ఎంపీ దారుణ హత్య.. తుపాకీతో పేల్చి.. కత్తితో పొడిచి
posted on Jun 17, 2016 @ 11:39AM
ఓ ఎంపీని దారుణంగా హత్య చేసిన ఘటన బ్రిటన్లో చోటుచేసుకుంది. జో కాక్స్ అనే 40 ఏళ్ల మహిళ లేబర్ పార్టీ తరుపున వెస్ట్ యార్క్ షైర్ లోని బ్యాట్లీ అండ్ స్పెన్ నియోజక వర్గం నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే ఆమె బ్రిటన్ ఈయూ(యూరోపియన్ యూనియన్) లోనే కొనసాగాలని ఎప్పటినుండో వాదిస్తున్నారు. దీనిని తన సన్నిహితుడైన థామస్ మెయిర్ వ్యతిరేకిస్తున్నారు. ఈ కారణంగా ఆమెను ఎలాగైనా హతమార్చాలని పథకం పన్నాడు. అనుకున్నట్టుగానే జో కాక్స్ కార్యలయం వద్ద మాటు వేసిన థామస్.. ఆమె కార్యాలయం వద్దకు రాగానే.. మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. అనంతరం.. కసి తీరక కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. ఆతరువాత మళ్లీ కాల్చాడు. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయిన జో కాక్స్ ను హాస్పిటల్ కు తరలించినా ఫలితం మాత్రం దక్కలేదు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి.. హత్యకు గల కారణాలు ఏంటన్నది ఇప్పుడే చెప్పలేమని తెలిపారు.