English | Telugu
లిపోసెక్షన్ చేయించుకుంటున్న నిర్మాత సి.కళ్యాణ్
Updated : Mar 15, 2011
లిపోసెక్షన్ చేయించుకుంటున్న నిర్మాత సి.కళ్యాణ్ ఫిలిం నగర్ లో ఒక రూమర్ రాజ్యమేలుతోంది. ఆ మధ్య సి కళ్యాణ్ మద్దుల చెరువు హత్య కేసులో నిందుతుడి భానుకిరణ్ తో సంబంధాలు కలిగి ఉన్నాడని పోలీసులు అనుమానించి, సి.సి.యస్. పోలీస్ స్టేషన్ కి పిలిచి విచారించినప్పుడు అంతా సి కళ్యాణ్ కి నిజంగానే భానుకిరణ్ తో సంబంధ బాంధవ్యాలున్నాయని భావించారు.
కానీ అవన్నీ నిజం కాదని తేలిన తర్వాత సి కళ్యాణ్ తన శరీరం మీద దృష్టి పెట్టినట్లు తోస్తూంది. సహజంగానే ఊబకాయుడైన సి కళ్యాణ్ తన భారీ శరీరంతో చాలా ఇబ్బందులు పడుతూండేవాడు. అందుకని తాను లిపోసెక్షన్ చేయించుకోటానికి సిద్ధపడుతున్నాడు. ఈ లిపోసెక్షన్ గతంలో జూనియర్ యన్ టి ఆర్ మొదలు పెడితే దాన్ని విష్ణువర్థన్, మెగాస్టార్ చిరంజీవి, నయనతార, విమలా రామన్ తదితరులు కంటిన్యూ చేశారు. ఇప్పుడు నిర్మాత సి.కళ్యాణ్ కూడా లిపోసెక్షన్ చేయించుకునేందుకు సిద్ధమవుతున్నాడట. మార్చ్ 23 వ తేదినుండి ఈ లిపోసెక్షన్ సిట్టింగులకు సి కళ్యాణ్ హాజరు కానున్నాడని సమాచారం. త్వరలో లిపోసెక్షన్ చేయించుకున్న తర్వాత సన్నగా మారిన నిర్మాత సి.కళ్యాణ్ ని చూడబోతున్నామన్న మాట.