English | Telugu
ఐష్ కాకుల సినిమా నిజమేనా...?
Updated : Feb 17, 2014
ఐశ్వర్యరాయ్ హీరోయిన్ గా ప్రముఖ దర్శకుడు పి.వాసు ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని సమాచారం. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి తమిళంలో "ఐశ్వర్యావుం ఆయిరమ్ కాక్కావుమ్" అనే పేరు నిర్ణయించారట. అంటే తెలుగులో "ఐశ్వర్యా.. వెయ్యి కాకులు" అని అర్థం. ఇందులో పలు సాహస, పోరాట సన్నివేశాలు ఉంటాయని, వాటి కోసం ఐష్ ఫైట్స్ లో శిక్షణ తీసుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. భారీ గ్రాఫిక్స్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం ఇద్దరు ప్రముఖ హీరోలు నటించబోతున్నట్లు తెలిసింది. మరి ఈ విషయంపై ఎవరు కూడా స్పందించలేదు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.