కేసీఆర్ సర్కార్‌కు హైకోర్టులో మరో ఎదురుదెబ్బ
posted on Jun 16, 2016 @ 5:13PM
కేసీఆర్ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి మహబూబ్‌నగర్ జిల్లా వట్టెం రిజర్వాయర్ కోసం భూసేకరణ జరిపేందుకు ప్రభుత్వం జీవో నెంబర్ 123 విడుదల చేసింది. ఇక్కడ 2013 భూసేకరణ చట్టాన్ని అమలు జరపకుండా జీవోతో భూసేకరణ జరపాలని భావించింది ప్రభుత్వం. ప్రభుత్వం ఇచ్చే నామమాత్రపు నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవాలని చూసింది. ఎకరానికి రూ. 20 నుంచి రూ.25 లక్షల వరకు చెల్లిస్తే భూములు ఇచ్చేందుకు తాము సిద్ధమని రైతులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కారుకొండకు చెందిన రైతులు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం..తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. భూసేకరణ కోసం రైతులను ఎందుకు బెదిరిస్తున్నారని ప్రభుత్వాన్ని నిలదీసింది. ముందు రైతుల సమస్యలను పరిశీలించాలని, అప్పటి వరకు భూసేకరణను నిలిపివేయాలని ఆదేశించింది.