English | Telugu
సమంత మళ్ళీ బిస్కెట్ వేసిందా..?
Updated : Feb 19, 2014
సినిమాల్లో అవకాశాలు రాకపోతే అవకాశాలు వెతుక్కోవాలి అనేది ఒక పద్దతి. కానీ నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు ఇతరులపై కామెంట్లు చేసి, పబ్లిసిటీ పెంచుకోవచ్చు అనేది మరొక పధ్ధతి. బాలీవుడ్ ఐటెం పాపలు ఎక్కువ రెండవ పద్ధతిలోనే వెళ్తుంటారు. ప్రస్తుతం ఇదే పద్ధతిలో హీరోయిన్ సమంత కూడా వెళ్తుంది. టాలీవుడ్ లో మొన్నటివరకు మహేష్ సినిమా పోస్టర్ పై కామెంట్లు చేసి టాలీవుడ్ జనాల చేత ఛీ కొట్టించుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం తమిళంలో రెండు, మూడు సినిమాల్లో అవకాశం దక్కించుకుంది.
ఇదిలా ఉంటే సూర్యతో కలిసి నటిస్తున్న "అంజాన్" చిత్ర పోస్టర్ ను ఇటీవలే విడుదల చేసారు. ఇందులో తన ఫోటో లేకపోవడంతో "కోలీవుడ్ లో హీరోయిన్ల కు చిన్న చూపు చూస్తున్నారని, హీరోయిన్లకు సరైన గుర్తింపు ఇవ్వట్లేదు" అంటూ కామెంట్లు చేసి రచ్చ రచ్చ చేసింది. దాంతో తమిళంలో సినిమాలు కూడా పోయే పరిస్థితి వస్తుండటంతో మళ్ళీ అందరికి బిస్కెట్ వేస్తుంది. మళ్ళీ ఈ కామెంట్లకు తానే స్పందిస్తూ.. "సూర్య గారు చాలా మంచి వ్యక్తి. ఆయనతో పనిచేయడం చాలా బాగుంది. ఈ సినిమాలో సూర్య అదరగొట్టేశారు" అంటూ సూర్యను తెగ పోగిడేస్తుంది.
ఈ అమ్మడు ఇలాంటి చెత్త పబ్లిసిటీ కోసం ఎందుకు పాకులాడుతుందో తెలియదు కానీ... అటు కోలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ దర్శక, నిర్మాతలకే కాకుండా హీరోలకు సైతం సమంత అంటే చిరాకు వస్తుంది. మరి ఇప్పటికైనా ఈ అమ్మడు తన నోటి దురుసు తగ్గించుకుంటే బాగుంటుంది. లేదంటే ఇంకో సినిమా ఇండస్ట్రీ వెతుక్కోవలసిన పని ఏర్పడుతుంది.