English | Telugu

సర్దార్ సీక్వెల్.. కార్తితో విజయ్ సేతుపతి ఢీ!

కోలీవుడ్ స్టార్ కార్తి కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచే చిత్రాల్లో 'సర్దార్' ఒకటి. రాశీ ఖన్నా హీరోయిన్ గా 'అభిమన్యుడు' ఫేమ్ పి.ఎస్. మిత్రన్ రూపొందించిన ఈ తమిళ చిత్రం.. తెలుగువారిని కూడా భలేగా ఆకట్టుకుంది. కట్ చేస్తే.. త్వరలో ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ కి సీక్వెల్  రానుందని సమాచారం. 

ఆ వివరాల్లోకి వెళితే.. గతేడాది అక్టోబర్ 21న రిలీజైన 'సర్దార్' మంచి విజయం సాధించడంతో చిత్ర నిర్మాణ సంస్థ ప్రిన్స్ పిక్చర్స్.. సీక్వెల్ ప్లాన్ చేస్తోందట. 'సర్దార్'ని రూపొందించిన పి.ఎస్. మిత్రన్ నే ఈ కొనసాగింపు చిత్రాన్ని తెరకెక్కిస్తాడని కోలీవుడ్ బజ్. అంతేకాదు.. ఇందులో కార్తి, రాశీ ఖన్నా కొనసాగతారని అంటున్నారు. ఇక విలన్ పాత్రలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఎంటర్టైన్ చేస్తారని వినిపిస్తోంది. అదే గనుక నిజమైతే.. కార్తితో విజయ్ సేతుపతి ఢీ కొట్టనుండడం ఆసక్తి కలిగించే విషయమనే చెప్పాలి. త్వరలోనే 'సర్దార్' సీక్వెల్, అందులో సేతుపతి ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. అన్నట్టు.. కార్తి తాజా చిత్రం 'జపాన్'లో విజయ్ సేతుపతి విలన్ గా నటించాల్సింది. అయితే కాల్సీట్స్ సమస్య కారణంగా అది కార్యరూపం దాల్చలేదు.