English | Telugu
సంజనా వెనక విరాట్ కొహ్లి
Updated : Mar 14, 2011
సంజనా వెనక విరాట్ కొహ్లి పడుతున్నాడట. సంజనా మీకు గురుందా...? పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా, కె.యస్.రామారావు నిర్మించిన "బుజ్జిగాడు" మేడిన్ చెన్నై సినిమాలో హీరోయిన్ త్రిషకు చెల్లెలిగా నటించింది ఈ సంజన.
ఆ తర్వాత పోసాని కృష్ణ మురళి దర్శకత్వంలో "దుశ్శాసన" చిత్రంలో కూడా సంజన నటించింది. అయినా సంజనకు మన తెలుగు సినీ పరిశ్రమలో అవకాశాలు పెద్దగా రావటం లేదనే చెప్పాలి. అయినా ఆశ చావక సంజన మాత్రం ఇక్కడ హీరోయిన్ గా సెటిలవటానికి తన వంతు ప్రయత్నాలు తాను చేస్తూనే ఉంది. మొన్న సౌతిండియన్ సూపర్ స్టార్స్ వర్సెస్ బాలీవుడ్ హీరోస్ మధ్య వైజాగ్ లో జరిగిన సి సి యల్ (సెలెబ్రిటీస్ క్రికెట్ లీగ్) కర్టెన్ రైజర్ మ్యాచ్ కి వెళ్ళి మన హీరోల దృష్టిలో పడటానికి సంజన చాలా హడావుడి చేసింది.
ఇవన్నీ పక్కన పెడితే మన భారత క్రికెట్ ప్లేయర్ విరాట్ కొహ్లిని సంజనా బుట్టలో వేసిందని సినీ జనం చెవులు కొరుక్కుంటున్నారట. విరాట్ కొహ్లి క్రికెట్ లో ఇప్పుడిప్పుడే పైకొస్తున్న కుర్రాడు. మరి సంజనా, కొహ్లీలది నిజమైన ప్రేమా...? లేక అవసరార్థం ప్రేమ అనేది తేలాలంటే కొంతకాలం ఆగాల్సిందే.