బ్రెస్ట్ క్యాన్సర్ ..సురక్షితం సర్జరీ
posted on Oct 21, 2022 @ 10:48AM
వయసు పెరుగుతున్న కొద్దీ స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ౩౦ సంవత్సరాల లోపు స్త్రీలకు క్యాన్సర్ రావడం అరుదు. 4౦ ఎళ్ళలోపు స్త్రీలకు 217 మందిలో ఒకరికి మాత్రమే ఉంటుందని 5౦ఏళ్ల వయస్సు ఉన్న వారికి 5౦ మందిలో ఒకరికి వస్తుందని నిపుణులు పేర్కొన్నారు.
సాధారణంగా స్త్రీలకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు రిస్క్ ఫ్యాక్టర్ అధికంగా ఉంటాయి. సామాజికంగా ఆర్ధికంగా ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు, వృత్తి వ్యాపారాలు చేసే స్త్రీలు, అవివాహితులు, పిల్లలు కలగని వారు, వక్షోజంలో అసాధారణ లక్షణాలు కలవారు. నన్స్, ఆలస్యంగా పిల్లలు కలిగిన స్త్రీలకు వచ్చే అవకా శాలున్నాయి. ప్రసవ సమయంలో పాలు ఉత్పత్తి కాని స్త్రీలు. బిడ్డలకు పాలు ఇవ్వని స్త్రీలు, 12 ఏళ్ల లోపే రసజ్వల అయిన వాళ్ళలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కొవ్వుపదార్ధాలు అధికంగా తినే స్థూల కాయం గల స్త్రీలు, దీర్ఘకాలం పాటు హార్మోన్లతో కూడుకున్న గర్భనిరోధక మాత్రలు వాడిన స్త్రీలు ఈ క్యాన్స ర్ బారిన పడచ్చు. దీనికి వయసుతో నిమిత్తం లేదు.
సర్జరీ విషయానికి వస్తే, బ్రెస్ట్ క్యాన్సర్ కు శస్త్రచికిత్స ద్వారా బ్రెస్ట్ లోపల ఉన్న కణితను తొలగించ డం కాని అవసరమని భావించే బ్రెస్ట్ మొత్తాన్ని తొలగించడం చేస్తారు. కణితి 2 సెంటిమీటర్ల నుండి 5 సెం.మీ మధ్య ఉంటె కణితిని మాత్రమే తొలగించడం లేక బ్రెస్ట్ మొత్తాన్ని తొలగించే మాసేక్టమి శస్త్ర చికిత్చ చేస్తారు. బ్రెస్ట్ క్యాన్సర్ మూడవాదశ లో బ్రెస్ట్ మొత్తాన్ని తొల గించడం తోపాటుగా శరీరం మొత్తం మీద పనిచేసే విధంగా హార్మోనల్ థెరపీ లేదా రెండిటినీ చేస్తారు. హార్మోనల్ వాడేందుకు వీలుకాని రోగులకు కీమో థెరపీ మాత్రమే వాడడం కుదురుతుంది. క్యాన్సరు ఎముకలలోకి వ్యాపిస్తే రేడియేషన్ వల్ల ప్రయోజ నమేమంటే, నొప్పి వల్ల ఎముకలు విరిగి తే నొప్పికి విముక్తి కలిగించవచ్చు. సామాన్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్నాక మళ్లీ వచ్చేఅవకశాం ఉంది ట్యూమర్ హార్మోన్ కు స్పందిస్తుంది.
ఇన్ని శస్త్ర చికిత్చలు జరిగిన తరువాత కూడా లాభం లేదనిపిస్తే చివరగా ఈ క్యాన్సర్ తో పోరాడుతున్న వారు బ్రెస్ట్ రీకన్‌స్ట్రక్షన్ కు వెళ్ళడం సముచితమని ప్లాస్టిక్ సర్జన్లు సూచిస్తున్నారు. గుర్గావ్ కు చెందిన డాక్టర్ ఆదిత్య అగర్వాల్ మాట్లాడుతూ భారత్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలాలో ఇంకా ఒక్క శాతం మాత్రమే బ్రెస్ట్ రీకన్‌స్ట్రక్షన్ పునర్నిర్మాణం గురించి అటు విద్యావంతులు నిరక్షారస్యులకు బ్రెస్ట్ పునర్నిర్మాణం రీకన్‌స్ట్రక్షన్ గురించి చాలామందికి తెలియదు. కనీసం ఈ అంశం గురించి అందరి ముందూ మాట్లాదేన్దేందుకు సిగ్గుపడుతున్నారు. వారివారి వివాహా సంబంధాలు దేబ్బతింటా ఏమో అన్న అనుమానం భయం వారిని వెంటాడుతూ ఉందవచ్చని డాక్టర్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు.
బ్రెస్ట్ క్యాన్సర్ తో పోరాడుతున్న సామాజికంగా,శారీరకంగా కొనసాగడం కష్టంగా మారుతుంది కారణం బ్రెస్ట్ పునర్నిర్మాణ సర్జరీపై అవగాహన లేకపోవడమే దీనిని పోస్ట్ మాస్టెక్టమి అంటే వక్షోజాలను తొలగిం చడం పునర్న్రిర్మాణం చేయడం మాత్రమే అని ఈ అంశంపై పెద్దేత్తున సదస్సు జరగడం ఇదే తోలి సారికవడం విశేషం. కింగ్ జార్జెస్ వైద్యకళాశాలలో జరిగిన రెండురోజుల సదస్సులో 2౦ కి పైగా ప్లాస్టిక్ సర్జన్లు పాల్గొన్నారని బ్రెస్ట్‌కాన్సర్‌పై అంకాలజిస్టులు మాత్రమే పరిష్క రించగలరని పేర్కొన్నారు. వక్షో జాల పునర్ని ర్మాణం వల్ల రెండురకాల్ లాభాలు ఉంటాయని అగర్వాల్ అన్నారు.