పవన్ కళ్యాణ్ దర్శకత్వంలో మెగాస్టార్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తను నటిస్తున్న సినిమాల సంఖ్యనుపెంచి, అచ్చంగా తన సినిమాల మీదే శ్రద్ధపెడుతున్నాడు. ఇది గమనించిన సినీ జనం పవన్ కళ్యాణ్ కీ, అతని అన్నయ్య మెగాస్టార్ కీ చెడిందని ఒక రూమర్ క్రియేట్ చేశారు. మెగాస్టార్ తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయటం పవన్ కళ్యాణ్ కి అస్సలిష్టం లేదనీ, అందుకే పవన్ కళ్యాణ్ మెగాస్టార్ తో సంబంధం లేకుండా తన భవిష్యత్తు మీద, తన సినిమాల మీద, తన కుటుంబ జీవితం మీద మనసు పెడుతున్నాడనీ వారంటున్నారు.