English | Telugu
మహేశ్, జక్కన్న.. ముగ్గురు బాలీవుడ్ హీరోయిన్స్!
Updated : Jul 15, 2023
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు 'గుంటూరు కారం'లో నటిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మెయిన్ లీడ్ గా శ్రీ లీల నటిస్తుండగా.. సెకండ్ లీడ్ గా మీనాక్షి చౌదరి కనిపించనుందని సమాచారం. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్స్ లోకి రానుంది.
ఇదిలా ఉంటే, 'గుంటూరు కారం' తరువాత దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో మహేశ్ ఓ భారీ బడ్జెట్ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. యాక్షన్ అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కనున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్.. ఏడాది చివరలో సెట్స్ పైకి వెళ్ళే అవకాశముంది. కాగా, ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన ముగ్గురు బాలీవుడ్ కథానాయికలు నటించే అవకాశముందట. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ రానుంది. మహేశ్ బాబు కెరీర్ ని పరిశీలిస్తే.. ఇప్పటివరకు 'బ్రహ్మోత్సవం'లో మాత్రమే ముగ్గురు కథానాయికలతో ఆయన రొమాన్స్ చేశారు. సమంత, కాజల్, ప్రణీత నాయికలుగా నటించిన సదరు సినిమా ఆశించిన విజయం సాధించలేదు. మరి.. #SSMB29 విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.