English | Telugu
రష్మిక ఆఫర్ కొట్టేసిన శ్రీలీల.. తగ్గేదేలే అంటున్న ధమాకా బ్యూటీ!
Updated : Jul 12, 2023
టాలీవుడ్ లో 'ధమాకా' బ్యూటీ శ్రీలీల దూకుడు మాములుగా లేదు. ఇటు టాప్ స్టార్స్ తోనూ, అటు యంగ్ హీరోస్ తోనూ సినిమాలు చేస్తూ టాక్ ఆఫ్ ఇండస్ట్రీ అయిపోయింది. అరడజనుకి పైగా తెలుగు చిత్రాలతో తగ్గేదేలే అన్నట్లుగా దూసుకుపోతున్న ఈ అమ్మడు.. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ని కొట్టేసిందని టాక్. ట్విస్ట్ ఏంటంటే.. ఇది నేషనల్ క్రష్ రష్మిక మందాన్న చేయాల్సిన సినిమా.
ఆ వివరాల్లోకి వెళితే.. బ్లాక్ బస్టర్ మూవీ 'భీష్మ' తరువాత నితిన్, రష్మిక, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్ లో మరో సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. #VNRTrio పేరుతో పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం నుంచి తాజాగా రష్మిక తప్పుకుందని సమాచారం. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. రష్మిక స్థానంలో శ్రీలీల నటించబోతోందట. అదే గనుక నిజమైతే.. నితిన్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లో నటించే అవకాశం శ్రీలీలకి దక్కినట్లే. ఇప్పటికే సెట్స్ పై ఉన్న వక్కంతం వంశీ డైరెక్టోరియల్ లో నితిన్ కి జంటగా శ్రీలీల యాక్ట్ చేస్తోంది. ఇప్పుడు వెంకీ కుడుముల సినిమాలోనూ నితిన్ కి తనే జోడీ కానుంది. మరి.. నితిన్ కి శ్రీలీల కాంబినేషన్ ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.