English | Telugu
క్రిష్ దర్శకత్వంలో రామ్ చరణ్
Updated : Mar 15, 2011
క్రిష్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఒక మూవీలో హీరోగా నటించనున్నాడని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం.
క్రిష్ గతంలో "గమ్యం", "వేదం" వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. అలాంటి క్రిష్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నాడంటే ఆ సినిమా ఎంత విభిన్నంగా ఉండబోతోందో, ఆ సినిమాలో హీరో రామ్ చరణ్ పాత్ర ఇంకెంత విభిన్నంగా ఉండబోతోందోనని సినీ వర్గాలు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
క్రిష్ అసలు పేరు జాగర్ల మూడి రాధా కృష్ణ. రామ్ చరణ్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో, మెగా సూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై, యన్.వి.ప్రసాద్ , పరాస్ జైన్ నిర్మిస్తున్న "రచ్చ" చిత్రంలో నటించటానికి అంగీకరించారు. దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని చిత్రంలో హీరోగా నటించటానికి అంగీకరించారు. ఈ రెండు చిత్రాల తర్వాత క్రిష్ దర్శకత్వంలోని చిత్రంలో రామ్ చరణ్ హీరోగా నటించేందుకు అంగీకరించారని సమాచారం.