English | Telugu

అల్లు అర్జున్ కి మెగా ఫ్యామిలీ మెగా గిఫ్ట్ లు

అల్లు అర్జున్ కి మెగా ఫ్యామిలీ మెగా గిఫ్ట్ లు ఇచ్చింది. అల్లు అర్జున్ కి మెగా ఫ్యామిలీ మెగా గిఫ్ట్ లు గా ఏమిచ్చిందంటారా...? యువ హీరో రామ్ చరణ్ తన బావ అల్లు అర్జున్ మ్యారేజ్ కి యూరప్ నుండి ఒక కాస్ట్ లీ స్యూట్ తెప్పించాడు.

 

దాని ఖరీదు మూడున్నర లక్షలు. అల్లు అర్జున్ మ్యారేజ్ కి మెగాస్టార్ చిరంజీవి కూడా మెగా గిఫ్ట్ అందించారు. అల్లు అర్జున్ మ్యారేజ్ కి మెగా స్టార్ ఇచ్చిన మెగాగిఫ్ట్ ఏమిటంటే కార్టియర్ కపుల్ అనే కాస్ట్ లీ వాచ్ ని బహుమతిగా అందించారు. ఈ వాచ్ చాలా తక్కువగా అంటే ఓ పది వాచీలు మాత్రమే ఆ కంపెనీ లాంచింగ్ కోసం తయారుచేసింది.

 

ఆ కంపెనీ వాచ్ అంటే అల్లు అర్జున్ కి చాలా ఇష్టమని తెలుసుకున్న మెగాస్టార్ వెంటనే ఆ వాచ్ ని అల్లు అర్జున్ మ్యారేజ్ గిఫ్ట్ గా తెప్పించి అందజేశారు. ఈ వాచ్ ఖరీదు మన భారత కరెన్సీ ప్రకారం నాలుగు లక్షల రూపాయల ఖరీదు ఉంటుంది. అల్లు అర్జున్ మ్యారేజ్ పుణ్యమాని మెగాస్టార్, ఆయన తనయుడు రామ్ చరణ్ తరపున మెగాఫ్యామిలీ గిఫ్ట్ లు చాలా కాస్ట్ లీవే అల్లు అర్జున్ కి దక్కాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే అల్లు అర్జున్ మ్యారేజ్ రిసెప్షన్ కి మెగా అభిమానులు వేలాదిగా తరలి రావటం అల్లు అర్జున్ మ్యారేజ్ కి రుపురాని గిఫ్ట్ అని చెప్పొచ్చు.