English | Telugu
సెల్వరాఘవన్ భార్యకి సుదీప్ తో రెండో పెళ్ళి
Updated : Mar 11, 2011
సెల్వరాఘవన్ భార్యకి సుదీప్ తో రెండో పెళ్ళి చేసుకోబోతోందని తెలిసింది. కన్నడ స్టార్ సుదీప్ ని సోనియా అగర్వాల్ రెండో పెళ్ళిచేసుకోబోతోందని వినికిడి. విషయానికొస్తే గతంలో "7/జి బృందావన్ కాలనీ" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ సోనియా అగర్వాల్, ఆ తర్వాత ఆ చిత్ర దర్శకుడు సెల్వరాఘవన్ ని వివాహం చేసుకుంది. కానీ దర్శకుడు సెల్వ రాఘవన్ కొన్నాళ్లకి సోనియాకి విడాకులివ్వటం జరిగింది.
అయితే ఈ మధ్య వైజాగ్ లో ముంబయ్ హీరోస్ సూపర్ స్టార్స్ వర్సెస్ సౌతిండియన్ సూపర్ స్టార్స్ క్రికెట్ మ్యాచ్ జరిగినప్పుడు, నటుడు సుదీప్ తో సోనియా అగర్వాల్ చాలా క్లోజ్ గా మూవ్ అయ్యిందట. ఇది గమనించిన సినీ జనం సెల్వరాఘవన్ భార్యకి సుదీప్ తో రెండో పెళ్ళి జరుగుతుందని తీర్మానించేశారు. ఈ మాట విన్నా దాన్ని వారిద్దరూ ఖండించక పోవటం ఈ గాసిప్ కి బలాన్నిచ్చింది. పోన్లెండి సోనియానికైనా ఎవరో ఒక తోడు కావాలి కదా. లెట్ దెమ్ ఎంజాయ్...