English | Telugu

డబ్బిచ్చి గుడి కట్టించుకుంటున్న హన్సిక

హన్సిక డబ్బిచ్చి గుడి కట్టించుకుంటున్నదని తమిళ పత్రికలు ఘోష పెడుతున్నాయి. తఏలుగులో పూరీ జగన్నాథ్దర్శకత్వంలో అల్లు అర్జున్‍ హీరోగా నటించిన "దేశముదురు" చిత్రంతో సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన హన్సిక ఆ తర్వాత కొన్ని తెలుగు చిత్రాల్లో నటించి తమిళ పరిశ్రమకు వెళ్ళింది. అక్కడ ఆమెకు అభిమానులు బాగానే తయారయ్యారు.

 

అయితే వారి అభిమానం హన్సికకు గుడి కట్టేస్థాయిలో లేదని తమిళ మీడియా వాదన. ఎందుకంటే తమిళంలో ఆమెకు సూపర్ హిట్లేమీ లేవు. అయినా ఆమె నటనకు మంచి పేరే వచ్చింది. హన్సిక అభిమానులు ఆమెకు పబ్లిగ్గా పాలాభిషేకం చేస్తామన్నారు కూడా. కానీ హన్సికే అభిమానులకు డబ్బులిచ్చి గుడి కట్టించుకుంటోందని కోలీవుడ్ మీడియా నిర్మొహమాటంగా చెపుతోంది.

 

అంత అవసరం నాకేంటి నిజానికి నా అభిమానులే నేను వద్దన్నా నాకు గుడి కట్టిస్తున్నారని హన్సిక నమ్మబలుకుతోంది. తమిళియన్లు వాళ్ళకు నచ్చితే సినిమా వాళ్ళకు గుళ్ళు గోపురాలూ కట్టేయటంలో మొనగాళ్ళు. గతంలో ఖుష్ బూకి, మొన్న నమితకూ గుళ్ళు కట్టారు. ఈ రోజున హన్సికకూ గుడి కటెస్తున్నారు.