English | Telugu
మా కుటుంబానికి ఇది తీరని బాధ : శ్రీను వైట్ల
Updated : Sep 14, 2023
సినిమా వాళ్ళు కొన్ని విషయాల్లో ఎంత సున్నితంగా ఉంటారో, ఎంతగా స్పందిస్తారో మనం చాలా సందర్భాల్లో చూశాం. వారి కొంతమందికి భూతదయ అనేది ఉంటుంది. వాళ్ళు జంతువులపై ఎక్కువ ప్రేమను కురిపిస్తారు. ఇటీవల హీరో మహేష్ ఇంటిలోని డాగ్ చనిపోవడంతో ఆ ఫ్యామిలీ అంతా శోకసముద్రంలో మునిగిపోయింది. ఆ బాధను మరచిపోవడానికి మరో డాగ్‌ని ఇంటికి తెచ్చుకున్నారు.
ఇదిలా ఉంటే.. డైరెక్టర్ శ్రీను వైట్లకు కూడా ఇదే పరిస్థితి వచ్చింది. తమ కుటుంబం ఎంతో ప్రేమగా చూసుకునే ఆవు ‘లక్ష్మీ’ చనిపోయింది. దీంతో శ్రీను వైట్ల కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. లక్ష్మీ చనిపోయిన విషయాన్ని శ్రీను వైట్ల ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ ‘నేను మొదటిసారి ఇంటికి తెచ్చుకున్న ఆవు చనిపోయింది. 13 ఏళ్ళు మాకు ఎంతో ప్రేమను పంచిన లక్ష్మీ మా కుటుంబంలో సభ్యురాలు. మా అమ్మాయి లక్ష్మీ అంటూ ఎంతో ప్రేమగా పిలిచే మా ఆవు చనిపోయింది’ అంటూ ఆవు ఫోటోను షేర్ చేశారు.