English | Telugu

రి-రిలీజ్ దిశ‌గా 'వెంకీ'?

తెలుగునాట ప్ర‌స్తుతం రి-రిలీజ్ ట్రెండ్ న‌డుస్తోంది. రెండు ద‌శాబ్దాల క్రితం నాటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ తో పాటు కొద్ది సంవ‌త్స‌రాల ముందు విడుద‌లైన యావ‌రేజ్, ఫ్లాప్ సినిమాలు కూడా ఈ లిస్ట్ లోకి చేరిపోతున్నాయి. ఘ‌రానా మొగుడు,  భైర‌వ ద్వీపం, తొలి ప్రేమ‌, న‌ర‌సింహ నాయుడు, ఖుషి, చెన్నకేశ‌వ‌రెడ్డి,  ఒక్క‌డు, సింహాద్రి, వ‌ర్షం, పోకిరి, దేశ‌ముదురు, జ‌ల్సా, బిల్లా, ఆరెంజ్, ఈ న‌గరానికి ఏమైంది.. ఇలా ప‌లు చిత్రాలు రి-రిలీజ్ బాట ప‌ట్టాయి. వీటిలో కొన్ని సినిమాలు వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించాయి.  

ఇదిలా ఉంటే, త్వ‌ర‌లో ఈ లిస్ట్ లో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ చేర‌నుంద‌ని స‌మాచారం. ఆ చిత్రం మ‌రేదో కాదు.. మాస్ మ‌హారాజా రవితేజ, స్నేహ జంట‌గా న‌టించిన ఎవ‌ర్ గ్రీన్ ఎంట‌ర్టైన‌ర్ 'వెంకీ'.  ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శ్రీ‌ను వైట్ల తెర‌కెక్కించిన ఈ చిత్రంలో ట్రైన్ ఎపిసోడ్ ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అలాగే ఈ సినిమాకి సంబంధించిన స‌న్నివేశాలు కూడా కొన్ని మీమ్స్ గా వైర‌ల్ అయ్యాయి. మ‌రి.. ఒరిజిన‌ల్ రిలీజ్ టైమ్ లో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన 'వెంకీ'.. రి-రిలీజ్ లోనూ వ‌సూళ్ళ వ‌ర్షం కురిపిస్తుందేమో చూడాలి. కాగా త్వ‌ర‌లోనే 'వెంకీ' రి-రిలీజ్ డేట్ పై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది.