ఇక్కడ ఆఫీసులు పెట్టాలంటే వాచీపోయిద్దీ..!
ఆఫీస్..ఎలాంటి సంస్థకైనా గుండెకాయ లాంటిది. మొత్తం వ్యవస్థనే నియంత్రించే సత్తా ఆఫీసులకే సొంతం. అలాంటి ఆఫీసులు ప్రజలకు అందుబాటులో ఉండాలి..సామాన్యులు కూడా త్వరగా వచ్చేందుకు సౌకర్యంగా ఉండాలి. ప్రభుత్వ, ప్రైవేట్ ఎలాంటి రంగానికైనా ఇదే సూత్రం వర్తిస్తుంది. అందుకే కార్పోరేట్ సంస్థలు లక్షలు ఖర్చు పెట్టి మరీ తమ కార్యాలయాలను అందరికి పరిచయమున్న ప్రాంతాల్లోనే ఏర్పాటు చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఖరీదైన కార్యాలయ స్థలాలపై ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్‌టెంట్ సంస్థ సీబీఆర్‌ఈ సర్వే చేసింది. దీని ప్రకారం హాంకాంగ్ సెంట్రల్ మొదటి స్థానంలో నిలిచింది. భారత్ విషయానికి వస్తే ఢిల్లీలోని కనాట్ ప్లేస్ ఏడవ స్థానంలో నిలిచింది. గతేడాది ఆరో స్థానంలో ఉండగా ఇప్పుడు ఏడో స్థానంలో నిలిచింది. ఇక్కడ చదరపు అడుగు స్థలానికి ఏడాది అద్దె 149.71 డాలర్లు (మన కరెన్సీలో రూ.10,000 డాలర్లు). ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ 19వ స్థానంలోనూ, నారిమన్ పాయింట్ 34వ స్థానంలోనూ నిలిచాయి.
ఖరీదైనా కార్యాలయ స్థలాలు ఇవే:
1. సెంట్రల్ హాంకాంగ్
2. సెంట్రల్ (వెస్ట్ ఎండ్) లండన్
3. ఫైనాన్స్ స్ట్రీట్ బీజింగ్
4. సెంట్రల్ బిజినెస్ డిస్ట్ బీజింగ్
5. వెస్ట్ కౌలూన్ హాంకాంగ్
6. మరునౌచి, ఒటెమాచి టోక్యో
7. కనాట్ ప్లేస్ ఢిల్లీ
8. సెంట్రల్ (సిటీ) లండన్
9. మిడ్‌టౌన్ మన్‌హట్టన్ న్యూయార్క్
10. పుడాంగ్ షాంఘై