English | Telugu
రాజమౌళితో యన్ టి ఆర్ సీక్రెట్ మీటింగ్
Updated : Mar 14, 2011
రాజమౌళితో యన్ టి ఆర్ సీక్రెట్ మీటింగ్ ఏర్పాటుచేశాడట. ఎందుకనేది ఎవరికీ తెలియదు. కారణాలేమైనా రాజమౌళి, యన్ టి ఆర్ ల సీక్ర్రెట్ మీటింగ్ హైదరాబాద్ లోనే జరిగింది. హైదరాబాద్ ఫిలింనగర్ లోని యఫ్ యన్ సి సి (ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్) లో, రూమ్ నంబర్ ముప్పై ఆరులో ఈ రాజమౌళితో యన్ టి ఆర్ సీక్రెట్ మీటింగ్ జరిగిందట.
మూడు ఆరు కలిపితే తొమ్మిది. యన్ టి ఆర్ కి తొమ్మిది కలిసొచ్చే అంకే కనుక రూమ్ నంబర్ ముప్పై ఆరు తీసుకున్నాడనీ అంటున్నారు. మామూలుగా యఫ్ యన్ సి సి లో మెంబర్ షిప్ ఉన్నవారెవరైనా యఫ్ యన్ సి సి ని వాడుకోవచ్చు. అయితే రాజమౌళితో యన్ టి ఆర్ సీక్రెట్ మీటింగ్ యొక్క ఎజెండా ఏమిటంటే అనే దాని మీద పలు ఊహాగానాలు బలంగా వెలువడుతున్నాయి.
యన్ టి ఆర్ తన పెళ్ళి ఎలా జరిగితే బాగుంటుందనే విషయం మీద రాజమౌళిని సలహా అడిగేందుకు ఈ మీటింగ్ ఏర్పాటుచేసి ఉంటాడని కొందరంటే కాదు....కాదు... రాజమౌళితో ఒక భారీ సినిమాలో నటించాలని చర్చించటానికే యన్ టి ఆర్ ఈ మీటింగ్ ఏర్పాటు చేశాడని కొందరంటున్నారు. ఏది ఏమైనా రాజమౌళితో యన్ టి ఆర్ సీక్రెట్ మీటింగ్ గురించి ఫిలింనగర్ లో వేడి వేడి చర్చలు జరుగుతున్నాయి.