English | Telugu

" నా రెమ్యూనరేషన్ నిర్మాతలనడగండి " - ఇలియానా

" నా రెమ్యూనరేషన్ నిర్మాతలనడగండి " అని ప్రముఖ హీరోయిన్ ఇలియానా అందిట. ఇలియానా ఒక సినిమాకి కోటి రూపాయలు పారితోషికం తీసికుంటోందని ఒకరంటే కాదు కోటిన్నరని మరొకరు, కాదు కాదు కోటి ఎనభై లక్షల రూపాయలు తీసుకుంటుందని వేరొకరు ఇలా ఇలియానా ఒక సినిమాకి తీసుకునే పారితోషికం గురించి ఎవరికి తోచిన ఊహాగానాలు వారు చేసేసుకుంటున్నారు.

 

కానీ నిజా నిజాలు ఇలియానానే అడిగితే తెలుస్తాయి కదాని ఒక రిపోర్టర్ ఇలియానాని "మేడమ్ మీరు ఒక సినిమాకి తీసుకునే రెమ్యూనరేషన్ ఎంత...?"అని అడిగాడు. దానికి చిర్రెత్తుకొచ్చిన ఇలియానా " ఏ ఆర్టస్ట్ కయినా డిమాండ్ ఉంటేనే ఆ డిమాండ్ కి తగ్గ పారితోషికం ఇస్తారు కానీ, మేమేంత అడిగితే అంత ఇవ్వటానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరు. అయినా నేనెంత పారితోస్హికం తిసుకుంటున్నానో మీకు కరెక్ట్ గా తెలియాలంటే నాకు ఆ రెమ్యూనరేషన్ ఇచ్చే నిర్మాతలను అడగండి చెపుతారు. " అని అందట. ఒకప్పుడు మగాడి సంపాదన ఆడదాని వయసు అడక్కూడదనే వారు. ఆ సామెత నేటి కాలంలో రివర్సయినట్లు తోస్తోంది కదా...