English | Telugu
గోవిందా పాటలో చెర్రీ కాజల్...?
Updated : Feb 22, 2014
హిందీలో ఘనవిజయం సాధించిన "ఓ మై గాడ్" చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఇందులో పవన్ కళ్యాణ్, వెంకటేష్ ప్రధాన పాత్రలలో నటించనున్నారు. ఇందులో వెంకటేష్ ఇంట్రడక్షన్ కు మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించానున్నాడని తెలిసింది. ఇంతమంది పెద్ద హీరోల కలయికలో వస్తున్న ఈ చిత్రంలో రాంచరణ్, కాజల్ అగర్వాల్ కూడా కనిపించాబోతున్నారని సమాచారం. హిందీ ఒరిజినల్ "ఓ మై గాడ్" లో ప్రభుదేవా, సోనాక్షి సిన్హాలు "గొ గొ గోవిందా.." అంటూ చిందులేసి అదరగొట్టారు. అయితే తెలుగు రీమేక్ లో కూడా ఈ పాటలో చరణ్, కాజల్ చిందులేయబోతున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా తెలియనున్నాయి.