English | Telugu

మాట నిలబెట్టుకున్న విజయ్‌ దేవరకొండ

విజయ్‌ దేవరకొండ లేటెస్ట్‌ మూవీ ‘ఖుషి’. సమంత హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను శివ నిర్వాణ డైరెక్ట్‌ చేశాడు. సెప్టెంబర్‌ 1న విడుదలైన ఈ సినిమా సూపర్‌హిట్‌ అయింది. ఈ నేపథ్యంలో జరిగిన ఓ ఫంక్షన్‌లో విజయ్‌ దేవరకొండ తన ఆనందాన్ని ప్రేక్షకులతో పంచుకుంటూ తనకు సక్సెస్‌ని అందించిన అభిమానుల కుటుంబాలకు కూడా సంతోషాన్ని పంచాలనుకుంటున్నానని, అందుకోసం 100 ఫ్యామిలీస్‌ని సెలెక్ట్‌ చేసి ఒక్కో ఫ్యామిలీకి రూ.1లక్ష అందిస్తానని ప్రకటించాడు. దాని కోసం అప్లికేషన్లు పంపించాల్సిందిగా కోరాడు. ఎన్నో అప్లికేషన్లు వచ్చాయి. అందులో నుంచి 100 ఫామిలీస్‌ని సెలెక్ట్‌ చేశారు.
తను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ గురువారం దానికి సంబంధించి అఫీషియల్‌గా 100 మంది లిస్ట్‌ను ప్రకటించాడు. ఈ లిస్ట్‌లో తెలుగు రాష్ట్రాల ఫ్యామిలీసే కాకుండా కర్ణాటక, తమిళనాడుకు చెందిన వారు కూడా ఉన్నారు. త్వరలోనే హైదరాబాద్‌లో జరిగే ఖుషి గ్రాండ్‌ ఈవెంట్‌లో 100 కుటుంబాలకు చెక్కులు అందిస్తారు.
దీని గురించి హీరో విజయ్‌ దేవరకొండ స్పందిస్తూ ‘ఖుషి హ్యాపీనెస్‌ షేర్‌ చేసుకునేందుకు ఈ వంద మంది ఫ్యామిలీస్‌ను ఎంపిక చేశాం. ఈ లిస్టులో పేరున్న కుటుంబాలు ఎంతో ఆనందిస్తాయని ఆశిస్తున్నాను’ అంటూ ట్వీట్‌ చేశారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.