తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల..
తెలంగాణ టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కిషన్ ఫలితాలు విడుదల చేశారు. మొత్తం రెండు పేపర్లు ఉండే ఈ పరీక్షలో.. పేపర్ -1 పరీక్షకు 1,01,213 మంది అభ్యర్దులు దరఖాస్తు చేయగా వారిలో 88,158 మంది హాజరయ్యారు. 55.45 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక పేపర్ -2 పరీక్షకు 2,74,339 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 2,51,924 మంది హాజరయ్యారు. 24.05 శాతం ఉత్తీర్ణులయ్యారు.
పేపర్ -1 పరీక్షలో 134 మార్కులతో స్నేహలత అనే విద్యార్ధి మొదటి స్థానంలో నిలవగా.. పేపర్-2 పరీక్షలో 126 మార్కులతో డి.శారదావాణి మొదటి స్థానంలో నిలిచింది.