English | Telugu

రెండవ సినిమాకే పెంచేసిందట...!

 

"ఉయ్యాలా జంపాలా" చిత్రంతో తెలుగు వెండితెరకు పరిచయమైన అవికా ఘోర్ ప్రస్తుతం మరో సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది. ప్రముఖ రచయిత నంద్యాల రవి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. రేపు(ఫిబ్రవరి 20)ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా కోసం అవికా దాదాపు 50 లక్షల పారితోషకం తీసుకుంటున్నట్లు తెలిసింది. ఈ సినిమాతో ఒక కొత్త హీరో పరిచయం కాబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు రేపు షూటింగ్ ప్రారంభం అవ్వగానే తెలియజేస్తాం.