మరో నిర్భయ ఘటన.. కారులోనే తిప్పుతూ అత్యాచారం..
posted on Jun 17, 2016 @ 11:12AM
దేశ రాజధాని ఢిల్లీలో రోజుకో నిర్భయ లాంటి ఘటనలు బయటపడుతూనే ఉన్నాయి. సరిగ్గా వారం రోజుల క్రితం.. ఓ యువతిపై కారులోనే తిప్పుతూ ఆత్యాచారం చేసిన ఘటన బయటపడింది. ఈ ఘోరం గురించి ఇంకా మరిచిపోకముందే తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. ఓ 25 ఏళ్ల యువతి తన స్నేహితురాలితో కలిసి సినిమా చూసి ఇంటికి తిరిగి వస్తుండగా.. కొందరు దుండగులు ఆమెను కారులో బలవంతంగా ఎక్కించుకొని.. తిరుగుతున్న కారులోనే ఆమెపై అత్యాచారం చేసి పూర్వీమార్ వద్ద విసిరేసి వెళ్లిపోయారు. ఆమె పక్కన ఉన్న స్నేహితురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి... వాహనం నెంబరు కూడా చెప్పడంతో పోలీసులు నిందితులను పట్టుకున్నారు. బాధితురాలికి వైద్యపరీక్షలు చేయగా ఆమెపై అత్యాచారం జరిగిందన్న విషయం కూడా నిర్ధారణ అయిందని పోలీసులు తెలిపారు. మరి ఎన్ని ఘటనలు జరిగినా ప్రభుత్వాలు మాత్రం చర్యలు తీసుకుంటాం అని చెప్పడం తప్ప చేసేది ఏం లేదన్న విషయం అర్ధమవుతోంది. ఈ అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడేదెప్పుడో..