English | Telugu
పవన్ కళ్యాణ్ దర్శకత్వంలో మెగాస్టార్
Updated : Mar 14, 2011
మెగాస్టార్ తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయటం పవన్ కళ్యాణ్ కి అస్సలిష్టం లేదనీ, అందుకే పవన్ కళ్యాణ్ మెగాస్టార్ తో సంబంధం లేకుండా తన భవిష్యత్తు మీద, తన సినిమాల మీద, తన కుటుంబ జీవితం మీద మనసు పెడుతున్నాడనీ వారంటున్నారు. కానీ అది పచ్చి అబద్ధం. ఇలా అనుకునే వారందరికీ తెలియని సంగతేమిటంటే మెగాస్టార్, పద్మభూషణ్, డాక్టర్ చిరంజీవి నటించబోయే 150 వ చిత్రానికి దర్శకత్వం వహించబోయేది పవర్ స్టార్ పవన్ కళ్యాణే అన్న సంగతి.
మెగాస్టార్ నటించబోయే 15౦ వ చిత్రానికి ఒక అద్భుతమైన కథని తయారుచేసే పనిలో పవన్ కళ్యాణ్ చాలా బిజీగా ఉన్నారట.అలాగే ఆ కథను తానే సిల్వర్ స్క్రీన్ మీద ఆవిష్కరింపజేసే దర్శకుడిగా కూడా మారనున్నారట పవన్ కళ్యాణ్. ఈ చిత్రం బహుశా ఈ సంవత్సరమే ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని వినికిడి. గతంలో "జానీ" అనే చిత్రానికి పవన్ కళ్యాణ్ కి దర్శకత్వం వహించిన అనుభవం ఉంది.