English | Telugu

ఇద్దరు సూపర్ స్టార్ లతో శంకర్

 

కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన "భారతీయుడు" చిత్రం అప్పట్లో ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలని శంకర్ ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. కానీ సరైన సమయం రావట్లేదు. ఇటీవలే రజనీకాంత్ కూడా ఈ సీక్వెల్ పై దృష్టి పెట్టాడట. "భారతీయుడు" సినిమా సీక్వెల్ చేయాలని రజనీ కూడా చాలా ఆశగా ఉన్నాడట. కుదిరితే ఈ ఇద్దరు హీరోలతో కలిసి ఈ సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట శంకర్. ప్రస్తుతం విక్రమ్ తో "ఐ" చిత్రాన్ని తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు శంకర్. దీని తర్వాత "భారతీయుడు 2" ఉంటుందేమో చూడాలి?