English | Telugu

విడాకుల బాటలో మరో హీరోయిన్!

కొంతకాలంగా సినీ సెలబ్రిటీలు వరుస విడాకుల న్యూస్ తో షాక్ లు ఇస్తున్నారు. సంతోషంగా పెళ్లి చేసుకుంటున్నారు. కొంతకాలం బాగానే ఉంటున్నారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడం, కొంతకాలానికి విడిపోతున్నట్లు ప్రకటించడం. ఇది ఈమధ్య ఎక్కువగా జరుగుతున్న తంతు. ఇక ఇప్పుడు ఈ లిస్టులో కలర్స్ స్వాతి కూడా చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

టీవీ యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన కలర్స్ స్వాతి.. ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, అష్టా చెమ్మా, స్వామిరారా, కార్తికేయ వంటి సినిమాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2018లో ప్రియుడు వికాస్‌ తో స్వాతి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన స్వాతి, మళ్ళీ ఇప్పుడు కొన్ని సినిమాల్లో కనిపిస్తూనే ఉంది. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి విడాకులు తీసుకోబోతున్న కలర్స్ స్వాతి అంటూ ఓ వార్త వైరల్ గా మారింది. దానికి కారణం సోషల్ మీడియాలో ఆమె తన పెళ్లి ఫోటోలను డిలీట్ చేయడమే. ఇటీవల పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో లైఫ్ పార్టనర్ ని అన్ ఫాలో చేయడం, పెళ్లి ఫొటోలను తొలగించడం.. ఆ తర్వాత విడాకులు ప్రకటించడం చేశారు. ఇప్పుడు స్వాతి కూడా అదే ఫాలో కాబోతుంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే గతంలో కూడా ఇలాగే స్వాతి విడాకుల వార్తలు వినిపించగా, వాటిని ఆమె ఖండించింది. మరి ఈసారి ఈ విడాకుల వార్తలకు ఎలాంటి ముగింపు ఉంటుందో చూడాలి.