English | Telugu
ఈయన కన్నడలో తీయడానికి కారణమేంటి?
Updated : Feb 18, 2014
ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ త్వరలో ఓ లేడి ఓరియెంటెడ్ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇందులో ప్రియమణి ప్రధాన పాత్రలో నటించబోతుంది. అయితే తెలుగులో సంగీత దర్శకుడిగా, దర్శకుడిగా పేరు సంపాదించుకున్న ఆర్.పి. ఈ చిత్రాన్ని కన్నడ భాషలో తెరకెక్కించనున్నారట. ఆ తర్వాత ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లోకి డబ్బింగ్ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ వార్త విన్నవాల్లందరూ కూడా "ఈ సినిమా కథ ఇదివరకే తెలుగు, తమిళ భాషల్లో వచ్చింది కావచ్చు. అందుకే కొన్ని మార్పులు చేసి కన్నడలో తెరకెక్కిస్తున్నట్లుగా అనిపిస్తుందని" గుసగుసలు పెడుతున్నారు. మరి ఇందులో ఎలాంటి నిజం ఉందో త్వరలోనే తెలియనుంది.