English | Telugu

మియామీలో రామ్ చరణ్ హాలిడే

మియామీలో రామ్ చరణ్ హాలిడే ఎంజాయ్ చేయబోతున్నాడు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఫ్లోరిడాలో ఉన్న మియామీ బీచ్ లో యువ హీరో రామ్ చరణ్ కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకోవటానికి వెళ్తున్నాడని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం.

 

రామ్ చరణ్ ఇటీవల నటించిన "ఆరెంజ్" ఆశించిన స్థాయిలో విజయం సాధించక పోవటంతో రామ్ చరణ్ ని కొన్నాళ్ళు వేరే ఏదైనా ప్రదేశానికి వెళ్ళి రీఛార్జ్ అవ్వవలసిందిగా, రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి సలహా ఇచ్చినట్లు తెలిసింది. బావ అల్లు అర్జున్ మరికొందరు స్నేహితుల సలహా మేరకు రామ్ చరణ్‍ అమెరికాలోని ఫ్లోరిడాలో కల విలాసవంతమైన మియామీ బీచ్ కి ఒక నెల పాటు విశ్రాంతి తీసుకోవటానికి బయలుదేరుతున్నారట. ఏప్రెల్ నేల నుంచి సంపత్ నంది దర్శకత్వంలో, రామ్ చరణ్ హీరోగా నటించే "రచ్చ" చిత్రం ప్రారంభం కానుంది.

 

ఈ రామ్ చరణ్, సంపత్ నంది కామబినేషన్‍ లో రానున్న "రచ్చ" చిత్రాన్ని మెగాసూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై, యన్ వి ప్రసాద్, పరాస్ జైన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.మియామీలో రెస్ట్ తీసుకున్న తర్వాత రెట్టించిన ఉత్సాహంతో ఈ "రచ్చ" చిత్రం షూటింగ్ లో పాల్గొని ఘనవిజయం సాధించాలని ఆశిద్దాం. అసలే మియామీ అంటే టూరిస్ట్ రిఛార్జ్ స్పాట్ కదా.