బూమ్రా లేడని కంగారొద్దు.. ట్రస్ 45 రోజులకే దిగిపోయింది!
posted on Oct 21, 2022 @ 3:50PM
బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ నలభయి ఐదు రోజుల అధికారం తర్వాత తన పదవికి రాజీనామా చేశారు. ఇది బ్రిటీష్ చరిత్రలో చెప్పుకోదగ్గ సంఘటన. భారత్ మాజీ క్రికెటర్ వాసిమ్ జాఫర్ దీన్ని గురించి ట్వీట్ లో సరదా కామెంట్ చేశాడు. ఇపుడు ఇది ఎంతోమందిని ఆకట్టుకుంటోంది. ఊహించనివిధంగా అన్నీ వేగంగా జరిగిపోతున్న సమయంలో టీమ్ ఇండియా పెద్దగా కంగారుపడనవసరంలేదన్నాడు. భారత్ జట్టుకు సూపర్ పేసర్ జస్ప్రీత్ బూమ్రా గాయాల కారణంగా భారత్ జట్టుకు ఎంపిక కాలేదు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఆరంభమయిన టీ-20 ప్రపంచకప్‌కు వెళ్లిన జట్టులో బూమ్రా లేడని క్రికెట్ పండితులు, అభిమానులతో పాటు బీసీసీఐ కూడా విచారం వ్యక్తం చేసింది. బూమ్రా ఈ టోర్నీలో తప్పకుండా ఉండా ల్సిన అవసరం ఉందని, ఆసీస్ పిచ్‌ల మీద అతను విరుచుకుపడితే ప్రత్యర్థులను వొణికించి భారత్‌కు కచ్చితంగా విజయాన్ని అందించగలడన్న అభిప్రాయాలే అంతటా వినపడుతున్నాయి.
ఆస్ట్రేలియాలో ప్రారంభమయిన టీ-20 ప్రపంచకప్ పోటీల మీద విశ్లేషణ చేస్తూ ఇంగ్లండ్‌కు ప్రధాని లేరు గనుక 150 కి.మీ వేగంతో బౌలింగ్ చేయగల పేసర్ భారత్‌కు అక్కర్లేదని జాఫర్ కామెంట్ చేశాడు. పాకిస్తా న్‌కు మంచి ఫినిషర్ అవసరం లేదని, న్యూజిలాండ్‌కు ఆస్ట్రేలియాలో మంచి రికార్డు లేదని, శ్రీలంక జట్టులో అనుభవజ్ఞులు లేరని, ట్రస్ 45 రోజులకే ప్రధాని పదవికి రాజీనామా చేసింది గనుక ఇంగ్లాండ్‌కి ప్రధాని లేరని వసీం జాఫర్ ట్వీట్ చేశాడు. అంతా ఊహించినదానికంటే విరుద్ధంగా జరిగి పోతున్నాయి, భారత్ కంగారుపడనవసరం లేదన్నాడు.
ఈరోజుల్లో ఊహించని సంఘటనలే ఎక్కువ జరగడం గమనిస్తున్నామనేది ట్రస్ రాజీనామా రుజువు చేసిం ది. 47 ఏళ్ల ట్రస్ కేవలం 45 రోజులకే పదవి వదిలేశారు. అంతకుముందే జూలైలో బోరిస్ జాన్సన్ అనేక వివా దాల్లో చిక్కుకుని ప్రధాని పదవి నుంచి దిగిపోయారు. ఆ పదవిలోకి రావడినికి లిజ్ భారత సంతతకి చెందిన రిషీ సునాక్ నుంచి గట్టి పోటీనే ఎదుర్కొన్నారు.