English | Telugu
త్వరలో కళ్యాణ్ తో పూరి సినిమా
Updated : Feb 18, 2014
నితిన్ తో "హార్ట్ ఎటాక్" చిత్రం తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ నటించనున్నాడని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కానీ ప్రస్తుతం మహేష్ "ఆగడు" చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అంతే కాకుండా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రం వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ రెండు చిత్రాలు పూర్తి అవ్వాలంటే కనీసం మరో 10నెలలు పడుతుంది. అందుకే ఈ సమయంలో హీరో కళ్యాణ్ రామ్ తో ఓ సినిమా ప్లాన్ చేసాడట పూరి. వరుస పరాజయాలతో ఉన్న కళ్యాణ్ రామ్ త్వరలోనే పూరిజగన్నాథ్ దర్శకత్వంలో నటించనున్నాడని, ప్రస్తుతం కళ్యాణ్ రామ్ కోసం పూరి ఓ కథను సిద్ధం చేస్తున్నారని తెలిసింది. ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మించనున్నాడని సమాచారం. మరి ఈ సినిమాకు సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.