English | Telugu

స‌రికొత్త బ్యాక్‌డ్రాప్‌తో ‘కాంతార 2’

ఎలాంటి అంచ‌నాలు లేకుండా మినిమం బ‌డ్జెట్‌తో రూపొంది ఏకంగా రూ. 450 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించి అంద‌రినీ ఆక‌ర్షించిన సినిమా ‘కాంతార’. రిష‌బ్ శెట్టి హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ ఇప్పుడు ప్రీక్వెల్‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌టానికి సిద్ధ‌మ‌వుతోంది. ‘కాంతార 2’ పేరుతో ఈ ప్రీక్వెల్‌ను రూపొందించ‌టానికి కావాల్సిన స‌న్నాహాల‌న్నీ జ‌రుగుతున్నాయి. రిష‌బ్ శెట్టి చాలా రోజుల నుంచి ఈ స్క్రిప్ట్‌పై వ‌ర్క్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. దీంతో పాటు ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌న్నీ కూడా శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. హోంబ‌లే ఫిలింస్ ఈ సినిమాను ఏకంగా రూ.150 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించ‌నుంది.

‘కాంతార 2’పై ఎలాంటి ఎక్స్‌పెక్టెష‌న్స్ ఉంటాయ‌నే విష‌యం రిష‌బ్ శెట్టికి బాగా తెలుసు. అందుక‌నే ప్ర‌తీ విష‌యంలోనూ ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. తాజాగా ఈ ప్రీక్వెల్‌కు సంబంధించి మ‌రికొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వైర‌ల్ అవుతున్నాయి. అవేంటంటే ప్రీక్వెల్ బ్యాక్ డ్రాప్ అంతా 4వ శ‌తాబ్దంలో జ‌రుగుతుంది. దీని కోసం రిష‌బ్ త‌న లుక్‌ను పూర్తిగా మార్చుకున్నారు. ఏకంగా 11 కిలోల బ‌రువు త‌గ్గార‌ని సినీ సర్కిల్స్‌లో వార్త‌లు వినిపిస్తున్నాయి. నాలుగో శ‌తాబ్దంలో న‌డిచే ఈ క‌థ‌ను తెర‌కెక్కించ‌టానికి ప్ర‌త్యేక‌మైన సెట్స్ వేసి సినిమాను నిర్మించాల‌ని హోంబ‌లే ఫిలింస్ రెడీ అయ్యింది.

‘కాంతార 2’ సినిమా షూటింగ్‌ను ఈ ఏడాది చివ‌ర‌లో ప్రారంభిస్తారు. వ‌చ్చే ఏడాదిలో సినిమాను విడుద‌ల చేసేలా ప్లాన్ చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. భారీ అంచ‌నాల‌తో రూపొంద‌బోయే ‘కాంతార 2’ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే మ‌రి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.