English | Telugu

రెండు రోజులకు కోటీ ఇస్తే వస్తాదట...!

 

టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న సమంత ఒక సినిమాకు ఒక కోటి వరకు తీసుకుంటున్న విషయం తెలిసిందే. దాదాపు 6 నెలల వరకు షూటింగ్ జరుపుకునే సినిమా విషయంలో ఈ అమ్మడి రెమ్యునరేషన్ కోటి రూపాయలు అంటే పర్లేదులే అని అనుకోవచ్చు. కానీ రెండు రోజుల ఫోటో షూట్ కి కూడా కోటి రూపాయలు ఇవ్వమని అడిగిందట ఈ అమ్మడు. కొత్తగా ఓ మ్యాగజైన్ ఏర్పాటు చేయబోతున్నఓ నిర్మాత పలువురు సినీ హీరోయిన్ల ఫోటో షూట్ కోసం సంప్రదించాడట. దానికి చాలా మంది హీరోయిన్లు రెమ్యునరేషన్ తీసుకోకుండానే చేస్తాం అని అన్నారట. కానీ ఈ విషయంపై సమంతను కేవలం రెండు రోజుల ఫోటో షూట్ కోసం సంప్రదిస్తే.. కోటి రూపాయలు ఇస్తే చేస్తాను అంటూ ఆ నిర్మాతకు హార్ట్ ఎటాక్ వచ్చే ఆఫర్ ఇచ్చిందట. దాంతో అక్కడి నుండి ఆ నిర్మాత ఏమి అనలేక జంప్ జిలానీ అయ్యాడంట. ఆ కోటి రూపాయలు ఇచ్చి ఈ అమ్మడు సాంప్రదాయ ఫోటోలు తీసుకునే దానికంటే వేరే హీరోయిన్లకు కోటి రూపాయలు ఇచ్చి హాట్ హాట్ ఫోటోలు తీసుకున్న అదిరిపోతుంది అంటూ సదరు మ్యాగజైన్ వాళ్ళు గుసగుసలు పెడుతూ వెళ్లిపోయారట.