English | Telugu
అల్లు అర్జున్ పెళ్ళి చూసి ఏడ్చిన శ్రీజ
Updated : Mar 11, 2011
అల్లు అర్జున్ పెళ్ళి చూసి శ్రీజ ఏడ్చిందట. విషయంలోకి వెళ్తే అల్లు అర్జున్ పెళ్ళిని టి.వి.లో చూసిన మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ కన్నీళ్ళ పర్యంతమైందట. తన తండ్రి చిరంజీవినీ, తన కుటుంబాన్ని కూడా ఎదిరించి మరీ శిరీష్ భరద్వాజని శ్రీజ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి ప్రేక్షకులకు తెలిసిందే. ఒకవేళ తన తండ్రి తన పెళ్ళి చేసి ఉంటే అల్లు అర్జున్ పెళ్ళి కన్నా ఘనంగా చేసి ఉండేవాడన్న ఊహతో శ్రీజ ఏడ్చిందని ఫిలిం నగర్ వాసుల కథనం. శ్రీజను అల్లు అర్జున్ పెళ్ళికి అల్లు అరవింద్ పిలిచి ఉండకపోవచ్చనీ, అందుకే శ్రీజ అలా బాధపడి ఉంటుందనీ కొందరంటున్నారు.
అంతేకాక ఒక వేళ అల్లు అర్జున్ లా తన పెళ్ళి జరిగుంటే ఇంతటి ఘనంగా, అత్యంత వైభవంగా తనకు కూడా పెళ్ళి జరిగుండేది కదాని కూడా శ్రీజ బాధపడి ఉండవచ్చని కూడా మరి కొందరి వాదన. అల్లు అర్జున్ మగపిల్లవాడు కనుక అతను తను ప్రేమించిన స్నేహారెడ్డితో పెద్దలను వొప్పించి ఘనంగా తన పెళ్ళిచేసుకోగలిగాడనీ, శ్రీజ తాను ఆడపిల్లను కనుక తన పెద్దలు తను ప్రేమించిన అబ్బాయితో తన పెళ్ళి చేయరన్న భయంతో హడావుడిగా దొంగతనంగా తన పెళ్ళి చేసుకోవలసి వచ్చిందని కూడా శ్రీజ బాధపడి ఉండవచ్చని ఇంకొందరు భావిస్తున్నారు. ఏది ఏమైనా చేతులు కాలాక ఆకులు పట్టుకుని ప్రయోజనం ఏముంది. ఇదంతా శ్రీజ పెళ్ళి చేసుకోక ముందు ఆలోచించి ఉంటే బాగుండేది కదూ.