English | Telugu
సామజవరగమన ఎఫెక్ట్.. ఆ ప్రీక్వెల్ కోసం పెంచేసిన శ్రీవిష్ణు!
Updated : Jul 13, 2023
'సామజవరగమన'తో కుటుంబ ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించడమే కాకుండా.. కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు శ్రీవిష్ణు. ఈ సినిమాకి ముందు 'అర్జున ఫాల్గుణ', 'భళా తందనాన', 'అల్లూరి' వంటి వరుస పరాజయాల్లో ఉన్నాడు శ్రీవిష్ణు. అవేవి 'సామజవరగమన' ఫలితంపై ప్రభావం చూపలేకపోయాయి. అంతేకాదు, పోటీలో సినిమాలు ఉన్నా సరే.. మంచి వసూళ్ళు రాబట్టింది 'సామజవరగమన'. దీంతో.. శ్రీవిష్ణు తదుపరి చిత్రంపై ఎనలేని ఆసక్తి నెలకొని ఉంది.
లేటెస్ట్ బజ్ ఏంటంటే.. 'సామజవరగమన'కి ముందు, 'బ్రోచేవారెవారురా' తరువాత శ్రీవిష్ణు హిట్ ఫిల్మ్ అయిన 'రాజ రాజ చోర'కి ప్రీక్వెల్ గా ఓ మూవీ ప్లానింగ్ జరుగుతోందట. 'రాజ రాజ చోర'కి దర్శకత్వం వహించిన హసిత్ గోలి ఈ ప్రీక్వెల్ ని డైరెక్ట్ చేయనున్నాడని సమాచారం. అలాగే, ఈ చిత్రానికి 'స్వాగ్' అనే టైటిల్ ని ఫిక్స్ చేశారట. కాగా, ఈ ప్రీక్వెల్ కోసం శ్రీవిష్ణు భారీగానే పారితోషికం తీసుకోనున్నారని అంటున్నారు. త్వరలోనే ఈ విషయాలపై క్లారిటీ రానుంది.