జయలలిత మరణం  ఇంకా మిస్ట‌రీయేనా?

జయలలిత ప్రధాన నిందితురాలిగా ఉన్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలడంతో జయలలిత మరణించిన తర్వాత జె.జయలలిత సన్నిహితురాలు వి.కె.శశికళ అవినీతి ఆరోపణలపై అరెస్టయి, బ‌య‌టికి వ‌చ్చిన సంగతి తెలిసిన‌దే. 2016లో చెన్నైలోని అత్యున్నత ఆసుపత్రిలో చేరిన జె జయలలిత మరణంపై దర్యాప్తు జరగాలని మాజీ న్యాయమూర్తి ఒక సుదీర్ఘ నివేదికలో పేర్కొన్నారు. అంతేకాదు ఒక ఉన్నత ప్రభుత్వ అధికారిని, జ‌య‌ల‌లిత‌తో నివసించిన సన్నిహితురాలు వికె శశి కళ ను దూషించింది. 2017లో జయలలిత పార్టీ అన్నాడీఎంకే తమిళనాడును పాలించినప్పుడు, కుట్ర సిద్ధాంతాలు, జయ లలిత అనారోగ్యం, అపోలోలో చికిత్సకు సంబంధించిన వివాదాస్పద ఖాతాలను జల్లెడ పట్టేందుకు 2017 లో మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి  ఏ. ఆర్ముఘస్వామి నేతృత్వంలో విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. 2021లో డిఎంకె రాష్ట్ర బాధ్యతలు చేపట్టినప్పుడు, జయ లలిత మరణానికి దారితీసిన పరిస్థితులను వివరంగా దర్యాప్తు చేస్తామని ఎన్నికల హామీని పునరుద్ఘాటించింది. జస్టిస్ ఏ. ఆర్ముఘ స్వామి నివేదికను ఆగస్టులో ప్రభుత్వానికి సమర్పించారు. జయలలిత మరణాన్ని అధికారికంగా ప్రకటించడాన్ని కూడా కమిషన్ విమర్శించింది. డిసెంబరు 4, 2016 న జయలలిత గుండె పోటు కు గురైన తర్వాత ఏమి జరిగిందో ఉదహరిస్తూ కమిషన్, డిసెంబర్ 4 మధ్యాహ్నం 3.50 గంటల నుండి సీపీ ఆర్ , స్టెర్నోటమీ వ్యాయామాలు ఫలించలేదు. ఆమె మరణం అధి కారిక ప్రకటనలో జాప్యాన్ని వివరించడానికి ఇవి ఒక ఎత్తుగడగా ఉపయో గించబడ్డాయి.  పన్నీర్‌సెల్వం అంతరంగిక వ్యక్తి, అధికారికంగా స‌న్నిహితుల్లో ఒకర‌ని కమిషన్ పేర్కొంది. దివంగత ము ఖ్య మంత్రి జీవించి ఉన్న సమయంలో కూడా ఏదైనా జరిగిందనేది ఆయనకు తెలిసినదే. అతను ఎటు వంటి సమయాన్ని కోల్పోకుండా సీఎం కార్యాలయా నికి చేరుకున్నాడు. అతను సరిపోయేటట్లు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటనలో ఉన్నాడు. దివంగత ముఖ్యమంత్రి వారసుడిగా తనను తాను నిల బెట్టుకు న్నారు. ఇది యాదృచ్ఛికంగా జరగలేదు. కాగా, ఈ నివేదికను ఇప్పుడు  తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వం పంచుకుంది. జయలలిత మరణించి న సమయంలో అత్యున్నత బ్యూరోక్రాట్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ రామమోహనరావు క్రిమినల్ చర్యలకు పాల్పడ్డారని పేర్కొంది. నివేదికలో అప్పటి  ఆరోగ్య మంత్రి విజయభాస్కర్‌పై  తీవ్ర వ్యాఖ్యలు చేశారు, జయలలిత పరిస్థితిపై అపోలో ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ రెడ్డి తప్పుడు ప్రకటనలు ఇచ్చారని పేర్కొంది. తమిళ నాడు అత్యంత ఆకర్షణీయమైన, అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకులలో ఒకరైన  జయ లలిత నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మాజీ నటి, ఆమె ఎఐఎడిఎంకె క్యాడర్‌కు తమిళనాడు అమ్మగా ప్రియమైనది, అయితే ఆమె కెరీర్ చివరి భాగంలో ఆమెపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆమె అత్యంత సన్నిహితురాలు వీకే శశికళ దశాబ్దాలుగా ఆమెతో కలిసి జీవించారు. 2017లో  జయ లలిత ప్రధాన నింది తురాలిగా ఉన్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలడంతో జయ లలిత మర ణించిన తర్వాత శశికళ అవినీతి ఆరో పణలపై అరెస్టయ్యారు. నాలుగేళ్ల తర్వాత పొరుగున ఉన్న కర్ణాటక లోని జైలు నుంచి శశికళ విడుదలై అన్నాడీఎంకే బాధ్యతలు చేపట్టేందుకు ఆమె చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. కమిటీ తరఫున వాంగ్మూలం ఇచ్చిన సాక్షుల్లో అన్నాడీఎంకే అగ్రనేత ఓ పన్నీర్‌సెల్వం, జయలలిత మేనకోడలు దీప, రాజకీయనాయకుడు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారని తెలిపిన మేనల్లుడు దీపక్, లిఖిత పూర్వక వాంగ్మూలం దాఖలు చేసిన శశికళ ఉన్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లోని నిపుణు లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందించిన చికిత్సపై అపోలో ఆసుపత్రి వైద్యులు వాంగ్మూలం ఇచ్చారు, ఈ విషయాన్ని సమీక్షించాలని సుప్రీంకోర్టు కోరింది.

చెల్లెళ్లకు మిగిలేది దిగులేనా?

అన్నీ, అంద‌రూ ఉన్నా కొంద‌రికి జీవితం ఏమాత్రం సుఖంగా సాగ‌దు. అధికారం, పిలిస్తే ప‌లికే మ‌నుషు లు అంతా ఉన్న‌ట్టే  ఉంటుంది కానీ ఎవ‌రూ, ఏదీ త‌మ‌వి కావ‌న్న బాధ మ‌నసుని తినేస్తుంటుంది. ఎవ‌రికి ఎవ‌రు చివ‌రికి ఎవ‌రు.. వంటి గీతాలే బాగా ఇష్టంగా పాడుకోవాల్సిన ఒంట‌రిత‌నంలో మిగిలి పోతుంటారు. ఇపుడు ఇలాంటి వెలుగు జారిపోతున్న రాజ‌కీయ గ‌దుల్లో ఇద్ద‌రు ఆడ‌పడుచులు బెంగె ట్టుకుని బిక్కు బిక్కుమంటున్నారు. ఒకరు ఆంధ్రా, మ‌రొక‌రు తెలంగాణాకి చెందిన‌వారు. వారే ఆర్‌.కె. రోజా, క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ఆర్‌.కె. రోజా అనేకంటే ఒక‌నాడు టాలీఉడ్‌ని ఏలిన సూప‌ర్ హీరోయిన్ రోజా అంటేనే ఠ‌క్కున గుర్తుకు వ‌స్తుంది. వివాహం త‌ర్వాత సినిమాలు త‌గ్గించుకున్న రోజా మెల్లగా రాజ‌కీయాల్లో ఆస‌క్తితో అడుగిడినా త‌న వాక్చాతుర్యం, ధైర్య‌సాహ‌సాల‌తోనే అంద‌రికీ బాగా ఎరుక‌. ఏమాత్రం భ‌యంలేని ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం, విప‌క్షాల‌వారితో అంతే స్థాయిలో విరుచుకుప‌డ‌టంలో ఆమె ప్ర‌త్యేకత ఆమెది. రోజా బీఎస్సీ చదువుతున్న ప్పుడే ప్రేమ తపస్సు సినిమా ద్వారా సినిమాలకు పరిచయమైంది. అంతకు ముందు ఆర్కే రోజా తమిళ చిత్రం చంబరతిలో నటించారు. ఈ చిత్రం కోలీవుడ్‌లో మ్యూజికల్ హిట్ అయ్యింది తెలుగులోకి చేమంతి అనే టైటిల్ తో డబ్ చేశారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు ఆర్కే సెల్వమణి ఈ చిత్రాన్ని రూపొం దించారు. రోజా అతనిని వివాహం చేసుకున్నారు. ఆర్కే రోజా 2004లో నగరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రాజకీయ రంగప్రవేశం చేశారు. ఆమె చెంగారెడ్డి రెడ్డివారిపై పోటీ చేశారు. 2009లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఆమె మళ్లీ పోటీ చేసినా ఆశించిన ఫలితాలు రాలేదు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్‌లో చేరిన రోజా, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మద్దతుగా నిలిచారు. రోజా 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నగరి నుంచి వైఎస్సార్‌సీపీ టికెట్‌పై రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలి చా రు. 2014 అసెం బ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సీనియర్, దివంగత సీనియర్ టీడీపీ నేత గాలి ముద్దు కృష్ణమ నాయుడు పై రోజా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ఆయన కుమారుడు గాలి భానుప్రకాష్‌పై విజ యం సాధించారు. వైఎ స్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా అధ్యక్షురాలు, ఫైర్‌బ్రాండ్‌ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా.. ప్రతిపక్షాలను సైతం వదలడం లేదన్న విషయం తెలిసిం దే. రాజకీయ విమర్శలు చేయడంలో ఆమెది తనదైన శైలి. 2020 నుంచి రెండేళ్లపాటు ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌గా పని చేశారు. ప్ర‌స్తుతం వైసీపీ ప్ర‌భుత్వం లో మంత్రిగా చేస్తున్నారు.  కానీ వాడిగా, వేడిగా మారిపోతున్న రాజ‌కీయాల్లో ఆమె న‌మ్ముకున్న పార్టీగాని, అన్న సీఎం జ‌గ‌న్ గాని ఆమె రాజ‌కీయ భ‌వి ష్య‌త్‌కు ఢోకా లేద‌ని మాత్రం చెప్ప‌లేక‌పోతున్నారు. కార‌ణం పార్టీ ప‌రిస్తితులు అధోగ‌త‌కి మ‌ళ్లాయి. సినిమాల్లో, టీవీ షోల కంటే ప్ర‌జ‌ల‌కు సేవ‌చేయాలంటే రాజ‌కీయాల్లోనే ఉండాల‌న్న నిర్ణ‌యం తో వైసీపీలో చేరిన‌ప్ప‌టికీ, ఆమెకు మొద‌టి నుంచి త‌గినంత గుర్తింపు ల‌భించ‌లేద‌నే అనాలి. కేవ‌లం విప క్షాల‌వారి మీద విరుచుకు ప‌డ‌టం త‌ప్ప పార్టీవారు, సీఎం జ‌గ‌న్ చెల్ల‌మ్మా అన‌డం త‌ప్ప ఆమెకు త‌గ్గ స్థాయిని తొలి విడ‌త కల్పించ‌లేదు. క్ర‌మేపీ ప్ర‌భుత్వ విధానాలు, పాల‌న ప‌ట్ల ప్ర‌జ‌లు విసిగెత్తి ప్ర‌భుత్వ వైఖ‌రిని దుయ్య‌ప‌ట్ట‌డం ఆరంభించారో అప్ప‌టికి మంత్రివ‌ర్గంలో మార్పులు ఎంతో అవ‌స‌ర‌మ‌న్న జ్ఞానం క‌లిగి రోజాను మంత్రివ‌ర్గంలోకి తీసుకున్నారు. కానీ ఇది మూడేళ్ల ముచ్చ‌ట కూడా కాద‌న్న‌ది ఆమెకు తెలు సు. మూడేళ్ల పాల‌న త‌ర్వాత కూడా ప్ర‌జ‌లు ప్ర‌భు త్వం ప‌ట్ల ఏమాత్రం ఆస‌క్తి లేక‌పోవ‌డం, పార్టీలో నాయ కుల‌కు, అధినేత‌కు మ‌ధ్య ప‌నితీరులో వ‌చ్చిన వ్య‌త్యాసాలు, ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న స్పంద‌న అన్నీ వెర‌సి  రెండోవిడ‌త మంత్రివ‌ర్గంలోకి వ‌చ్చిన మంత్రుల‌కు ఇబ్బందిక‌రంగానే ఉంది. ముఖ్యంగా నాని వంటి వారు నోటి దురుసుతో ప్ర‌తిప‌క్షం మీద‌, నాయ‌కుల మీద భాష‌లో లేని మాట‌ల‌తో చాలా ఛండాలమైన‌ తిట్ల‌పురాణాం అందుకోవ‌డంతో పార్టీ ప‌రువు బ‌జారున ప‌డింది. ఇలాంటి ప‌రిస్థితులు  రోజా వంటి కొత్త మంత్రుల‌కు మ‌రి జ‌నాల్లోకి వెళ్ల‌డానికి ఇబ్బందిక‌రంగానే మారాయ‌నాలి. రాబోయే ఎన్నిక‌లనాటికి పార్టీని మ‌రింత బ‌లోపేతం చేయాల‌ని, భారీ మెజారిటీతో గెల‌వాలంటే త‌న‌తోపాటు అంద‌రూ క‌ష్టించి ప‌ని చేయాల‌ని జ‌గ‌న్ ప్ర‌వ‌చ‌నం లాంటి హెచ్చ‌రిక‌లు చేయ‌డం రోజా వంటి కొత్త మంత్రుల‌కు మ‌న‌సు క‌ష్ట పెట్టింది. మూడేళ్ల‌న్నా సుఖంగా ఉండాల‌నుకుంటే విప క్షాల తిట్లు తినాల్సి వ‌స్తోంద‌న్న బాధ క‌క్క‌లేక మింగలేకుండా ఉన్నారు. పార్టీని మ‌ళ్లీ ప్ర‌జ‌ల్లోకి తీసికెళ్లి గ‌తంలో కంటే నాలుగు ఓట్లు ఎక్కువ‌చ్చేట్టు చేయాల‌ని ప్ర‌య‌త్నించ‌డంలో లోపం లేక‌పోవ‌ చ్చు. కానీ ప్ర‌య‌త్నాల‌న్నీ ఆల‌స్యంగా ఆరంభిం చ‌డం తోనే విప‌క్షాలు ల‌బ్దిపొందేందుకు మార్గం క‌ల్పించిన‌ట్ల‌ యింది. ఊహించ‌నివిధంగా మ‌ళ్లీ టీడీపీ ని, చంద్ర బాబు నాయ‌క‌త్వాన్ని ప్ర‌జ‌లు ఆశిస్తున్న ఈ త‌రుణంలో జ‌గ‌న‌న్న ఇక నిల‌వ‌లేని స్థితిలో ఉన్నారు. చెల్లి రోజాను గ‌ట్టిగా హెచ్చ‌ రించ‌లేని స్థితి  ఆ  అన్న‌ది. చెల్లి రోజా కేవ‌లం న‌వ్వ‌డం త‌ప్ప ఇంకేమీ చేయ‌ల‌ని ప‌రిస్థితుల్లో మౌనంగా ఉండిపోతోంది. ప‌ర్య‌ట‌క మంత్రి ప‌ద‌వి మూన్నాళ్ల ముచ్చ‌ట‌గానే అయింది. జ‌బ‌ర్ ద‌స్త్ సీన్లు రిపీట్‌గా చూపించినా అస్సలు న‌వ్వు చిలికే ప‌రిస్థితి లేదు.  ఇక తెలంగాణా ముద్దుబిడ్డ‌, తెలంగాణా ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుమార్తె క‌ల్వ‌కుంట్ల క‌విత. హైద‌రాబాద్ జెఎన్‌టీయూలో ఇంజ‌నీ రింగ్ చేసిన క‌విత రాజ‌కీయాల్లోకి రావ‌డానికి ముందు సామాజిక కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. 2006లో న‌ల్గొండ జిల్లాలో కొన్ని గ్రామాల‌ను ద‌త్త‌త తీసుకుని వాటి అభివృద్ధికి తోడ్ప‌డ్డారు. ఆమె భ‌ర్త అనిల్ కుమార్  ఇంజ‌నీర్‌. క‌ల్వ‌కుంట్ల క‌విత అనేక కార్మిక సంఘాలు, ట్రేడ్ యూనియ‌న్ల త‌ర‌ఫు న కూడా కొంత కాలం ప‌నిచేశారు. 2014లో తెలంగాణా ఆవిర్భావం, కావ‌డంతో ఆమె నిజా మాబాద్ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీచేసి ఏకంగా ల‌క్షా 70వేల మెజారిటీతో గెలిచారు. ఎంపీగా తెలంగాణా, ఇత‌ర జాతీ య‌ స‌మ‌స్య‌ల్ని పార్ల‌మెంటులో చ‌ర్చించి జాతీయస్తాయిలో అన్ని పార్టీలూ ఆలోచించేలా చేశారు. పార్ల‌మెంటులో అనేక ప్ర‌ముఖ క‌మిటీల‌కు గౌర‌వ స‌భ్యురాలుగానూ ఉన్నారు. ఎంతో అద్భుతంగా సాగి పోతున్న ఆమె రాజ‌కీయ జీవితానికి ఊహించ‌ని విధంగా   ఢిల్లీ లిక్క‌ర్ కుంభ‌కోణం మాయ‌ని మ‌చ్చ‌గా త‌యార‌యింది. ఆమెను అప్ప‌టివ‌ర‌కూ ఎంతో మంచి స్నేహితురాలిగా, అక్క‌గా, చెల్లి గా భావించుకున్న రాజకీయ‌నాయ‌కులు, స‌న్నిహితులంతా దూర‌మ‌య్యే ప‌రిస్థితి వ‌చ్చింది. ఇది స్వ‌యంకృత‌మా అంటే అవున‌నే అంటున్నాయి వార్తలు. దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణా నికి సంబంధించి రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది.  తాజాగా ఈ స్కామ్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు వస్తు న్నా యి. ఈ కుంభకోణం వెనుక కవిత హస్తం ఉందని, మద్యం వ్యాపారంలో కమీషన్ల కోసం కక్కుర్తి పడ్డారని బీజేపీ ఎంపీ పర్వేశ్‌ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజీందర్‌ సిర్సా ఆరోపించారు. కేసీఆర్‌ కుటుంబ సభ్యుల సలహా మేరకే ఢిల్లీ మద్యం విధానం రూపొందిందని, ఈ విధానం రూపకల్పనకు సంబంధిం చిన భేటీ లకు కేసీఆర్ కుటుంబసభ్యులు హాజరయ్యారని పర్వేశ్ వర్మ ఆరోపిం చారు. సీఎం కేసీఆర్ కుటుంబానికి ఢిల్లీ లిక్కర్ కుంభ కోణంతో నేరుగా సంబంధం ఉందని, ఎక్సైజ్ కమిషనర్‌తో పాటు కేసీఆర్ కుటుంబం కూడా డీల్‌ రూపకల్పనలో భాగస్వామమై ఉందన్నారు. త‌ర్వాత డొంక క‌దిలి హైద‌రాబాద్‌లోనూ ఈడీ, సీబీఐ దాడులు, సోదాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. తాజాగా ఆర్‌.ఎస్‌. బ్ర‌ద‌ర్స్ వంటి పెద్ద పెద్ద మాల్స్ ల్లోనూ సోదాలు జ‌ర‌గ‌డం సాధార‌ణ మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాన్నీ ఆశ్చ‌ర్య‌ ప‌రిచింది. ఇపుడు క‌విత‌కు త‌ప్పించు కునేందుకు స‌మ‌యం త‌గ్గింది. ఉచ్చుబిగుస్తోంద‌న్న వార్త‌లే విన‌బ‌డుతున్నాయి. ఒక‌వంక మునుగోడు ఉప ఎన్నిక‌, మ‌రో వంక కుమార్తె క‌విత రాజ‌కీయ భ‌విత రెండూ తెలంగాణా ముఖ్య మంత్రి కేసీఆర్‌కు క‌డు ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల్లోకి నెట్టేశాయి. కూతురిని కాపాడుకోవ‌డానికి ఢిల్లీలోనే కేసీ ఆర్ మకాం వేశారు. కేంద్రం మీద విరుచుకు ప‌డే కేసీఆర్ ఇపుడు కేంద్రంలోని కీల‌క బీజేపీ నాయ‌కుల‌తో మంతనాలు చేస్తున్నారు. కూతురుని ఆ ఉచ్చునుంచి త‌ప్పించాల ని వేడుకుంటు న్నార‌నే అనాలి. త‌న‌ను త‌న తండ్రి ర‌క్షించాలి, బీజేపీ మాట వినే ఆర్ ఎస్ ఎస్ నేత‌లు ర‌క్షించాల‌ని దేవుడిని  ప్రార్ధిస్తున్నారు.  అన్ని దారులూ మూసుకుపోయి తాను రాజ‌కీయాల‌కు మ‌రీ దూర‌మ‌యి సాధా ర‌ణ మ‌హిళ‌గా మిగిలిపోవ‌డం కంటే తండ్రి స‌హ‌కారంతో కేంద్రంలో వారిచేత స‌రే ర‌క్షిస్తామ‌ని పించుకోవ‌డ‌మే ఇక క‌విత‌కు మిగిలింది. కానీ అది అంత సులువుగా జ‌రు గుతుందా అన్న‌దే అను మానం. తెలంగాణా రాజ‌కీయ నాయ కులు అంద‌రూ కేంద్రం మీద ప్ర‌తీ అంశంలోనూ విరుచుకు ప‌డుతున్నారు. మునుగోడులో గెల‌వాల‌న్నా, పోనీ ప‌రువు ద‌క్కించుకోవాల‌న్నా ఈ కుంభ‌కోణం ఉచ్చునుంచీ క‌విత య‌మ‌ర్జంట్‌గా బయట ప‌డాలి. కేసీఆర్ సొంత‌గా విమానం కొన‌డం మంచిద‌యిం ద‌నే అనుకోవాలి. ఢిల్లీ, హైద‌రాబాద్ చ‌క్క‌ర్ల‌కు ఇబ్బంది లేకుం డా పోయింది. లేకుంటే ప్ర‌తీ విమానాశ్ర‌యంలోనూ కూతురు గురించి ప్ర‌తీవారూ ప్ర‌శ్నించి వేధిం చే అవ‌కాశ‌మే ఉంటుం ది.కేసీఆర్ త‌న ప‌రువు ప్ర‌తిష్ట ప‌క్క‌న‌పెట్టి కూతురు క‌ష్టాలు తీర్చ‌డానికి తండ్రిగా వ్య‌వ‌హ‌రిస్తారా, బీఆర్ ఎస్ అధినేత‌గానా, తెలంగాణా ముఖ్య‌మంత్రిగానా అన్న‌ది వేచి చూడాలి. కానీ క‌ల్వ‌కుంట్ల క‌విత మాత్రం లోలోప‌ల దుఖిస్తూ ఆట్టే రోజులు వేచి ఉండ‌లేక పోవ చ్చు. తండ్రి నుంచే స‌హాయం ఏమాత్రం అందు తుంది, ఆయ‌న ఏమాత్రం కాపాడుతాడ‌న్న‌దే భీతితో ఆమె ఎదురుచూస్తోంది. త‌మ్ముడు కేటీఆర్ మాత్రం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌న్న ప్ర‌చారం బాగా ఉంది. ఆయ‌న‌కు ఈ ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తే మ‌రో ఉన్న‌త ప‌ద‌వికి దారి సుగ‌మ‌మ‌వుతుంద‌న్న గొప్ప ఆనందం ఆయ‌న‌ది.

చంద్రబాబు.. పవన్ బేటీ.. ఏపీలో రాజకీయ వేడి

ఒక్క సమావేశం.. ఒకే ఒక్క సమావేశం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలను వేడెక్కించింది. ఔను రాజకీయ ముఖచిత్రం మారిపోతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరిలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రకటించిన స్వల్ప వ్యవధిలోనే దాదాపు అలాంటి చిత్రమే ఆవిష్కృతమైంది. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు విజయవాడ నోవాటెల్ లో బస చేసిన పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. ఇద్దరూ కలిసి సంయుక్తంగా విలేకరులతో మాట్లాడారు. ఆ తరువాత దాదాపు గంట సేపు ఇరువురూ ముఖాముఖీ భేటీ అయ్యారు. ఇప్పటికే జనసేన, బీజేపీ మిత్రపక్షాలు.. ఇరు పార్టీల మధ్యా పొత్తు ఉంది. అయినా ఈ మూడేళ్లలో ఇరు పార్టీలూ కలిసి పని చేసిన సందర్భాలు పెద్దగా లేవు. కలిసి పోరాటాలు చేసిన సందర్భమూ లేదు. చివరాఖరికి విశాఖపట్నంలో జనవాణి కార్యక్రమం జరిగే అవకాశం లేకుండా అడ్డంకులు సృష్టించిన సందర్భంలోనూ.. పవన్ కు మద్దతుగా బీజేపీ ముందుకు రావడంలో జాప్యం చేసింది. ముందుగా తెలుగుదేశం సంఘీభావం ప్రకటించింది. ఆ తరువాతే బీజేపీ పవన్ కల్యాణ్ కు సంఘీభావం ప్రకటిస్తూ ముందుకు వచ్చింది. సరే ఆ సంగతి పక్కన పెడితే విజయవాడ నోవాటెల్ హోటల్ లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ బేటీ రాష్ట్ర రాజకీయాలలో పొత్తలపై చర్చను మళ్లీ తెరమీదకు తీసుకు వచ్చింది. వీరి భేటీకి ముందు మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో కార్యకర్తలతో సమావేశంలో బీజేపీ విషయంలో తన అసంతృప్తి ఇసుమంతైనా దాచుకోకుండా వ్యక్తం చేశారు. ఆ తరువాత చంద్రబాబుతో భేటీ కావడంతో ఇరు పార్టీల మధ్య వచ్చే ఎన్నికల నాటికి పొత్తు పొడిచే అవకాశాలు కనిపిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలుగుదేశం, జనసేన పొత్త ఖాయమనీ, బీజేపీ కలుస్తుందా లేదా అన్నది ఆ పార్టీ తేల్చుకోవలసిన అంశమని అంటున్నారు. అన్నిటికీ మించి గంట సేపు ముఖాముఖీ భేటీలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య చర్చకు వచ్చిన అంశాలేమిటి? పొత్తుల ప్రస్తావన వారి మధ్య వచ్చిందా అన్న విషయంపై రాజకీయ వర్గాలలో తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. పొత్తు ఊహాగానాలకు బలం చేకూర్చే విధంగా వైసీపీ నుంచి ఒంటరి పోరుకు దమ్ముందా? అంటూ ఆవుకథలాంటి విమర్శలు వెల్లువెత్తాయి. కాగా నోవాటెల్ లో చంద్రబాబు పవన్ బేటీ సమయంలో ఓ పది నిముషాల పాటు మాత్రమే నాగబాబు, నాదెండ్ల మనోహర్ ఉన్నారు. ఆ తరువాత దాదాపు గంట సేపు బాబు, పవన్ కల్యాణ్ ముఖాముఖీ ముచ్చటించుకున్నాయి. కాగా విశ్వసనీయ వర్గాల సమాచారం మేరరు విశాఖలో ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరుపై పవన్ కల్యాణ్ చంద్రబాబుకు వివరించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉమ్మడి వేదిక ఏర్పాటు ఆవశ్యకతపై, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అన్ని పార్టీలనూ ఏకతాటిపైకి తీసుకురావాలని ఒక నిర్ణయానికి వచ్చారు. వామపక్షాలు, బీజేపీలను ఓకే వేదికపైకి తీసుకురావడం ఒకింత కష్టమైనా, రాష్ట్రంలో అరాచక పాలనను ఎదిరించేందుకు అందరినీ కలుపుకుపోవాలని ఇరువురు నాయకులూ అభిప్రాయపడ్డారు. ఇక వీరి బేటీలో ముందస్తు ఎన్నికల ప్రస్తావన కూడా వచ్చిందని అంటున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం పోరాటాలు చేస్తూనే మరో వైపు ఎన్నికలకూ సిద్ధం కావాల్సిన అవసరం ఉందని ఇరువురూ కూడా తమ సంభాషణలో అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. 

మూడు ప‌వ‌ర్‌గేమ్‌లు

షా నివాసంలో సౌరవ్ బహిష్కరణ స్క్రిప్ట్  కేంద్ర హోంమంత్రి అమిత్ షా 6-ఎ, కృష్ణ మీనన్ మార్గ్ అధికారిక నివాసంలో అక్టోబర్ 6 అర్ధరాత్రి జరిగిన సమావేశంలో సౌరవ్ గంగూలీకి బిసిసిఐ అధ్యక్షుడిగా రెండవసారి నిరాకరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో సీనియర్‌ షా ఉన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆయన కుమా రుడు జయ్ షా బీసీసీఐ కార్యదర్శిగా ఉన్నారు. కానీ అమిత్ షా ఏ రాష్ట్ర క్రికెట్ బాడీలో లేదా బీసీసీఐలో ఎటు వంటి పదవిని కలిగి ఉండరు. హాస్యాస్పదంగా, ఆ సమావేశంలో సౌరవ్‌కు రెండవసారి పదవిని నిరాకరించాలని కోరుతూ, మాజీ బీసీసీఐ అధ్యక్షుడు ఎన్‌. శ్రీనివాసన్ అతని డిమాండ్‌కు అతను చేసిన కొన్ని అవకతవ కలను పేర్కొన్నారు. వాస్త‌వానికి గంగూలీ బీసీసీఐ అధ్య‌క్ష‌స్థానంలో మ‌రింత కొన‌సాగా ల‌నే అనుకున్నాడు. అత‌న్ని కొన‌సాగించాల‌నేవారు, మ‌ద్ద‌తుదారులు ప్ర‌స్తుత ప‌రిస్థితుల దృష్ట్యా ఊగిస‌లాడారు. త‌మ అబిప్రా యాన్ని స్ప‌ష్టం చేయ‌డంలో వెనుకాడారు. చాలాకాలం నుంచే దాదా ఆ ప‌ద‌విలో ఉన్నారు గ‌నుక ఇక కొత్త వారికి అవ‌కాశం ఇవ్వ‌డం వ‌ల్ల వేరే ప్రాంతీయుల‌కు అవ‌కాశం వ‌స్తుంద‌ని, త‌ద్వారా ప్రాంతీయసంస్థ‌ల విష‌యంలో ఆ రాత్రి జరిగిన సమావేశంలో తీసు కున్న ఇతర నిర్ణయాలూ కప్పి పుచ్చడం కోసం తహతహ లాడాయి. ఎన్నిక‌యిన‌ సంస్థలలో రాజవం శాల ఉనికి, ప్రచారంపై ప్రధాని నరేంద్ర మోడీ అడ్డుకుంటు న్నారు. అమిత్ షా కూడా అందుకు ఆజ్యం పోస్తు న్నారు. త‌న  నివాసంలో స‌మావేశంలో  బీసీసీఐ ఉన్న తా ధికారులు జే షాకు రెండవసారి పదవిని ఇవ్వా లని నిర్ణయించారు, అంతే కాకుండా కేంద్ర క్రీడామంత్రి అనురాగ్ ఠాకూర్ సోదరుడు అరుణ్ ధుమాల్ పేరును  ఐపీఎల్‌ చైర్మన్ పదవి కీ ఖరారు చేశారు. పత్రికా స్వేచ్ఛ  వ్యాఖ్యపై  గెహ్లాట్ విరుచుకుపడ్డారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పిసిఐ) గత వారం రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మీడియా ప్రతి నిధులను తమ ప్రభుత్వా నికి ప్రకటనలు కావాలంటే ప్రచారం ఇవ్వాలని కోరినందుకు నిందించింది. డిసెంబర్ 16, 2019న విలేకరుల సమావేశంలో గెహ్లాట్  విజ్ఞానం కావాల‌నుకుంటే మా వార్త‌లు చూపించమ‌ ని అన్నారు. ఈ వ్యాఖ్య స‌ర‌దాగా  చేసినప్పటికీ, పిసిఐ సుమోటోగా గుర్తించి, ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి నోటీసు జారీ చేసింది. ఇటువంటి ప్రక టన ప్రజా స్వామ్య విలువలకు విరుద్ధం, మీడియా విశ్వసనీయత, స్వేచ్ఛను ప్రభావితం చేస్తుంద‌ని పిసిఐ పేర్కొం ది. రాజస్థాన్ పత్రిక రాష్ట్రదూత్ ప్రతినిధి ఈ విషయాన్ని పీసీఐ దృష్టికి తీసుకెళ్లారు. ఫిర్యాదుపైకి వెళ్లిన పిసిఐ విచారణ కమిటీ (ఐసి)  మీడి యాకు ప్రకటనలను ఉపయోగించడం పెద్ద అనారోగ్యం అని భావిం చింది. వార్తల ప్రవాహాన్ని ప్రభావితం చేయడానికి  గెహ్లాట్ ఈ కర్రను ఉపయో గించడ‌మేకాదు,  దీనికి ప్ర‌చా రం కూడా చేశారని, మరికొందరు మరింత విచక్షణతో ఉన్నారని కమిటీ పేర్కొంది. పిసీఐలో ప్రతి రెండవ ఫిర్యాదు ప్రభుత్వాలు,  ప్ర‌భుత్వ‌ విభాగాలు ప్రభుత్వ ప‌రిమి తిని అనుసరించని మీడియా సంస్థలకు ప్రక టనలను తిర స్కరించే సమస్యకు సంబంధించినదని పేర్కొం ది. కొన్ని మార్గదర్శ కాలు లేదా చేయవలసినవి, చేయకూడనివి రూపొం దించడానికి పిసీఐ సమస్యను లోతుగా పరిశీలించాల్సిన అవసరం  ఉం దని కమిటీ భావించింది. తోచిన‌ట్టు ఆడుతున్నారు..  ఖర్గే కాంగ్రెస్ ఓటర్లు అక్టోబర్ 17న కొత్త పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. పదేపదే నిరా కరణలు చేసినప్పటికీ, ఎన్నికల ప్రచారంలో మల్లికార్జున్ ఖర్గేకు గాంధీ కుటుంబం మద్దతు ఉందని, తత్ఫలితం గా రాష్ట్ర పార్టీ యూనిట్ల మద్దతు ఉందని సందేహం మిగిల్చింది. ఖర్గే ప్రత్యర్థి శశిథరూర్ పర్య టన సందర్భంగా ఆయనను కలుసుకుని పలకరించడానికి కూడా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నిరాకరించారు. ఇద్దరు అభ్యర్థులను సమానంగా చూడాలని పార్టీ ఆదేశాలు జారీ చేసినప్పటికీ,  స్థాయి ఆట తీరు లేకపోవడంపై థరూర్ చేసిన ఫిర్యాదు పూర్తిగా తప్పు కాదు. కొంతమంది రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గేకు తమ రాష్ట్రాలకు చెందిన ఓటర్లందరి మద్దతు ఉంటుందని వ్యక్తి గతంగా హామీ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఒక ముఖ్యమంత్రి  కూడా  ఖర్గేకి ఇదే హామీ ఇచ్చారు. ఎన్నికలకు సంబంధించి జారీ చేసిన మార్గదర్శకాల్లో పార్టీ ఆఫీస్ బేరర్‌లు ఏ అభ్యర్థికి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని కోరారు. అయితే థరూర్‌పై పరోక్షంగా దాడి చేయడం ద్వారా లేదా ఖర్గేను ప్రశం సించడం ద్వారా ఖర్గేను నెత్తినెత్తుకోవ‌డం గురించి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఖర్గే తన నామినేషన్ పత్రాలపై సంతకం చేయడానికి పార్టీలోని దాదాపు మొత్తం అగ్ర నాయకత్వాన్ని కూడా ఆకర్షించగలి గారు. ఖర్గేకు అనుకూలంగా ఈ మద్దతు కూడగట్టడం వల్ల వారు ఎవరికి ఓటు వేస్తారనే దానిపై ఓటర్ల మనస్సు లలో చిన్న సందేహం ఉంది. అందువల్ల, ఖర్గే గాంధీ కుటుంబ ప్రతినిధి అని చెప్పడం తప్పు కాదు, కుటుంబం సహాయంతో  కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికవుతారు. అయితే ఆయ‌న గాంధీ కుటుంబం మాట‌కే  లొంగి పార్టీ వ్య‌వ‌హారాలు చేప‌డ‌తారా, స్వంత ఆలోచ‌న‌ల‌తో కార్య‌క‌ర్త‌ల‌ను ముందుడువేయిస్తారా అన్న‌ది చూడాలి. ఎన్ని చెప్పుకున్నా, ఎంత చేసినా కాంగ్రెస్ పార్టీలో మాత్రం గాంధీ కుటుంబం మాటే చెల్లుబాటు అవుతుంది. 

సోనియానే సుప్రీం లీడర్.. అందరి నోటా అదే మాట!

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ముగిసింది. బుధవారం ( అక్టోబర్ 19) న కౌంటింగ్ జరుగుతుంది. పోటీలో ఉన్న మల్లికార్జున ఖర్గే, శశి థరూర్ లలో ఎవరు గెలుస్తారో అందరికీ తెలుసు. అయినా, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీ  మంత్రి  చిదంబరం చెప్పినట్లుగా  అందిరికీ తెలిసిందే అయినా, శంఖంలో పోసే వరకు ఆగితే పోయేదేమీ లేదు. అయితే  ఇప్పడు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నది అసలు ప్రశ్నే కాదు. అయితే ఖర్గే కాదంటే (అనే ప్రశ్నే లేదని అంతరాత్మ ఘోషిస్తోంది) థరూర్. ఇద్దరిలో ఎవరు గెలిచినా పెద్దగా ఫరక్ పడదు. కానీ, ఇంచుమించుగా పాతికేళ్ళ తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష స్థానంలో గాంధీలు కాకుండా వేరొకరు కూర్చోవడం కాంగ్రెస్ నాయకులు చాలా మందికి, ఇదొక అనూహ్య వాస్తవం, థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కావచ్చును.   అదలా ఉంటే కాంగ్రెస్ వ్యవహారాల్లో ఇకపై గాంధీలు (సోనియా, రాహుల్, ప్రియాంకా) పోషించే పాత్ర ఏమిటి? ఇప్పడు చాలా మందిలో మరీ ముఖ్యంగా కాంగ్రెస్ వాదుల్లో ఉన్న సందేహం ఇది. అయితే  అధ్యక్ష పదవిలో లేనంత మాత్రాన గాంధీలు కాంగ్రెస్ కు దూరమై పోతారనో, పార్టీలో వారి పలుకు బడి పెత్తనం పలచబడి పోతుందనో అనుకుంటే అది పొరపాటే అవుతుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఎవరి దాకానో ఎందుకు, అధ్యక్ష రేసులో ముందున్న మల్లికార్జున ఖర్గేనే ఎన్నికల్లో తాను గెలిస్తే పార్టీని ముందుకు తీసుకుపోయే విషయంలో గాంధీల సూచనలు, సలహాలు తప్పక తీసుకుంటానని స్పష్టం చేశారు. అంతే కాదు  గాంధీల డైరెక్షన్ లో పనిచేయడం అవమానంగా భావించనని  రిమోట్ కంట్రోల్ అని అవహేళన చేసినా పట్టించుకోనని ఖర్గే తేల్చి చెప్పారు. శశి థరూర్ అంత ఓపెన్ గా ఆ మాట అనక పోయినా గాంధీల నాయకత్వాన్ని కాదనలేమని అయితే అంగీకరించారు. అంతే కాదు గాంధీలను దూరంగా పెట్టి కాంగ్రెస్ అధ్యక్షుడు స్వతంత్రంగా పనిచేయడం అయ్యేపని కాదని అన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత  40 ఏళ్లకు పైగా  కాంగ్రెస్ పార్టీకి సారధ్యం వహించిన గాంధీల డిఎన్ఎనే కాంగ్రెస్ రక్తంలో ప్రవహిస్తోందని థరూర్ కాంగ్రెస్ పార్టీ ని గాంధీలను వేరు చేసే చూడలేమని తేల్చి చెప్పారు.  అధ్యక్ష రేసులో ఉన్న ఆ ఇద్దరే కాదు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంబికాసోనీ, ముకుల్ వాస్నిక్, చిదంబరం, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గేహ్లోట్  ఇంకా అనేక మంది పార్టీ సీనియర్, జూనియర్ నాయకులు అందరూ కూడా  అధ్యక్షుడు ఎవరైనా గాంధీల నాయకత్వంలో పనిచేయవలసిందే అనే అభిప్రాయాన్నే వ్యక్త పరిచారు. గాంధీలతో కాంగ్రెస్ ను వేరు చేసేప్రయత్నాలు ఫలించవని అంబిక సోనీ పేర్కొంటే, ముకు వాస్నిక్ సోనియా గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న తర్వాత కూడా  గాంధీ కుటుంబమే కాంగ్రెస్ పార్టీ మూల స్థంభంగా నిలుస్తుంది, సోనియా గాంధీ పార్టీ నేతగా కొనసాగుతారని అన్నారు. సోనియా గాంధీ స్పూర్తిని ఆదర్శంగా తీసుకుని ఆమె అడుగుజాడల్లో కాంగ్రెస్ ముందకు సాగుతుందని వాస్నిక్ స్పష్టం చేశారు. అలాగే, రాహుల్ గాంధీ అడుగుజాడల్లో నడుస్తామని, మరో సీనియర్ అజయ్ కుమార్ పేర్కొన్నారు.  నిజానికి, సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నా, కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు అధ్యక్ష పదవితో పాటుగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటి సహా ఇతర  కీలక పదవుల్లో కొనసాగుతారు. అయినా జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్యమేల అన్నట్లు కాంగ్రెస్ పార్టీలో గాంధీలకు పదవులు ఎందుకు.. పదవులు ఉన్నా లేకున్నా ... కాంగ్రెస్ అంటే గాంధీలు, గాంధీలు అంటే కాంగ్రెస్ ... అంతేగా ...

ఇదేం భాష.. మర్యాదుండక్కర్లే?.. రాజకీయాలలో దిగజారుతున్న సంస్కారం

 నాడు... -ఒక రైలు ప్రమాదం జరిగిందని బాధ్యత వాహిస్తూ రైల్వే మంత్రి పదవికి రాజీనామా చేసి ఆఫీస్ బయటకు వచ్చి అధికారిక వాహనం వదిలేసిన లాల్ బహదూర్ శాస్త్రి. -ఎమర్జెన్సీ అనంతరం మురార్జీ దేశాయ్ ప్రధానిగా జనతా సర్కార్ ఏర్పాటైంది. మురార్జీ కేబినెట్ లో మంత్రిగా ఉన్న ఫెర్నాండెజ్ ఒక సభలో ఇందిరాగాంధీని నిరంతర అబద్ధాల కోరు అని విమర్శించడాన్ని స్వయంగా మురార్జీ తప్పుపట్టారు. ఆ విమర్శ ఆమె రాజకీయ అనుభవాన్ని కించపరిచేదిగా ఉందని ఫెర్నాండెజ్ ను మందలించారు. -  పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నపుడు, విపక్ష నేతగా ఉన్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి పీవీ విధానాలపై నిత్యం విమర్శలు కురిపించేవారు.అయితే, ఐక్యరాజ్య సమితిలో కశ్మీర్‌ సమస్యపై మాట్లాడేందుకు దేశ ప్రతినిధిగా పీవీ వాజ్‌పేయినే  పంపారు. నేడు... -ఈడీలు కాదు బోడిలను పెట్టుకో.. ఏం పీక్కుంటావో పీక్కో.. ఈడీ వస్తే నాకే చాయి తాపీ పోవలె.. మోడీ నువ్వు గోకినా.. గోకక పోయినా నేను గోకుతూనే ఉంటా  -మునుగోడు ప్రజా దీవెన సభలో సీఎం కేసీఆర్ చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చినా పర్వాలేదు. చంద్రబాబుకు కళ్లు నెత్తికెక్కాయి.. ఉరిశిక్ష వేసినా తప్పు లేదు  -విపక్ష నేతగా ఉండగా వేర్వేరు రోడ్ షోలలో జగన్ సమస్యలు, కష్టాలు ఇవేవీ నన్ను కదిలించలేవు, నన్ను బెదిరించలేవు. దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో ఉన్నంతకాలం వాళ్లు నా వెంట్రుక కూడా పీకలేరు.    - సీఎం జగన్ -  ఒరేయ్ వెధవల్లారా, సన్నాసుల్లారా, దద్దమ్మల్లారా.. నా సహనమే రా ఇంత కాలం మిమ్మల్ని రక్షించింది. ఏరా వైసీపీ గూండాల్లారా.. ఒంటి చేత్తో వస్తాం మెడ పిసికి కింద తొక్కేస్తాం కొడకల్లారా -జనసేన అధినేత పవన్ కల్యాణ్   రాజకీయ నాయకులు ప్రత్యర్థుల్లా కాకుండా శత్రువుల్లా మారిపోతున్నారనడానికి తెలుగు రాష్ట్రాలలో నాయకుల మాటలే తిరుగులేని నిదర్శనం. అందరు నాయకులూ ఇలాగే సభ్య సమాజం ఆమోదించని భాషతో ప్రత్యర్థులపై దుమ్మెత్తి పోస్తున్నారని అనడానికి లేదు. గంజాయివనంలో తులసి మొక్కల్లా చంద్రబాబు వంటి నేతలూ ఉన్నారు. ఆయన విమర్శలు వాడిగా ఉంటాయి, సూటిగా ఉంటాయి. అయితే ఎన్నడూ వ్యక్తిగత విమర్శలు చేసిన సందర్భం లేదు. అయితే ఆయన సమకాలీనుడై తెలంగాణ సీఎం కేసీఆర్ కానీ, జూనియర్లైన జగన్, పవన్ కల్యాణ్ లు కానీ ఆ పరిణితిని, సంయమనాన్ని పాటించడం లేదు. నాటి రాజకీయ నాయకుల హుందాతనం, పరస్పరం గౌరవించుకునే సంస్కారం నేడు కాగడా పెట్టి వెతికినా కనిపించని పరిస్థితి. ఒక నాయకుడు తన ప్రవర్తనతో, రుజు వర్తనతో అందరికీ ఆదర్శంగా నిలిచినప్పుడే ఆయన ఆధ్వర్యంలోని పార్టీ సమాజానికి మేలు చేసేలా రూపుదిద్దుకుంటుంది.  ఒక మార్గదర్శనం చేయగలుగుతుంది. యధారాజా తథా ప్రజా అన్నట్లుగా పార్టీ నాయకుడే మర్యాదను గాలికి వదిలేసి అమర్యాదకరమైన భాషను ఉపయోగిస్తే ఆయన నాయకత్వంలోని పార్టీ శ్రేణులూ అదే దారిన నడుస్తారు. అప్పుడుఅరాచకం వినా మరొకటి ఉండదు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో పరిస్థితి అలాగే తయారైంది. తెలుగు రాష్ట్రాలలో రాజకీయాల పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంభోట్టు అన్నట్లుగా తయారౌతోందనడానికి   నాయకుల ప్రసంగాలే ప్రత్యక్ష నిదర్శనం.  రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు అంశాల వారీగా సిద్ధాంతం ప్రాతిపదికపై ఉండటం అనేది మర్యాద. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నేతలే మర్యాద ముసుగు తీసేసి ఇష్టారీతిగా మాట్లాడుతున్న పరిస్థితి నేడు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాల అధ్వాన స్థితికి అద్దం పడుతోంది. చదవేస్తే ఉన్న మతి పోయిందన్న చందంగా నేటి రాజకీయ నాయకుల తీరు ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావునే తీసుకుంటే.. ఆయనేమీ సామాన్యమైన నాయకుడు కాదు.. తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు నాయకత్వంలో పని చేసిన వ్యక్తి.. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అన్న మహనీయుడి వద్ద రాజకీయ ఓనమాలు దిద్దిన కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపి ఐదు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను సాకారం చేసి ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందారు.  అటువంటి నేత నోటి నుంచి నేడు గోకుడో పాఖ్యానం వినడమే రాజకీయాల నేతల భాషా దారిద్ర్యానికి,  విలువల పతనానికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇక ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అశేష ప్రజాభిమానాన్ని సంపాదించుకున్న నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు. ఆయన కూడా కేవలం అధికారమే పరమావధిగా నేలబారు మాటలతో ప్రసంగాలతో రాజకీయ మర్యాదకు తిలోదకాలిచ్చేసి ప్రసంగాలు చేయడం విలువల పతనానికి పరాకాష్టగా చెప్పాలి. ప్రత్యర్థులపై విమర్శలకు ఆయన ప్రయోగించే భాష  ఉపయోగించే  సంస్కార లేమికి పరాకాష్టగా ఉంటుందనీ. వెంట్రుక కూడా పీకలేరు.. కాల్చి పారేయాలి.. ఉరి తీయాలి వంటి భాషా ప్రయోగం ఆయనకే చెల్లిందని పరిిశీలకులు చెబుతున్నారు. అలాగే జనసేనాని పవన్ కల్యాణ్ విషయాన్నే తీసుకుంటే ఇంత కాలం పొల్లు మాటలకు దూరంగా హుందా రాజకీయ వేత్తగా గెలుపోటములకు అతీతంగా ప్రజల కోసమే నిలబడతానని  చెప్పుకుంటూ వచ్చిన పవన్ కల్యాణ్ మంగళవారం (అక్టోబర్ 18)మంగళగిరిలో పార్టీ క్యాడర్ తో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. గొప్ప గొప్ప గ్రంథాలను అధ్యయనం చేసి... ఆ స్ఫూర్తితో ప్రజా సేవ కోసం రాజకీయాలలోకి వచ్చినని చెప్పే పవన్ కల్యాణ్ వైసీపీ తీరును, వైసీపీ నాయకులతీరును ఎండగట్టడానికి ఉపయోగించిన భాష సభ్య సమాజానికి ఆమోదయోగ్యమైనది ఎంత మాత్రం కాదని పరిశీలకులు అంటున్నారు. వాస్తవానికి ఇంత కాలం జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎక్కడా సంయమనం కోల్పోకుండా మంచి మాటలతోనే తన భావాలను వ్యక్త పరిచేవారు. కానీ మంగళవారం (అక్టోబర్ 18) మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ క్యార్యకర్తల సమావేశంలో ఆయన పరుష పదజాలం ఉపయోగించారు. విశాఖ ఘటనల నేపథ్యంలో వచ్చిన ఆవేశం వల్లనో, పెద్ద సంఖ్యలో తన పార్టీ కార్యకర్తలపై కేసులు బనాయించి అరెస్టులు చేసినందువల్ల వచ్చిన ఆగ్రహమో కానీ ఆయన కూడా మర్యాద గీత దాటేశారు. అయితే తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఈ అధమస్థాయి భాషా ప్రయోగం ఇటీవల కాలంలోనే అంటే దాదాపుగా ఓ దశాబ్దం కిందటే ఆరంభమైందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ప్రజల ఆమోదంతో సంబంధం లేకుండా ప్రత్యర్థులపై దుర్భాషలాడటం, ప్రత్యర్థులను మానసికంగా బలహీనులను చేయడమే లక్ష్యంగా రాజకీయ నేతలు దిగజారుడు భాష ఉపయోగిస్తున్నరని పరిశీలకులు అంటున్నారు. ఏపీలో అసెంబ్లీ సాక్షిగా విపక్ష నేత చంద్రబాబు కుటుంబ సభ్యులపై చేసిన అధికార పక్ష సభ్యులు కొందరు చేసిన నీచ వ్యాఖ్యలు ఈ కోవలోకే వస్తాయి. ఏపీలో అయితే  వైసీపీ నేతల భాష సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునేలా  ఉందనడంలో సందేహం లేదు. మాజీ మంత్రులు కొడాలి నాని, అనీల్ కుమార్ యాదవ్, మంత్రులు రోజా, అమర్ నాథ్ వంటి వారు రాజకీయ ప్రత్యర్థులను ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు, ఉపయోగిస్తున్న భాష వారి దిగజారుడు తనానికి నిదర్శనాలుగా ఉన్నాయంటున్నారు. అయితే రాజకీయ భాష ఇంత అధమ స్థాయికి దిగజారిపోయిన తరుణంలో కూడా గంజాయివనంలో తులసి మొక్కలా కొందరు నాయకులు విలువలకు పెద్ద పీట వేస్తూ పల్లెత్తి పరుషంగా మాట్లాడకుండా సిద్ధాంతానికే కట్టుబడి మాట్లాడుతున్న వారూ  ఉండటం,  ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు, ప్రజాజీవితంలో నేతలలో విలువల పరిరక్షణకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్న తీరు ఒక్కటే ప్రజాస్వామ్య వాదులకు ఊరటగా ఉందని పరిశీలకులు అంటున్నారు. అలాంటి నాయకులలో మొదటి వరసలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఉంటారని రాజకీయాలకు అతీతంగా సీనియర్ నాయకులు అంటున్నారు.  చంద్రబాబు విధానాలను తీవ్రంగా వ్యతిరేకించే వామపక్ష నేతలు కూడా ఆయన స్టేట్స్ మన్ షిప్ ను గౌరవిస్తామని చెబుతుంటారు. అలాగే బీజేపీ సీనియర్ నేతలు సైతం చంద్రబాబు దార్శనికతకు ఫిదా అయ్యామని అంటారు.  అయితే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ భాష విషయంలో కనీస జాగ్రత్తలు తీసుకోకుండా మాట్లాడేస్తున్నారు. పరుష పదజాలం, దూషణల ద్వారా వారు తమ పార్టీ క్యాడర్ కు కానీ, ప్రజలకు కానీ ఇచ్చే  ఇస్తున్న సందేశం ఏమిటి? సంకేతమేమిటి? అన్నది ఆయా నేతలే తెలుసుకోవలసి ఉంటుంది. లేకుంటే ప్రజలే వారి నోళ్లకు తాళం వేసే  రోజు వస్తుందని పరిశీలకులు అంటున్నారు. నెహ్రూ, లాల్ బహదూర్శాస్త్రి, వాజ్ పేయి, రాజాజీ వంటి నేతలు రాజకీయ యవనికపై ఎంత హుందాగా వ్యవహరించాలో.. సైద్ధాంతిక విభేదాలపై పోరు కూడా ఎంత స్నేహపూర్వకంగా చేయవచ్చో చూపారు. ఇప్పటికైనా నేతలు తమ భాష మార్చుకుని రాజకీయ మర్యాద, హుందాను పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పరిశీలకులు అంటున్నారు. లేదంటే ప్రజా క్షేత్రంలో వారికి గుణపాఠం తప్పదంటున్నారు. 

ఎంపి భరత్ ఆధ్వర్యంలో అమరావతి రైతులపై దాడి

శాంతియుతంగా మహాపాదయాత్ర సాగనివ్వకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టించేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమౌతున్నాయి. మహాపాదయాత్ర ఉత్తరాంధ్రకు చేరువ అవుతున్న కొద్దీ వైసీపీలో ఉన్మాదం కట్టలు తెంచుకుంటోంది. శాంతి భద్రతల సమస్య సృష్టించైనా సరే యాత్రను ఆపడానికి అన్ని విలువలనూ తుంగలోకి తొక్కి రౌడీమూకల్లా రెచ్చిపోతున్నారు. దాడికి పాల్పడడానికి వెనుకాడటం లేదు. పెట్రోలు చల్లైనా సరే రైతుల మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. రాజమండ్రిలో అదే జరిగింది. ప్రశాంతంగా సాగుతున్న పాదయాత్రను అడ్డుకోవడానికి వైసీపీ ఎంపీ నేతృత్వంలో ఆ పార్టీ శ్రేణులు రౌడీ మూకల్లా వ్యవహరించాయి. పాదయాత్ర దారిలో సభ ఏర్పాటు చేసిన రాజమండ్రి ఎంపీ ఎంపీ భరత్ రెండు మూడు వందల మందిని సమీకరించి పాదయాత్రలో ఉన్న రైతులపై దాడి చేయించారు. అసలు రైతుల మహాపాదయాత్ర రాజమండ్రి చేరడంతోనే కవ్వింపులకు దిగిన వైసీపీ శ్రేణులు రైతులపైకి కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరారు. వారిని ఎంపీ భరత్ ప్రోత్సహించారు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.   రైతుల మహాపాదయాత్రకు భద్రత కల్పించాల్సిన పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. అసలు మహాపాదయాత్ర జరుగుతున్న మార్గంలో నడి రోడ్డు మీద సభకు పోలీసులు ఎలా ఎందుకు అనుమతించారో అర్థం కావడంలేదని స్థానికులే విస్తుపోతున్నారు .వైసీపీ దాడులు జరిపినా రైతులు మొక్కవోని ధైర్యంతో యాత్ర కొనసాగించారు. ప్రజలు రైతులకు బ్రహ్మరథం పట్టారు. పూలవర్షం కురిపించారు. ఇంత బహిరంగంగా ఎంపీ పర్యవేక్షణలో రైతులపై దాడి జరిగినా పోలీసులు ఒక్క కేసు కూడా నమోదు చేయకపోవడం గమనార్హం.

మాటలొద్దు మంత్రిగారు చేతల్లో చూపండి!

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు మొత్తంగా రాజధాని చుట్టూనే తిరుగుతున్నాయి. నిజానికి ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విషయంలో ఎలాంటి వివాదం లేదు. అదొక వివాదమే కాదు. చట్ట పరంగా చూసినా, మరోల చూసినా, అమరావతి ఆంధ్ర ప్రదేశ్ ఏకైక రాజధాని.అందులో మరోమాటకు అవకాశమే లేదు. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం చేసింది. కేంద్ర ప్రభుత్వం గెజిట్’లో ప్రకటించింది. న్యాయస్థానాలు తీర్పులిచ్చాయి. ఎనిమిదేల్లాకు పైగా, అకడి నుంచే పరిపాలన సాగుతోంది., ఏపీ ఏకైక రాజధాని అని చెప్పేందుకు ఇంకేమి కావాలి, అంటే, సమాధానం ఉండదు. ఒక విధంగా బీజేపీ వారి భాషలో చెప్పాలంటే, ప్రత్యేక హోదా వివాదం లానే, రాజధాని విషయం కూడా ముగిసిన అధ్యాయం.   కానీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వం లేని సమస్యను సృష్టించి, రాజకీయ ప్రయోజనం పొందాలనే కుటిల ప్రయత్నం చేస్తున్నారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి మరో ప్రాంతీయ వాదానికి తెర తీసే కుట్ర చేస్తున్నారా? అనే సందేహం వచ్చేలా, ప్రభుత్వ చర్యలుతున్నాయి. అఫ్కోర్స్  ప్రభుత్వ నిర్ణయం వెనక అస్మదీయుల ఆర్థిక ప్రయోజానాలు కూడా ఉన్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి.  అందుకే  వైసీపీ విశాఖలో జేఏసీ పేరున గర్జన సభ నిర్వహించింది. నిజమే  ఏ పేరున జరిగినా అది వైసీపీ స్పాన్సర్డ్ షో, కిరాయి ఆందోళన అనే విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. అస్మదీయులు వ్యాపార ప్రయోజనాలను కాపాడుకునేందుకే  వైసీపీ రాజకీయ వ్యాపార గర్జన చేసిందనేది అందరికీ తెలిసిన విషయమే. విజయసాయి రెడ్డి ఇతర వైసీపీ నేతలపై వస్తున్న భూదందా ఆరోపణలను పరిగణననలోకి తీసుకుంటే, వికేంద్రీకరణ మంత్రం అసలు రహస్యం ఏమిటో అందరికీ అర్థమవుతుంది.  అందుకే  మంత్రులు  విశాఖను ఆర్థిక రాజధానిగా చేసి తీరుతామని గర్జిస్తున్నారు. ఎవరు అడ్డుకున్నా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామంటున్నారు. మరో వైపు మూడు రాజధానులు వద్దు, అమరావతినే ఏకైక రాజధానిగా కొనాసాగించాలి కోరుతూ  రైతులు మహా పాదయాత్ర చేస్తున్నారు. ఆ పాదయాత్రకు వ్యతిరేకంగానే వైసీపీ మహా గర్జన ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా విశాఖను ఆర్థిక రాజధానిగా చేసి తీరుతామని మంత్రులు శపథం చేశారు. అంటే  వికేంద్రీకరణ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు వైసీపీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని అనుకోవచ్చని పరిశీలకులు అంటున్నారు.   అయితే  రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాల స్టాండ్ ఏమిటి, ప్రజల అభిమతం ఏమిటి అనే విషయంలో అందరికీ క్లారిటీ వుంది. ఎవరికీ ఎలాంటి అనుమానాలూ లేవు. రాష్ట్రంలో ఒక్క వైసీపీ మినహా మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, ప్రజలు అమరావతి ఏకైక రాజధానికే  ఓటేశారు.అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని అంటున్నారు. చివరకు రాష్ట్రంలో సున్నాఅయినా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్ర శాఖ కూడా  అమరావతికే ఓటేసింది. అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుందని అంటోంది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం గోడ మీది పిల్లి వాటంగా ఎటూ తేల్చకుండా  అసలు కేంద్రానికి సంబంధమే లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది. అధికార వైసేపీ వికేంద్రీకరణ పేరిట సాగిస్తున్నఅరాచకాన్ని అడ్డుకునే ప్రయత్నం ఏదీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దాఖలు కనిపించడం లేదని బీజేపీ, వైసీపీ యేతర రాజకీయ పార్టీలు  అక్షేపిస్తున్నాయి. ఇదలా ఉంటే ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ కి అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని అన్నారు. అంతే కాదు అమరావతే రాజధాని అని ప్రధాని నరేంద్ర మోడీ తనకు చెప్పారంటూ చెప్పుకొచ్చారు. అందుకే అమరావతికి బీజేపీ కట్టుబడి ఉందని అన్నారు.  ఆవు కథను మళ్ళీ వినిపించారు. ఎవరు ఎన్ని చెప్పినా ఎవరు ఏది చేసినా రాజధాని మార్చే ప్రసక్తే లేదని కిషన్‌రెడ్డి తేల్చి చెప్పారు. అయితే, ఆంధ్ర ప్రదేశ్ కి అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని ఇంత ఘంటాపథంగా చెపుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కానీ, మరో మంత్రి, బీజేపీ నాయకులు కానీ మూడు రాజధానుల పేరిట అరాచకానికి తెర తీసిన రాష్ట్ర ప్రభుత్వం పై ఎందుకు చర్యలు తీసుకోదని  సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఆ చెప్పేదేదో కిషన్ రెడ్డి ఒక్కరికే చెవిలో కాకుండా  నేరుగా ప్రజలకే చెపితే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంతి జగన్ రెడ్డి మళ్ళీ ‘మూడు’ మాట ఎత్తరుకదా?  అని అడుగుతున్నారు. నిజానికి, కేంద్ర ప్రభుత్వం తమాషా చూస్తున్నట్లు చూస్తున్నది కాబట్టే  వైసేపీ గర్జన పేరిట విశాఖలో అరాచకానికి పాల్పడిందని అంటున్నారు. రౌతు మెత్తనయితే గుర్రం మూడు కాళ్ళ మీద పరిగెత్తినట్టు వైసేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని అంటున్నారు. నిజానికి  రాజధాని సమస్యను పరిష్కరించవలసిన చట్టబద్ధ బాధ్యతతో పాటుగా నైతిక బాధ్యత కూడా  కేంద్ర ప్రభుత్వంపై ఉందని కేంద్ర ప్రభుత్వం చట్టబద్ద బాధ్యత నుంచి తప్పించుకున్నా నైతిక బాధ్యత నుంచి తప్పించుకోవడం కుదరదని  రాజకీయ విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. అమరావతి నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ స్వహస్తాలతో శంఖుస్థాపన చేశారు. దివ్యమైన, భవ్యమైన రాజధాని నిర్మాణం జరుగుతుందని రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. హామీ ఇవ్వడమే కాదు, కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి రూ. 2,500 కోట్లు ఇచ్చింది. అంతే కాదు, 2017 బడ్జెట్ ప్రసంగంలో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజధాని రైతులకు ఆదాయ పన్ను మినహాయింపును ఇచ్చారు. అంటే, ఏ కోణం నుంచి చూసినా, రాజదాని అంశం కేంద్రం పరిధిలో లేని అంశం కాదు. కేంద్ర పరిధిలోనే ఉంది. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చవలసిన బాధ్యతా కేంద్రానికి వుంది. అందుకే కేంద్ర ప్రభుత్వ మంత్రి కిషన్ రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ కి అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని మాటలతో సరి పెట్టడం కాకుండా  చేతలలో చిత్తశుద్ధి చూపాలని ఏపీ ప్రజలు అంటున్నారు. వట్టి మాటలు కట్టిపెట్టోయ్ ...గట్టి మేల్ తలపెట్టవోయ్’ అన్న గురజాడ మాటలు గుర్తు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా?

ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా? 2014 ఎన్నికల నాటి పొత్తులు మళ్లీ పొడుస్తున్నాయా.. ఇందుకు బీజం   చాలా కాలం కిందటే పడిందా. అందుకు సంబంధించి ఇప్పుడు ఒక స్పష్టత వస్తోందా అంటే వరసగా గత మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఔననే అనక తప్పదు. విశాఖ గర్జన సందర్భం గా విశాఖపట్నం విమానాశ్రయం వద్ద జరిగిన ఘర్షణ, అది సాకుగా తీసుకుని పోలీసులు జనసైనికులపై కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, అంతటితో ఆగకుండా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను నోవాటెల్ హోటల్ దాటి బయటకు రాకుండా అడ్డుకోవడం, ఆంక్షల పేరు చెప్పి జనవాణి జరగకుండా ఆపడం వరకూ ప్రతి సంఘటనా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. రెండు రోజుల పాటు విశాఖలో నోవాటెల్ హోటల్ కే పరిమితమైన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు అన్ని రాజకీయ పార్టీలూ మద్దతుగా నిలిచాయి. సంఘీభావం ప్రకటించాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి పవన్ కల్యాణ్ తో మాట్లాడారు. విశాఖ ఘటనలపై అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ దమన నీతిని ఖండించారు. జనసేన పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అలాగే ఇటీవల కొద్ది కాలంగా జనసేనతో అంటీముట్టనట్టున్న మిత్రపక్ష బీజేపీ కూడా విశాఖ ఘటనల నేపథ్యంలో జనసేనకు సంఘీభావం ప్రకటించడమే కాకుండా జనసేన తమ మిత్రపక్షమని ఎలుగెత్తింది. వామపక్షాలు కూడా జనసేనకు అండగా ఉంటామని ప్రకటించాయి.  ఇప్పుడు విశాఖ సీన్ విజయవాడకు మారింది. విశాఖ నుంచి తిరిగి వచ్చిన జనసేన అధినేత ఈ రోజు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో బేటీ అయ్యారు. అలాగే విజయవాడ నోవాటెల్ హోటల్ లో జనసేనానిని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు కలిశారు. విశాఖ ఘటనలపై ఆరా తీశారు. ప్రభుత్వ నిర్బంధాన్ని, నియంతృత్వాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కలిసి పోరాడాలన్న దిశగా వారి మధ్య చర్చ జరిగిందని సమాచారం. అలాగే అమరావతి రైతుల పోరాటానికి ఇప్పటికే సంఘీభావం ప్రకటించిన ఇరు పార్టీలూ ఇకపై కలిసికట్టుగా అమరావతి రైతుల పక్షాల గళమెత్తాలని కూడా నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.   భవిష్యత్ లో ఈ సంఘీభావం ఎన్నికల పొత్తు కు దారి తీస్తుందా అన్న చర్చ ఇప్పటికే రాజకీయ వర్గాలలో ప్రారంభం అయ్యింది. కొద్ది కాలం కిందట అంటే రాష్ట్ర పతి ఎన్నిక సందర్భంగా బెజవాడలో ముర్ముతో టీడీపీ నేతల భేటీ వద్దంటూ వైసీపీ  బీజేపీపై ఎంత  ఒత్తిడి తసుకు వచ్చినా వినకుండా  ఆమెతో టీడీపీ నేతల భేటీ కి సోము వీర్రాజు వంటి నేతలు స్వయంగా పూనుకోవడం,  చంద్రబాబుకు   12+12 ఎన్‌ఎస్‌జీ సెక్యూరిటీ పెంచడం వీటన్నిటినీ కలిపి చూస్తే రాష్ట్రంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు దగ్గరౌతున్నాయనడానికి తార్కానంగా పరిశీలకులు భావిస్తున్నారు. అలాగే గతంలో ఢిల్లీలో  మోడీ అధ్యక్షతన జరిగిన ఆజాదీకా అమృతోత్సవ్ జాతీయ కమిటీ సమావేశానికి కేంద్రం నుంచి అందిన ఆహ్వానం మేరకు  చంద్రబాబు  హస్తిన వెళ్లడం, ఆ సందర్బంగా కొద్ది సేపు మోడీతో ముచ్చటించడాన్ని కూడా పరిశీలకులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.  

మునుగోడులో కేసీఆర్ కు ఓటమి భయం.. ఉప ఎన్నిక ఆపేందుకు యత్నం: బండి

మునుగోడు ఉపఎన్నికలో కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.  అందుకే ఏదోవిధంగా ఈ ఉప ఎన్నికను  ఆపడానికి ప్రయత్నిస్తున్నారని  ఆరోపించారు. ఇండిపెండెంట్ అభ్యర్థులకు సంబంధించిన ఎనిమిది గుర్తులను రద్దు చేయాలని టీఆర్‌ఎస్ వేసిన పిటిషన్‌ను రాష్ట్ర హై కోర్టు   కొట్టేయడంపై హర్షం వ్యక్తం చేసిన బండి సంజయ్  న్యాయం ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటుందని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో మంగళవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా యారగండ్ల పల్లిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి భయంతో కేసీఆర్ ఎన్నికలను ఆపాలని కుట్ర చేస్తున్నారనీ, అందులో భాగమే ఎన్నికల గుర్తులను రద్దు చేయాలంటూ టీఆర్ఎస్ కోర్టుకు వెళ్లిందన్నారు. టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా చివరకు విజయం న్యాయానిదేననీ, మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ విజయం తథ్యమని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి న్యాయస్థానంపై గౌరవం ఉందన్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ రద్దు చేయమని అడుగుతున్న గుర్తులు టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచీ ఉన్నాయనీ, మరి ఇన్నాళ్లూ లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కేసీఆర్  ప్రజలకు సమాధానం చెప్పాలని బండి డిమాండ్ చేశారు.  

బీసీసీఐ అధ్య‌క్షుడు బిన్నీయే.. ఎంత రాజ‌కీయ‌మో!

1983 ప్రపంచ కప్ విజేత రోజర్ బిన్నీ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(బ‌సీసీఐ) కొత్త అధ్యక్షుడయ్యాడు. భార‌త్‌ జ‌ట్టు మాజీ కెప్టెన్ దాదా సౌర‌వ్ గంగూలీ అధ్య‌క్షునిగా ప‌ద‌వీ కాలం ముగియ‌డంతో అత‌ని స్థానంలోకి బిన్నీని ఎంపిక‌చేశారు. అరుణ్ ధుమాల్ స్థానంలో జెపి ఎమ్మెల్యే ఆశిష్ షెలార్ కోశాధికారిగా ఉండే అవకాశం ఉంది. కాగా, బీసీసీఐ కార్యదర్శిగా జే షా తన పద విలో కొనసాగుతారు. అక్టోబరు 13న ముంబైలోని ట్రైడెంట్ హోటల్‌లో జరిగిన బీసీసీఐ సమావేశంలో దేశంలోని వివిధప్రాంతాల నుంచి వివిధ సంఘాలకు చెందిన ఆఫీస్ బేరర్లు బోర్డులోని వివిధ స్థానాలకు నామి  నేషన్లు దాఖలు చేశారు. భారత మాజీకెప్టెన్ కు ఐపీఎల్ ఛైర్మన్ పదవిని ఆఫర్ చేయగా, అతను దానిని తిరస్కరించాడు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) అధ్యక్ష పదవి కి గంగూలీ పోటీ చేయనున్నారు. అస‌లు క‌థలోకి వెళితే.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 6-ఎ, కృష్ణ మీనన్ మార్గ్ అధికారిక నివాసంలో అక్టోబర్ 6 అర్ధరాత్రి జరి గిన సమావేశంలో సౌరవ్ గంగూలీకి బిసిసిఐ అధ్యక్షుడిగా రెండవసారి నిరాకరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సమా వేశంలో సీనియర్‌ షా ఉన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆయన కుమారుడు జయ్ షా బీసీసీఐ కార్యదర్శిగా ఉన్నారు. కానీ అమిత్ షా ఏ రాష్ట్ర క్రికెట్ బాడీలో లేదా బీసీసీఐలో ఎటువంటి పదవిని కలిగి ఉండరు. హాస్యాస్పదంగా, ఆ సమావేశంలో సౌరవ్ కు రెండవసారి పదవిని నిరాకరించాలని కోరుతూ, మాజీ బీసీసీఐ అధ్యక్షుడు ఎన్‌. శ్రీనివాసన్ అతని డిమాండ్‌కు అతను చేసిన కొన్ని అవకతవకలను పేర్కొన్నాడు. సమావేశానికి హాజరైన బీసీసీఐలోని ఇతర ప్రముఖులు శ్రీనివాసన్ డిమాండ్‌ను సమర్థిం చడంలో సమయాన్ని వృథా చేశారు. ఆ రాత్రి జరిగిన సమావేశంలో తీసుకున్న ఇతర నిర్ణయాలూ కప్పిపుచ్చడం కోసం తహ తహలాడాయి. ఎన్నుకోబడిన సంస్థలలో రాజవంశాల ఉనికి, ప్రచారంపై ప్రధాని నరేంద్ర మోడీ ముం దంజలో దాడి చేసిన తర్వా త, షా నివాసంలో ఉన్న బీసీసీఐ ఉన్నతాధికారులు జే షాకు రెండవసారి పదవిని ఇవ్వాలని నిర్ణ యించారు, అంతేకాకుండా కేంద్ర క్రీడామంత్రి అనురాగ్ఠాకూర్ సోదరుడు అరుణ్ధుమాల్ పేరును కూడా ఐపీఎల్ ఛైర్మ‌న్‌ప‌ద‌వికి ఖరారు చేశారు.

మంత్రిగా ఉంటూ ఈ చిల్లర చేష్టలేంటి రోజా మేడమ్?

‘వేసిన రాయినల్లా ఒప్పుకుంటే.. వెర్రోడే గెలిచాడని’ సామెత ఒకటి ఉంది. అంటే.. ఆ మాదిరిగా ఉంది ఏపీ పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా తీరు అని పలువురు రాజకీయ నేతలు, ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.  విశాఖపట్నం విమానాశ్రయంలో రోజా ప్రవర్తించిన తీరుతో అనేక మంది ఆమెపై  అగ్గిమిద గుగ్గిలం అవుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ ఎయిర్ పోర్టుకు వస్తున్న సందర్భంగా ఆయనకు అఖండ స్వాగతం పలికేందుకు వచ్చిన జనసేన శ్రేణులు, నేతలను రెచ్చగొట్టే విధంగా మంత్రి రోజా ‘వేలు’ చూపించడంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది. మంత్రై ఉండీ అలాంటి చిల్లర చేష్టలేమిటని ప్రశ్నిస్తున్నారు. అమరావతే ఏకైక రాజధాని అన్న  డిమాండ్ తో ఆ ప్రాంత రైతులు అమరావతి టూ అరసవిల్లి మహా పాదయాత్ర ఉత్తరాంధ్రకు సమీపిస్తున్న క్రమంలో ‘విశాఖ గర్జన’ పేరుతో అధికార వైసీపీ ఆధ్వర్యంలో నాన్ పొలిటికల్ జేఏసీ పేరుతో శనివారం (అక్టోబర్ 15) జరిగిన కార్యక్రమంలో ఆ గర్జనలో మంత్రి రోజాతో సహా పలువురు ఇతర మంత్రుల, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలను అమరావతి రైతులపై రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేశారు. ఆ తర్వాత తిరిగి వెళ్లేందుకు రోజా సహా వైసీపీ నేతలు, కొందరు మంత్రులు కూడా విశాఖ విమానాశ్రయానికి వెళ్లారు. అదే సమయంలో ఉత్తరాంధ్రలో మూడు రోజుల పర్యటన కోసం, ‘జనవాణి’ కార్యక్రమం నిర్వహించేందుకు వస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ను స్వాగతించేందుకు జనసేన నేతలు, శ్రేణులు ఇసుక వేస్తే రాలనంత సంఖ్యలో ఎయిర్ పోర్టుకు వచ్చారు. ఆ సందర్భంగా ఎయిర్ పోర్టు ఆవరణలో రోజా తన వేలు చూపిస్తూ వారిని రెచ్చగొట్టారు. దాంతో జనసైనికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకోవడం.. మంత్రులకు, వైసీపీకీ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేయడం జరిగింది. ఆ సందర్భంగానే మంత్రుల కార్లపై దాడి జరిగింది. మంత్రులు విశాఖ ఎయిర్ పోర్టుకు వచ్చేటపుడు తాను అక్కడే ఉన్నానని, జనసేన నేతలు, కార్యకర్తలు హుందాగా వ్యవహరించారని టీడీపీ నేత బుద్దా వెంకన్న మంగళవారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. జనసైనికులకు మంత్రి రోజా వేలు చూపించారు. వేలు చూపించడానికి అర్థం ఏమిటో రోజాయే చెప్పాలి అని బుద్దా వెంకన్న అన్నారు. ఇటు జనసైనికులు కూడా రోజా వ్యవహరించిన తీరుపై కారాలు మిరియాలు నూరుతున్నారు. రోజా మరీ  హద్దుమీరి  వ్యవహరిస్తున్నారంటూ ఫైరవుతున్నారు. రోజా వేలు చూపించిన వీడియో క్లిప్పింగ్ చూసిన పలువురు ముక్కున వేలు వేసుకుంటున్నారు. ఓ మహిళ అయి ఉండీ, పైగా మంత్రి పదవిలో ఉండీ ఆమె అటువంటి చేష్టలకు పాల్పడటాన్ని తప్పుపడుతున్నారు.   రోజా ఇలా అసభ్యంగా ప్రవర్తించడం ఇదే తొలిసారి కాదని జనం గుర్తుచేసుకుంటున్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు.. అప్పటి సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా.. అప్పటి మంత్రి పీతల సుజాతపైన కూడా ‘వడ్డాణం’ అంటూ ఆమె ప్రదర్శించిన హావభావాలు చూసిన ప్రతి ఒక్కరూ తప్పుపట్టారు. అలాగే అసెంబ్లీలోనే  టీడీపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడి వైపు చూస్తూ  ‘… కోస్తా’ అంటూ ఆమె చేసిన విన్యాసం కూడా పలువురిని విస్మయా నికి గురిచేసింది.   మంత్రి పదవి  చేపట్టిన తరువాత  అయినా హుందాగా ప్రవర్తించకుండా ఇలాంటి చిల్లర చేష్టలకు పాల్పడుతుండాన్ని జనం అసహ్యించుకుంటున్నారు. రోజాకు ఇప్పటికైనా కాస్త ఇంగితం వస్తే బాగుండు అని వ్యాఖ్యానిస్తున్నారు.

డామిట్ ..భారాస ముహూర్తం అడ్డం తిరిగిందా ?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు దేవుడంటే భయం, భక్తి  కొంచెం ఎక్కువే. నిజానికి ఆయనే చెప్పుకున్నట్లుగా ఆయన చేసినన్ని యజ్ఞాలు, యాగాలు మరో రాజకీయ నాయకుడు ఎవరూ చేసి ఉండరు. అలాగే, ముహూర్తాలు, శకునాల విషయంలోనూ ఆయనకు గట్టి  విశ్వాసం ఉందని అంటారు. అందుకే మంచి చెడులు చూసుకోకుండా ఆయన ఏ నిర్ణయం తీసుకోరు. ఒక్క చిన్న అడుగు కూడా ముందుకు వేయరు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పేరును భారత రాష్ట్ర సమితి (భారాస)గా మార్చేందుకు  కూడా  ఆయన సుముహుర్తం చూసుకున్నారు. దసరా పండగ రోజు మధ్యాహ్నం ఒంటిగంట 19 నిమిషాలకు పేరు మార్పు పత్రాలపై సంతకం చేశారు.  అయితే, అంతగా ముహూర్తం చూసుకుని మరీ  పేరు మార్చినా అనుకున్నదేదీ జరగడం లేదు. ఫలితం కనిపించడం లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు  మరో అడుగు ముందుకు పడలేదు. కేసేఆర్ సంతకం చేసిన పత్రాలను పార్టీ నాయకులు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆగమేఘాల మీద అందచేశారు. కానీ, పత్రాలు అందుకుని పది రోజులు పైనే అవుతున్నా  అటు నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో మునుగోడు నుంచే భారాస,జాతీయ‘జైత్ర’యాత్రకు శ్రీకారం చుట్టాలనే కేసీఆర్ సంకల్పం నెరవేరలేదు .తొలి అడుగులోనే అపశకునం ఎదురైందా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బారాసాకు ఆదిలోనే హంసపాదు పడిందా అన్న సందేహాలూ వ్యక్తమౌతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికలలో గులాబీ పార్టీ అభ్యర్ధి కూసుకుట్ల ప్రభాకర రెడ్డి  తెరాస బీ ఫారం మీదనే నామినేషన్ వేయక తప్పలేదు. ఎంత త్వరగా వీలైతే అంట త్వరగా  తెలంగాణ పేరును వదిలించుకోవాలని కేసీఆర్ తొందరపడుతున్నా  తెలంగాణ మాత్రం ఆయన్ని వదలడం లేదు.  అదలా ఉంటే  కొందరు జ్యోతిష శాస్త్ర పండితులు  భారాస ముహూర్త ఫలంతో పాటుగా  కేసేఆర్ జాతక ఫలం జాతీయ రాజకీయాలకు ఏమాత్రం అనుకూలంగా లేదని అంటున్నారు. నిజానికి, జూన్ 29 నుచి, నవంబర్ చివరకు ఉన్న శుక్ర మౌఢ్యం (మూఢమి) కాలం  నూతన కార్యం తలపెట్టేందుకు ఎవరికీ, ఏ మాత్రం మంచి కాదని  కేసేఆర్ జాతక చక్రం ప్రకారం చూస్తే అసలే పనికి రాదని  దత్త పీఠం జ్యోతిష పండితులు దామోదర శర్మ వంటి కొందరు పండితులు, ముందు నుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు. అంతే కాకుండా  కాదు కూడదని, కేసేఆర్ అదే ముహూర్తానికి తెరాస పేరును బీఆర్ఎస్ గా మారిస్తే ఫలితాలు ప్రతికూలం కావడమే కాకుండా, కేసేఆర్ కుటుంబం మొత్తం కూడా సమస్యలు ఎదుర్కొనక తప్పదని ముందుగానే  చెప్పారు. ఇప్పుడిక జరుగతున్న పరిణామాలను గమనిస్తే, పండితుల జ్యోస్యం నిజమవుతున్నట్లే ఉందని పార్టీలో ఫామిలీలో చర్చ మొదలైందని అంటున్నారు. మునుగోడు ఉప ఎన్నిక విషయం ఎలా ఉన్నా  ఢిల్లీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు కేసీఆర్ ను సైతం కలవరపాటుకు గురి చేస్తున్నాయని అంటున్నారు. ఓ వంక తెరాస పేరును భారాసగా మార్చడం ఇప్పట్లో అయ్యే పనికాదని అర్థమైపోయింది. మునుగోడు సహా మరి కొన్ని రాష్ట్రాలలో ఉప ఎన్నికలు ఆ వెంటనే హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ఒక దాని వెంట ఒకటి లైన్లో ఉన్న నేపథ్యంలో  మరో మూడు నెలల వరకు కేంద్ర ఎన్నికల సంఘం తెరాస పేరు మార్పు వ్యవహారాన్ని పట్టించుకునే పరిస్థతి లేదని అంటున్నారు. అదీ గాక, పేరు మార్పు పై నిర్ణయం తీసుకోవాలంటే ముగ్గురు కమిషనర్ల ఫుల్ బెంచ్ సమావేశం కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఒక కమిషనర్ పోస్టు ఖాళీగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆ పోస్టును ఎప్పుడు భర్తీ చేస్తుందో ఎవరికీ తెలియదు. సో తెరాస పేరు భారాసగా ఎప్పుడు మారుతుందో  చెప్పలేమని కమిషన్ వర్గాలు చెపుతున్నాయి. పేరు మార్పు  ప్రక్రియ మొదలైన తర్వాత, ఇతరులు ఎవరైనా అదే పేరు కోసం దరఖాస్తు చేసుకుని ఉన్నా  ఇతరత్రా అభ్యంతరాలు వచ్చిన మళ్ళీ కథ మొదటికి వస్తున్నదని అంటున్నారు. చివరకు కమిషన్ తెరాస అభ్యర్ధనను తిరస్కరించినా తిరస్కరించవచ్చని అంటున్నారు.  ఇవన్నీ ఒకెత్తు అయితే ఢిల్లీ  లిక్కర్ కుంభ కోణం విచారణ ఎప్పుడు ఏ మలుపు తిరిగుతుందో అనే భయం ఒకటి కేసీఆర్ ను వెంటాడు తోందని అంటున్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కేసీఆర్ కుమార్తె కవిత ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఒకప్పుడు కవిత వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసినట్లు చెపుతున్న బోయినపల్లి అభిషేక్ ను సిబిఐ అరెస్ట్ చేయడంతో సిబిఐ నెక్స్ట్ టార్గెట్ కవిత కావచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ వారం రోజులకు పైగా ఢిల్లీలో మకాం వేసి కుమార్తె కవితను, సేఫ్ గా బయట పడేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారని అంటున్నారు. మరో వంక, జ్యోతిష పండితులు చెప్పినట్లుగా ఇటు పార్టీలో, అటు ఫ్యామిలీలో కూడా అంతర్గత కుమ్ములాటలు పతాక స్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోంది. దీంతో  తెరాసలో గుబులు మొదలైందని అంటున్నారు. అలాగే ముందు ముందు తెరాసలో పెను మార్పులు తప్పవనీ అంటున్నారు. అది భారాస నామకరణ ముహూర్త బలమో మరొకటో కానీ  కేసీఆర్ జాతీయ రాజకీయాలు, అసలుకే మోసం తెచ్చేలా ఉన్నాయని అయితే పార్టీ సీనియర్ నాయకులు సైతం ఆందోళన చెందుతున్నారు. ఇటు పార్టీలో, అటు ఫ్యామిలీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు కేసీఆర్ చేయి దాటి పోయాయని, ఒక విధంగా  కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడి పడింది అన్నట్లుగా, పరిస్థితులు విషమిస్తున్నాయని పార్టీ నాయకులే అంటున్నారు. అయితే కేసీఆర్ ఏదో చేసి పార్టీని రక్షిస్తారనే విశ్వాసం అయితే ఇంకా మిగిలే ఉందని అంటున్నారు.

నగరిలో రోజా సీన్ సితారేనా?.. మంత్రి పదవి మూన్నాళ్ల ముచ్చటేనా?

ఇంట్లో ఈగల మోత... బయట పల్లకీల మోత అన్న సామెత కొంచం అటూ ఇటూగా మంత్రి రోజాకు అతికినట్లు సరిపోతుంది. నటిగా, రాజకీయ నాయకురాలిగా ఫైర్ బ్రాండ్ ముద్ర వేయించుకున్న రోజాకు మంత్రి పదవి చేపట్టిన తరువాత మాత్రం ఇబ్బందులు, ఇక్కట్ల, అవమానాలు, పరాభవాలే ఎదురౌతున్నాయి. నియోజకవర్గం బయట మంత్రి హోదాలో గాంభీర్యం పదర్శిస్తూ ఎలాగోలా నెట్టుకొచ్చేస్తున్నా సొంత నియోజకవర్గం నగరిలో మాత్రం ఆమెకు ఈగల మోతే.. నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు ఆమెను పట్టించుకోవడం లేదు. కనీసం ప్రొటో కాల్ ప్రకారమైనా ప్రభుత్వ పరంగా నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకు ఆమెకు ఆహ్వానం సంగతి అటుంచి కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదు. ఈ విషయాలను పార్టీ అధిష్ఠానం దృష్టికి రోజా తీసుకువెళ్లినా వారు లైట్ తీసుకుంటున్నారు. రోజాను కూడా లైట్ తీసుకోమనే చెబుతున్నారు. జిల్లాకే చెందిన మరో మంత్రి పెద్ది రామచంద్రారెడ్డికి జిల్లా అంతటా రాజమర్యాదలు జరుగుతుంటే.. రోజాకు మాత్రం పలకరించే దిక్కు లేని పరిస్థితి ఎదురౌతోంది. అధిష్ఠానం కూడా నగరి సహా జిల్లా అంతటా పెద్ది రెడ్డి మాటే చెల్లుబాటు అవుతుందనీ, ఆయన ఆధిపత్యాన్ని అంగీకరించి ఆయన చెప్పిన విధంగా పని చేసుకుపోవడం ఉభయ తారకంగా  ఉంటుందని రోజాకు చెప్పకనే చెబుతోందని నియోజకవర్గంలో ఓ టాక్. ఇక తాజాగా రోజాకు తన సొంత నియోజవకర్గంలో రైతు భరోసా కేంద్రం భూమి పూజ కార్యక్రమానికి ఆహ్వానం, సమాచారం లేకుండానే కానిచ్చేయడాన్ని రోజా జీర్ణించుకోలేకపోయారు. పైగా ఆ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించిన వారంతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గీయులే కావడంతో ఆమె తన ఆవేదనను పార్టీకి చెందిన మరో నాయకుడికి ఫోన్ ద్వారా తెలియజేశారు. ఆ ఫోన్ లో రోజా మాట్లాడిన మాటలు సామాజిక మాధ్యమంలో తెగవైరల్ అయిపోయాయి. రాజకీయాలు చేయడం కష్టం అంటే ఆమె ఆవేదన వ్యక్తం చేయడం, ప్రాణం పెట్టి పార్టీకి పని చేసినా... తన వ్యతిరేకులకే నియోజకవర్గంలో పెద్ద పీట వేసి ప్రోత్సహించడం బాధగా ఉందంటూ చెప్పడం ఇవన్నీ ఆమె గొంతుకతో సహా ఆడియో రిలీజ్ కావడం రోజాకే ఎదురు తిరిగింది. ఆ ఆడియోను రోజానే రిలీజ్ చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం నగరిలో రోజాకు మద్దతుగా కనీసం క్యాడర్ కూడా లేదని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి.  ఇప్పటికే గడపగడపకూ కార్యక్రమంలో ఆశించిన స్థాయిలో పాల్గొనడం లేదని పార్టీ అధినేత, సీఎం జగన్ రోజాకు చిన్నపాటి క్లాస్ తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నవంబర్ లో మరో సారి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందనీ, ఆ పునర్వ్యవస్థీకరణలో రోజాకు ఉద్వాసన ఖాయమనీ వైసీపీ శ్రేణుల్లోనే ఓ టాక్ జోరుగా సాగుతోంది. పైగా ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు విషయంలో విమర్శలను తిప్పి కొట్టే విషయంలో కూడా రోజా వెంటనే స్పందించకపోవడం పట్ల కూడా సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారంటున్నారు. ‘మీకు మంత్రి పదవులు ఇచ్చింది బుగ్గ కార్లలో తిరిగి సొంత పనులు చేసుకోవడానికి కాదంటూ జగన్ తీవ్ర స్థాయిలో చేసిన వ్యాఖ్యలు నేరుగా కాకున్నా పరోక్షంగా రోజాను ఉద్దేశించి చేసినవేనని కూడా పార్టీ శ్రేణులు అంటున్నాయి. మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ రోజా పై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. పదవీ ప్రమాణం చేసిన తరువాత హైదరాబాద్ వెళ్లి జగన్మాత విజయమ్మ ఆశీస్సులు తీసుకోవడం దగ్గర నుంచి.. ఇటీవల ఆమె జబర్దస్త్ షోకు వెళ్లడం వరకూ దాదాపు అన్ని విషయాలలోనూ రోజాపై పార్టీలోనే కాదు సామాజిక మాధ్యమంలోనూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ రోజాకు క్లాస్ పీకారని అంటున్నారు. నగరి నియోజకవర్గంలో రోజాకు వ్యతిరేకంగా బలమైన గ్రూపు తయారవ్వడం, మరో వైపు గడపగడపకూ కార్యక్రమంలో ఆమె చురుకుగా పాల్గొనడం లేదని పార్టీ అదిష్ఠానం భావిస్తుండటంతో వచ్చే ఎన్నికలలో రోజాకు పార్టీ టికెట్ అనుమానమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఆప్ వదిలేస్తే.. సీఎం పదవి.. సిసోడియాకు బంపరాఫర్!

భయ‌పెట్ట‌డంలో బీజేపీ కొత్త పంథాను అనుస‌రిస్తోంది.  త‌మ ఆప‌రేష‌న్ లోట‌స్ ను విజ‌య‌వంతంగా అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేసేందుకు ఆయా రాష్ట్రాల‌కు సంబంధించిన  పెద్ద నాయ‌కుల‌ను   న‌యానో భ‌యానో లాగేసుకోవ‌డానికి కమలం గూటికి లాగేసుకోవడానికి ఎంతకైనా తెగిస్తోంది. భయపెడుతోంది, బుజ్జగిస్తోంది, ప్రలోభపెడుతోంది, చివరకు సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తోంది. సామ, దాన,భేద, దండోపాయలను ఉపయోగిస్తోంది. ఇప్పుడు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా విషయంలోనూ అదే చేసింది. ఆ విషయాన్ని మ‌నీష్ సిసోడియాయే స్వయంగా వెల్లడించారు. ఆయ‌న్ను ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో సోమ‌వారం ఏకంగా ప‌ది గంట‌ల‌ పాటు సిబీఐ ప్ర‌శ్నించింది. చిత్ర‌మేమంటే వారి ప్ర‌శ్న‌ల ప‌రంప‌ర ముగిసి బ‌య‌టికి రాగానే సిసోడియాకి ఆగ్ర‌హం కంటే న‌వ్వే వ‌చ్చి ఉంటుంది. ఎందుకంటే ఆయ‌న వెంట‌నే అస‌లీ లిక్క‌ర్ కుంభ‌కోణం అంతా పేద్ద ఫేక్ అని ఆరోపించారు. ఇదంతా బీజేపీ ఆడుతున్న తొండి ఆట‌. కేవ‌లం వారి ఆప‌రేష‌న్ లోట‌స్ కోస‌మే ఇదంతా చేస్తున్నార‌ని ఆరోపించారు. సిసోడియా ఉదయం 11.15 గంటలకు సీబీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకుని దాదాపు 10 గంటల విచారణ అనంతరం రాత్రి 8.40 గంటలకు బయటకు వచ్చారు. లిక్క‌ర్ కుంభ‌కోణం విష‌యంలో ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ సిబిఐ, ఈడీ దాడులు, సోదాలూ ముమ్మ‌రం చేశాయి. ఏదో దేశ‌ద్రోహం జ‌రిగిపోయిందన్న‌ంత సీన్ క్రియేట్ చేశాయి. చాలామంది మీద నిఘా పెట్టాయి. ఏకంగా తెలంగాణా ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుమార్తె మాజీ ఎం.పీ క‌విత మీద భారీ ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఆమెను అరెస్టు చేయ‌వ‌చ్చ‌న్న వార్త‌లు దేశ‌మంతా విస్త‌రించాయి. సిబిఐ సోదాలు, ఈడీ దాడులు అన్నీ కూడా బీజేపీ త‌మ రాజ‌కీయ ప‌ర‌ప‌తి పెంచుకోవ‌డానికి ఉపయోగించిన రాజకీయ అస్త్రాలని విపక్షాలు విమర్శలు గుప్పించాయి.  సిసోడియాను సోమ‌వారం కంగారెత్తించేంత‌గా ప్ర‌శ్నించి ఆఖ‌రికి మీరు మీ పార్టీని వ‌దులుకోవాల‌ని అని అడిగార‌ట‌. దీన్ని సిబిఐ విచార‌ణ‌లో భాగ‌మ‌ని ఎలా ఎవ‌ర‌యినా అనుకుంటారు. వాళ్లింటికి వెళ్ల కండి, వాళ్ల‌తో తిర‌క్కండి, మాతో ఉంటే మీకు అన్ని వ‌స‌తులు చూస్తామ‌నే బెదిరింపు ప్రేమ సందేశం ఈ విధంగా బీజేపీ ఇచ్చిం దా అని అనుమానాలు త‌లెత్తుతున్నాయి.  కానీ ఎట్టిప‌రిస్థితుల్లోనూ నేను ఆప్‌ని వదిలే ప్ర‌స‌క్తి లేద‌ని చెప్పాన‌ని, బీజేపీ కోసం నన్ను సీఎం చేస్తామన్నార‌ని సిసోడియా మీడియాకు చెప్పారు. సిబిఐగాని, ఈడీగానీ స‌ర్వ‌స్వ‌తంత్ర వ్య‌వ‌స్థ‌లు అన్న‌పుడు వారి ప్ర‌శ్నావళిలో రాజ‌కీయ ప‌ద‌వులు మార్పులు గురించి ఎలా ఉంటుంది?   సిసోడియా గ‌నుక పార్టీ మారితే ఏకంగా ముఖ్య‌మంత్రిని చేస్తారుట అనే సందేశం ఆ అధికారుల నోటి వెంట ఎలా వ‌స్తుంది. దీనికి పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ బీజేపీనే సిద్ధ‌ప‌రిచింద‌నేది మనీష్ సిసోడియా ఆరోపణ.  పార్టీలోకి సాద‌రంగానే పిల‌వ‌చ్చు, పార్టీ కీల‌క వ్య‌క్తే ఆయ‌న్ను త‌మ పార్టీలోకి చేర‌డానికి బేర‌సారాలు మాట్లాడుకునే రోజుల్లో ఆయన్ను సీబీఐ ద్వారా అడిగించ‌డంలో అర్ధం బెదిరించ‌డ‌మే అవుతుంది.  అయితే సిసోడియా ఆరోపణలను  ద‌ర్యాప్తు సంస్థ ఖండించింది.   ఆప్ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ, వ్యాపారవేత్త విజయ్ నాయర్‌తో సహా ఇతర నిందితులతో ఆయనకున్న సంబంధాలు, ఈ కేసులో సోదాల సమయంలో లభించిన పత్రాలపై ఢిల్లీ డిప్యూటీ సీఎం పలు అంశాలపై విచారించామని అధికారులు తెలిపారు. ఈ కేసులో వైఎస్‌ఆర్‌సీపీ లోక్‌సభ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డిని కూడా సీబీఐ ప్రశ్నించింది. 

ఇప్పుడిక జనసైనికుల వంతు.. జాగ్రత్త.. రఘురామకృష్ణం రాజు

ప్రశ్నించినా, ఎదిరించినా తమ పార్టీ  అధినేత జగన్ సహించలేరని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు. అందుకూ విశాఖ భూ బకాసరుల బండారం బయటపడుతుందన్న భయంతోనే జనసేన అధినేత విశాఖలో జనవాణి కార్యక్రమం నిర్వహించకుండా అడ్డుకున్నారని అన్నారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన ప్రభుత్వం తప్పదాలను ఎత్తి చూపినందుకే  గతంలో తనను సీఐడీ పోలీసులు అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టారని అన్నారు. నిన్నటి వరకూ తెలుగుదేశం కార్యకర్తలను సీఐడీ పోలీసులు అర్ధరాత్రి తీసుకెళ్లి చితక బాదుతున్నారని, ఇప్పుడు ఆ వంతు జనసైనికులకు వచ్చిందని రఘురామరాజు అన్నారు. వారు ఒకింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ తన సూచనను తేలిగ్గా తీసుకోవద్దని ఆయన జనసేనను కోరారు. వాతావరణ కేంద్రం తుపాను హెచ్చరిక ఎలా జారీ చేస్తుందో.. అలా తాను ఈ సీఐడీ దాడుల హెచ్చరిక జారీ చేస్తున్నానని పేర్కొన్నారు. ఏపీలో ప్రజాస్వామ్యం సంక్షోభంలో ఉందన్న రఘురామకృష్ణం రాజు తెలుగుదేశం, జనసేన, రాష్ట్రంలోని ఇతర రాజకీయ పార్టీలూ రాష్ట్రంలో పరిస్థితులపై కేంద్రం, రాష్ట్రపతిలకు వివరించి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని కోరాలని సూచించారు. విశాఖ గర్జన్ పేరుతో విశాఖను రెండు రోజుల పాటు పోలీసు వలయంలో దిగ్బంధనం చేసి..విశాఖ వాసులకు ప్రభుత్వం నరకం చూపిందన్నారు. విశాఖ విమానాశ్రయం వద్ద పోలీసులే విధ్వంసం సృష్టించి జనసైనికులు, ప్రజలను తరిమి కొట్టారని రఘురామ ఆరోపించారు. విశాఖలో పోలీస్ యాక్ట్ అమలులో ఉందని చెబుతున్న పోలీసులు విశాఖ గర్జనను ఎలా జరగనిచ్చారని ఆయన ప్రశ్నించారు. 

మహా రాజకీయంలో మరో మలుపు?

రాజకీయాలలో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఉహించడం అంత తేలికైన వ్యవహారం కాదు. అంతవరకు ఉప్పు నిప్పులా ఉన్న పార్టీలు ఒక్కసారిగా చేతులు కలిపెసినా ఆశ్చర్య పోనవసరం ఉండదు. ఇప్పుడు మహా రాష్ట్రలో అదే జరిగింది. బీజేపీ, శివసేన ఒకప్పుడు, సహజ మిత్ర పక్షాలు. ఒక విధంగా ఆ రెండు పార్టీలది ఒకటే డిఎన్ఎ, ఒకటే రక్తం. అందుకే హిందుత్వ బంధంతో ముడి వేసుకున్న ఆ రెండు పార్టీలు, ఎప్పటికీ విడిపోవని, విడిపోయినా మళ్ళీ అదే హిదుత్వ బంధం ఆ రెండు పార్టీలను కలిపేస్తుందనే నమ్మకం రెండు పార్టీలలో బలంగా నాటుకు పోయింది.   అయితే  అటు శివసేన ఇటు బీజేపీ నాయకత్వంలో తరాల అంతరాలు రావడం రాజకీయ ఆకాంక్షలు పెరగడంతో పరిస్థితి క్రమక్రమంగా మారుతూ వచ్చింది. 2019 అసెంబ్లీ ఎన్నికలలో రెండు పార్టీలు కలిసే పోటీ చేశాయి. అయితే, ముఖ్యమంత్రి కుర్చీ విషయంలో వివాదం రావడంతో రెండు పార్టీలు విడిపోయాయి.శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్, ఎన్సీపీలతో చేతులు కలిపారు. మూడు పార్టీలు కలిసి ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.అంతర్గత వైరుధ్యాలతో ఎంవిఎ ప్రభుత్వం త్వరలోనే కులిపోతుందని అనుకున్నా, శరద్ పవార్ చలవతో  ఠాక్రే సర్కార్ మూడేళ్ళు పూర్తి చేసుకుంది. అయితే, ఇంతలోనే శివసేనలో ముసలం పుట్టింది. పార్టీ రెండుగా చీలింది. మహారాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు జెండా ఎగరేశారు. బీజేపీ తెర వెనక చక్రం తిప్పింది. ఇంచుమించుగా నెలరోజుల పాటు సాగిన నాటకీయ పరిణామాలకు తెర దించుతూ జూన్ 30, 2022 న షిండేముఖ్యమంత్రిగా బీజేపీ, శివసేన ( షిండే) సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ఈ నేపధ్యంలో శివసేన ఇరు వర్గాలు బాల్ ఠాక్రే హిందుత్వ వారసత్వం శివసేన పేరు, పార్టీ గుర్తు తమదంటే తమదని నిరూపించుకునేందుకు ఓ వంక రాజకీయ పోరాటాలు, మరో వంక న్యాయ పోరాటం సాగిస్తున్నాయి. ఈ పోరాటంలో  సహజంగానే, బీజేపీ షిండే వర్గానికి కొమ్ము కాస్తోంది. అయితే ఇప్పడు బీజేపీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. అంధేరీ ఈస్ట్ అసెంబ్లీ నియోజక వర్గం ఉప ఎన్నిక బరిలోంచి తమ అభ్యర్ధి ముర్జీ పటేల్‌ను ఉపసంహరించుకుంది. శివసేన (ఠాక్రే) వర్గం అభ్యర్ధి ఏకగ్రీవ ఎన్నికకు లైన్‌ క్లియర్ చేసింది. ఒక విధంగా బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయం ముఖ్యమంత్రి షిండే వర్గానికి షాక్. అని చెప్పవచ్చని అంటున్నారు.  అయితే, బీజేపీ, మహారాష్ట్ర రాజకీయాల్లో చాలా కాలంగా అనుసరిస్తూ వస్తున్న, సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయిన సందర్భంలో, దివంగత ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల ఏకగ్రీవ ఎన్నికకు అనుకూలంగా ఇతర పార్టీలు తమ అభ్యర్ధులను బరిలో దించరాదనే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ తమ అభ్యర్ధిని ఉపసంహరించుకున్నామని బీజేపీ ప్రకటించింది.  అయితే, ఈ నిర్ణయం వెనక వ్యూహాత్మక రాజకీయ కోణం దాగుందని రాజకీయ వర్గాల్లో అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. బీజేపీ ముందుగానే. ఏకగ్రీవ సంప్రదాయాన్ని గౌరవిస్తూ నిర్ణయం తీసుకుంటే అది మరోలా ఉండేది. కానీ, శివసేన రెండువర్గాల మధ్య తలెత్తిన వివాదం కారణంగా పార్టీ పేరు, సింబల్ ను కేంద్ర ఎన్నికల సంఘం స్తంబింప చేసిన తర్వాత, మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్‌ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఉద్ధవ్  ఠాక్రే, అభ్యర్ధన మేరకు. అంటూ చివరి క్షణంలో అభ్యర్ధిని ఉప సంహరించుకోవడంతో కమల దళం వ్యూహం ఏమిటనేది ఇప్పుడు మహా రాజకీయాలలో చర్చనీయాంశంగ మారిందని అంటున్నారు. అలాగే, దీర్ఘ కాలంలో హిందుత్వ ఓటు చీలకుండా చూసేందుకు,శివసేన రెండు వర్గాలను ఏకం చేసి అక్కున చేర్చుకునే వ్యూహంతో బీజేపీ కథ నడిపిందని అనుకోవచ్చని అంటున్నారు.  అందుకే  బీజేపీ తీసుకున్న ఆకస్మిక నిర్ణయం వెనక  ఇంకేదో రాజకీయం ఉండి మహరాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. శివసేనలో చీలిక అనంతరం జరుగుతున్న అంధేరీ ఉప ఎన్నికను శివసేన రెండు వర్గాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యమంత్రి షిండే వర్గం పోటీలో లేకున్నా, మిత్రపక్షం బీజేపీ అభ్యర్ధిని గెలిపించి, ఠాక్రే వర్గంఫై పైచేయి సాధించాలని వ్యూహాత్మకంగా పావులు కదిపింది. అయితే, దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించ లేదన్నట్లుగా, శివసేనను పూర్తిగా కబ్జా చేసేందుకు, షిండే వర్గం సిద్దం చేసుకున్న స్కెచ్ ని బీజేపీ మార్చేసిందని అంటున్నారు. అయితే అంధేరీ ఉప ఎన్నిక కంటే అత్యంత కీలకం అయిన బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బిఎంసి) ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజీపీ వ్యుహతమక నిర్ణయం తీసుకుందని పరిశీలకులు భావిస్తున్నారు. మరోవంక,   శివసేన (ఠాక్రే) వర్గం రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ మాత్రం,అంధేరీ ఈస్ట్ నియోజక వర్గంలో బీజేపీ నిర్వహించిన సర్వేలో, తమ అభ్యర్ధి ముర్జి పటేల్ ఓటమి తధ్యమని తెలిసిన నేపధ్యంలోనే బీజేపీ రాజ్‌ ఠాక్రేను తెర మీదకు తెచ్చి పోటీ నుంచి తప్పు కుందని అన్నారు. ఏది ఏమైనా, శివసేనను సక్సెస్ ఫుల్ గా ముక్కలు చేసిన బీజేపీ, ఇప్పడు మళ్ళీ  అతుకులను కలిపి కుట్టేందుకు ప్రయత్నించడం ఆశ్చర్య  పరుస్తోందని అంటున్నారు. అయితే, 2024 లోక్ సభ ఎన్నికల నాటికి తెగిన పాత బంధాన్ని మళ్ళీ ముడి వేసి, మహారాష్ట్రలో  హిందుత్వ శక్తులను ఏకం చేసే లక్ష్యంతోనే బీజేపీ పావులు కదుపుతోందని అంటున్నారు. నిజానికి, అది భయమైనా, భక్తి అనుకున్నా మహారాష్ట్రంలో హిందుత్వ వాదానికి ప్రతీకగా నిలిచిన బాల్  ఠాక్రే వారసత్వాన్ని ముక్కలు చేయడం కమల దళం కోరుకోవడం లేదని బీజేపీ నాయకులు అంగీక రిస్తున్నారు.

జగన్ సర్కార్ కు సుప్రీంలో మరో ఎదురుదెబ్బ

కోర్టుల్లో చీవాట్లుతినడం, మొట్టికాయలు మెట్టించుకోవడం, అక్షింతలు వేయించుకోవడం ఏపీ సర్కార్ కు ఒక అలవాటుగా మారిపోయింది. జగన్ సర్కార్ కుఅడ్డగోలు నిర్ణయాలు తీసేసుకోవడం.. అవి న్యాయ పరీక్షకు నిలవకపోవడం ఒక పరిపాటిగా మారిపోయింది.   జగన్ సర్కార్ కు సుప్రీం మరోసారి గట్టిగా అక్షింతలు వేసింది. పోలవరం, పురుషోత్తపట్నం, పట్టిసీమ ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) సంయుక్త కమిటీ తీర్పు మేరకు పరిహారాన్ని వెంటనే జమ చేయాలని ఆదేశించింది. అంతే కాకుండా ఎన్జీటీ తీర్పులో చెప్పిన ప్రతి అంశాన్నీ యథాతథంగా అమలు చేయాలని విస్పష్ట తీర్పు ఇచ్చింది. ప్రాజెక్టుల నిర్మాణంలో పర్యావరణఅనుమతుల ఉల్లంఘనకు ఎన్జీటీ రాష్ట్ర ప్రభుత్వానికి 250 కోట్ల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చిన సంగతి విదితమే. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించిన సంగతీ తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ ను విచారించిన  దేశ సర్వోన్నత న్యాయస్థానం నష్టపరిహారం వెంటనే జమ చేయాలని ఆదేశించింది. నష్టపరిహారం పై తాము తదుపరి విచారణ కొనసాగిస్తామని, అది మినహా ఎన్జీటీ తీర్పులోని అన్ని అంశాలనూ యథాతథంగా అమలు చేయాల్సిందేనని విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

ఉండ‌డ‌మ్మా..వెళ్ల‌కండి అలా..! 

రెండు పిల్లి పిల్ల‌లు ఆడుతూ రోడ్డు మీద‌కి వెళిపోతోంటే కుక్క వ‌చ్చి అమాంతం నోటితో ప‌ట్టి ఇవ‌త‌ల‌కు తెచ్చి ప‌డేసింది. అపుడు నిజానికి వాటిని రోడ్డు మీద‌నే వ‌దిలేయాలి. కానీ అలా చేయ‌లేదు. దానిలో త‌ల్లి ప్రేమ అలా చేయ‌నీయ‌లేదు. వాటి ప‌రిస్థితి దానికి అర్ద‌మ‌యింది గ‌నుక తీసుకువ‌చ్చి ఓ గోడ ద‌గ్గ‌ర ప‌రిచిన దుప్ప‌టి మీద ప‌డేసి ద‌గ్గ‌రికి లాక్కుంది. అలా వెళ్ల‌కం డ‌మ్మా..చ‌నిపోతారు..అన్న‌ట్టు హెచ్చ‌రించింది. వాటి త‌ల్లి ఎటు వెళ్లిందో, చ‌నిపోయిందో తెలీదుగాని కుక్క‌కి మాత్రం అవి అనాథ‌ ల‌న్న‌ది అర్ధ‌మ‌యింది.  అనాధ‌పిల్ల‌ల్ని చూస్తే అయ్యో అనిపిస్తుంది. వీరి భ‌విష్య‌త్తు ఏమ‌వుతుంద‌ని అనుకుంటాం. చాలామంది త‌ల్లి మ‌న‌సు వ్య‌క్తం చేస్తారు. కొంద‌రే ముందుకు వ‌చ్చి సాయం చేస్తారు. పిల్ల‌ల విష‌యంలో సాధార‌ణంగా కుల‌,మ‌త ప్ర‌స‌క్తి లేకుండా ప్రేమ‌ను ప్ర‌ద‌ర్శిం చ‌డం ప‌రిపాటి. ఇది జంతువుల్లోనే ఎక్కువ‌. కొన్ని ప‌క్షులు వేరే ప‌క్షుల గూటిలో గుడ్లుపెట్ట‌డం గురించి విన్నాం. జంతువులు త‌మ‌కు అస్స‌లు ప‌డ‌ని జంతువుల పిల్ల‌ల్ని స‌మ‌స్య‌లో ఉండ‌గా చూస్తే వెంట‌నే ఆదుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తాయి. ఇద ప్ర‌కృతి విచిత్రం. పిల్లంటే కుక్క‌కి అస్స‌లు ప‌డ‌క‌పోవ‌చ్చు. కానీ పిల్లి పిల్ల‌లు అనాధ‌గా ప‌డి ఉంటే కుక్క వాటిని జాగ్ర‌త్త‌గా చూసుకుంటూం టుంది. ఆఖ‌రికి పెద్ద పిల్లి వ‌చ్చినా వాటిని వ‌ద‌ల‌దేమోన‌న్నంత‌గా ప్రేమిస్తాయి, తన పిల్ల‌లంత ప్రేమ‌గా చూసుకుంటాయి.  దీన్ని భార‌త్ మాజీ క్రికెట్ స్టార్ వివి ఎస్ ల‌క్ష్మ‌ణ్ త‌న ట్విట‌ర్‌లో పోస్టు చేశాడు. తన మనోహరమైన స్ట్రోక్ ఆటకు ప్రసిద్ధి చెందిన భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ సోమవారం మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో హత్తుకునే వీడియోను పంచుకున్నారు. తల్లి పిల్లి మరణించిన తర్వాత కుక్క పిల్లి పిల్లలను చూసుకుంటున్నట్లు వీడియో చూపిస్తుంది.  పిల్లి తల్లి మరణించిన తర్వాత పిల్లి పిల్లలను చూసుకునే కుక్క తల్లి. మాతృత్వం అనేది మరొక వ్యక్తికి సర్వస్వం కావడంలో ఉన్న సున్నితమైన అసౌకర్యం అనే క్యాప్షన్‌తో ల‌క్ష్మ‌ణ్‌ వీడియోలను షేర్ చేశాడు.  సమస్త జీవరాశుల తల్లులందరికీ కృతజ్ఞతలు.