అసలు అతని గురించి తన వద్ద ప్రస్తావించవద్దని అన్నారు. అతను చిన్నవాడయినా ఎంతో మర్యాదిచ్చానని, కానీ అతను అగౌరవంగా వ్యవహరించిన సంగతి అందరికీ తెలిసినదే నన్నారు.
బీజేపీతో విడిపోయిన తర్వాత నీతిష్ కుమార్ ఆర్జేడీ తేజస్వినీ యాదవ్‌తో మళ్లీ జతకట్టారని పీకే వ్యాఖ్యా నించారు. 2017లో ఆర్జేడిని ముంచే బీజేపీతో చేతులు కలిపారని విమర్శించారు. బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ పార్టీలను ఒకటి చేసే యత్నం చేస్తున్నట్టు కనపడిన్పటికీ, రాజ్యసభ డిప్యూటీ చైర్‌పర్సన్ హరి వంశ్ మద్దతుతో బీహార్ ముఖ్యమంత్రి మరో వంక బీజేపీతో సంబంధాలు కొనసాగించారని పీకే ఆరో పిం చారు. నీతిష్ తీరును ప్రజలు గుర్తుపెట్టుకోవాలని నీతిష్ అవసరార్ధం స్నేహాలు చేస్తుంటారని రాజ కీయ వ్యూహకర్త బీహార్‌యాత్రలో అన్నారు. నీతిష్ 17 ఏళ్ల పాలనలో 14 సంవత్సరలు బీజేపీ మద్దతుతోనే సాగిందని విమర్శించారు.
కాగా, నీతిష్ కుమార్ జెడీయూ కి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, అర్ధంలేని విమర్శలకు పాల్పడుతున్న కారణంగానూ ప్రశాంత్ కిషోర్‌ను 2020 జవరిలోనే నీతిష్ వదిలించుకున్నారు.