English | Telugu
వీర దేశభక్తుడిగా తారక్.. ఈ సారి బ్యాక్ డ్రాప్ మారుస్తున్న నీల్!?
Updated : Jul 11, 2023
'టెంపర్' నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ శైలి మారింది. కథలు, పాత్రల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నారీ నందమూరి స్టార్. దానికి తగ్గట్టే వరుస విజయాలతో ముందుకు సాగుతున్నారు తారక్. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' అనే పాన్ - ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్న తారక్.. ఆపై బాలీవుడ్ మూవీ 'వార్ - 2'లో నటించనున్నారు. ఈ చిత్రాలయ్యాక 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ తో మరో పాన్ - ఇండియా వెంచర్ చేయనున్నారు ఎన్టీఆర్.
2024 వేసవి తరువాత ఈ సినిమా పట్టాలెక్కే అవకాశముందంటున్నారు. ఈ లోపు 'సలార్ - 2' కూడా పూర్తిచేసే దిశగా నీల్ ఉన్నారని సమాచారం. ఇదిలా ఉంటే, ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్ మూవీకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. స్వాతంత్య్రం రాకముందు భారత్ - పాకిస్తాన్ సరిహద్దుల్లో జరిగిన పోరాటం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందట. అంతేకాదు.. ఇందులో వీర దేశభక్తుడిగా తారక్ పాత్ర ఉంటుందని బజ్. మరి.. ఇప్పటివరకు మాఫియా నేపథ్యంతోనే ముందుకు సాగుతున్న నీల్.. బ్యాక్ డ్రాప్ ఛేంజ్ తో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.