English | Telugu

ప్రిన్స్ ఈసారి వెంకీకి చెప్పనున్నాడా...?

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- విక్టరీ వెంకటేష్‌ల కాంబినేషన్‌లో "ఓ మై గాడ్" చిత్ర రీమేక్ తెరకెక్కనున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో మహేష్ బాబు వాయిస్ కూడా వినిపించనుందని సమాచారం. గతంలో "జల్సా" సినిమాలో పవన్ ఇంట్రడక్షన్ కు మహేష్ వాయిస్ ఓవర్ అందించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా తెరకెక్కనున్న ఈ రీమేక్ లో వెంకటేష్ పాత్రకు మహేష్ తన వాయిస్ ఓవర్ అందించబోతున్నట్లు తెలిసింది. రోజురోజుకి ఈ రీమేక్ చిత్రంపై అంచనాలు పెరిపోతున్నాయి. మరి ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.