English | Telugu
రానా, రాజశేఖర్.. ఓ మల్టిస్టారర్ - రాజశేఖర్ పాత్ర అదేనంటూ కథనాలు!?
Updated : Jul 11, 2023
సీనియర్ స్టార్ రాజశేఖర్, దగ్గుబాటి స్టార్ రానా కలిసి నటించనున్నారా? అవునన్నదే ఫిల్మ్ నగర్ బజ్. ఆ వివరాల్లోకి వెళితే.. 'నేనే రాజు నేనే మంత్రి' వంటి విజయవంతమైన సినిమా తరువాత సంచలన దర్శకుడు తేజ కాంబినేషన్ లో రానా మరో మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. 'రాక్షస రాజు' అనే పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాలో రాజశేఖర్ ఓ కీలక పాత్రలో ఎంటర్టైన్ చేయనున్నారట.
వినిపిస్తున్న కథనాల ప్రకారం.. రానాకి అన్నగా రాజశేఖర్ దర్శనమిస్తారని తెలిసింది. అంతేకాదు.. అభినయానికి ఆస్కారమున్న పాత్ర ఇదని బజ్. త్వరలోనే 'రాక్షసరాజు'లో రాజశేఖర్ ఎంట్రీపై క్లారిటీ రానుంది. మరి.. గతంలో 'బలరామకృష్ణులు' వంటి విజయవంతమైన మల్టిస్టారర్ లో సందడి చేసిన రాజశేఖర్ కి.. 'రాక్షసరాజు' కూడా ఆ తరహా హిట్ ని అందిస్తుందేమో చూడాలి. అలాగే, తేజ దర్శకత్వంలో తొలిసారిగా నటించనున్న రాజశేఖర్ మరో గుర్తుండిపోయే పాత్రలో అలరిస్తారా? అన్నది కూడా ఆసక్తికరమే.