English | Telugu
మరోసారి అల్లరోడి పెళ్ళంట...!
Updated : Feb 13, 2014
అల్లరి నరేష్ నటించిన సినిమాలలో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన చిత్రాల్లో "ఆహా నాపెళ్ళంట" కూడా ఒకటి. వీరభద్రం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మించారు. అయితే ఇదే కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతుంది. మళ్ళీ ఇదే కాంబినేషన్ లో మరో చిత్రం తెరకెక్కబోతుంది. కాకపోతే "ఆహా నాపెళ్ళంట" సినిమా అంతటి విజయం సాధించడానికి ముఖ్య కారణం శ్రీహరి. తన నటనతో, మాటలతో సినిమాకు ప్రాణం పోసాడు. కానీ శ్రీహరి ఇటీవలే మరణించారు. మరి ఈ రిపీట్ కాంబినేషన్ లో శ్రీహరి తప్ప మళ్ళీ అదే నటీనటులు నటించబోతున్నారని తెలిసింది. హీరోయిన్ కొత్తమ్మాయి కోసం చూస్తున్నారట. ఇప్పటికే ఓ కామెడీ ఎంటర్ టైనర్ కథను దర్శకుడు సిద్ధం చేసాడని తెలిసింది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.