రెండు రోజులకు కోటీ ఇస్తే వస్తాదట...!
టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న సమంత ఒక సినిమాకు ఒక కోటి వరకు తీసుకుంటున్న విషయం తెలిసిందే. దాదాపు 6 నెలల వరకు షూటింగ్ జరుపుకునే సినిమా విషయంలో ఈ అమ్మడి రెమ్యునరేషన్ కోటి రూపాయలు అంటే పర్లేదులే అని అనుకోవచ్చు. కానీ రెండు రోజుల ఫోటో షూట్ కి కూడా కోటి రూపాయలు ఇవ్వమని అడిగిందట ఈ అమ్మడు.