English | Telugu
చైతు ఆటోను వదిలేసిన నాగ్
Updated : Feb 22, 2014
నాగార్జున తన తనయుడు నాగచైతన్య సినిమాల కోసం నాగార్జున చాలా శ్రద్ధ తీసుకుంటాడు అని టాలీవుడ్ లో ఒక టాక్ ఉంది. కానీ ఆ టాక్ అబద్దమని అర్థమవుతుంది. చైతుని నాగార్జున పట్టించుకోవట్లేదేమో అని ప్రస్తుత పరిస్థితులు తెలియజేస్తున్నాయి.
చైతన్య నటించిన "ఆటోనగర్ సూర్య" సినిమా గతకొద్ది కాలంగా ఫైనాన్సియల్ గా ఆగిపోయి, ఇటీవలే పూర్తి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. అయితే సినిమా మొత్తం పూర్తయ్యి మరికొద్ది రోజుల్లో విడుదల కాబోతుంది అనే సమయంలో మళ్ళీ ఎదో కారణంగా విడుదలను ఆపేసారు. ఫిబ్రవరి 27న విడుదల చేయాలనుకున్న ఈ చిత్రాన్ని ఏ కారణం వల్ల విడుదల చేయకుండా ఆపేస్తున్నారో ఎవరికీ అర్థం కావట్లేదు. ఈ చిత్రం గురించి చాలా కష్టపడి తీసిన దర్శకుడు దేవకట్టా కూడా ఈ విషయంపై ఎలా స్పందించాలో తెలియక చేతులెత్తేసినట్లు తెలిసింది. ప్రస్తుతం దేవకట్టా తన తరువాతి సినిమా కోసం స్క్రిప్ట్ పనుల్లో బిజీ అయ్యాడు.
మరి ఇప్పటివరకు విడుదలకు నోచుకోని ఈ సినిమా గురించి నాగార్జున పట్టించుకోవట్లేదని అనిపిస్తుంది. నిజానికి నాగార్జున తలుచుకుంటే ఈ సినిమా ఎప్పుడో పూర్తయ్యి, విడుదల కూడా అయ్యేది. ఈ సినిమా రాజకీయాల పార్టీలకు కూడా సంబంధం లేదు. దీనిబట్టి చూస్తే నాగార్జున ఆటోనగర్ గురించి పట్టించుకోవట్లేదని, చైతు సక్సెస్ లో మాత్రమే భాగం అవుతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇప్పటికైనా నాగార్జున ఈ విషయాన్ని తెలుసుకొని ఆటోను కాస్త విడుదల చేయడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తారేమో చూడాలి.