మ్యాచ్ తో సమానంగా నెట్స్‌లో టీమ్ ఇండియా ప్రాక్టీస్
posted on Oct 21, 2022 @ 1:17PM
ఆస్ట్రేలియాలో ఆరంభమయిన టీ20 ప్రపంచకప్‌లో 23వ తేదీన భారత్ తన చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో తలపడనుంది. భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ పాక్ పేసర్లను ధీటుగా ఎదుర్కొనడానికి అంతే సీరియస్‌గా పేసర్లతో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ పర్యాయం పాక్ పై భారీ స్కోర్ చేయడం పెద్ద లక్ష్యంగా టీమ్ ఇండియా పెట్టుకుంది. ఏమాత్రం తగ్గేదేలే అన్న స్థాయిలో పాక్ బౌలర్లకు చుక్కలు చూపాలన్న పట్టుదలతో భారత్ సూపర్ స్టార్లు శర్మ, కింగ్ కోహ్లీ, రాహుల్ సిద్ధపడ్డారనే అనాలి. ఇటీవలి సిరీస్‌ల్లో కింగ్ తన పాత ఫామ్‌లోకి తిరిగిరావడం అర్ధసెంచరీలు చేయడం జట్టుకు ఈ పర్యాయం కొండంత ధైర్యా న్నిస్తోంది. దీనికి తోడు ఇటీవల జట్టుకు మిడిల్ ఆర్డర్‌లో సూర్యకుమార్ యాదవ్ నిలకడగా ఆడుతూ మంచి నమ్మకం కలిగిం చాడు. కాగా, పాక్ పేసర్లు అఫ్రిది, హరిస్ రావుఫ్, నసీమ్ షా వలె అంతే వేగంతో కుడి, ఎడమచేతి వౌలింగ్ టెక్నిక్‌ను ధీటుగా ఎదుర్కొనడానికి, స్వింగ్‌ను అంతే స్థాయిలో ఎదు ర్కొని పరుగులు రాబట్టేందుకు శుక్రవారం నెట్స్‌లో రోహిత్ అంతే స్థాయిలో భారత్ నెట్ బౌలర్లతో ప్రాక్టీస్ చేయడం గమనార్హం. అయితే పాక్ స్టార్ పేసర్ అఫ్రిదీకి మోకాటి గాయం కారణంగా ఆడటం లేదన్న వార్త భారత్‌కు కొంత ఆనందదాయక మనే చెప్పాలి. అతను ఊహించినదానికంటే గొప్ప స్వింగ్ బౌలర్‌గా అవతరించాడని ప్రపంచక్రికెట్ పండితుల మాట. అది వాస్తవమేనన్నది ఇటీవలి పాక్ ఆడిన సిరీస్‌లలో బయటపడింది. అంతెందుకు గత ఏడాది పాక్ టీ20 ప్రపంచకప్ సాధించడానికి ప్రధాన అస్త్రంగా అఫ్రిదీయే ఉపయోగపడ్డాడు. ఆ మ్యాచ్ లో కెప్టెన్ శర్మ, కె.ఎల్ రాహుల్ వికెట్లను అతనే తీశాడు. ఈ పర్యాయం మ్యాచ్‌ల్లో ఎలా ఆడాలి, వ్యూహాల గురించి జట్టు హెడ్ కోచ్ ద్రావిడ్‌తో కెప్టెన్ శర్మ చర్చించాడు. నెట్స్‌లో చాలా సమయం గడుపు తూ ఎంతో ప్రాక్టీస్ చేస్తున్న దినేష్ కార్తిక్ కంటే రిషబ్‌పంత్‌కు పాక్‌తో తలపడే తొలి మ్యాచ్‌లో అవకా శాలు న్నాయని తెలుస్తోంది. అలాగే, ఇప్పటికే గాయం కారణంగా టోర్నీకి దూరమయిన పేసర్ బూమ్రా స్థానంలోకి వచ్చిన షమ్మీ నెట్స్‌లో ఎంతో శ్రమిస్తున్నాడు. ఆసీస్‌తో తలపడిన వామప్ మ్యాచ్‌లో అనూ హ్యంగా చివరి ఓవర్ వేసి 11పరుగులిచ్చి 3 వికెట్లు తీసి ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. శుక్రవారం నెట్స్‌లో బ్యాటర్లకు శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్‌లు బౌలింగ్ చేసి ఎంతో సహకరిం చారు. వీరిద్దరూ ప్రస్తు తం ప్లేయింగ్ లెవెన్‌లో లేకపోయినా అవసరమైన క్షణంలో రంగంలోకి దిగడానికి సిద్దపడుతున్నారు.
రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత్ జట్టులో కె.ఎల్.రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్, దీపక్‌హుడా, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, ఆర్.అశ్విన్, యజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమా ర్, హర్షల్ పటేల్, అర్షదీప్, మహమ్మద్ షమీ ఉన్నారు.