English | Telugu
బాబు అరెస్ట్ పై స్పందించిన పూనమ్ కౌర్
Updated : Sep 14, 2023
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ పై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు బాబు అరెస్ట్ ని ఖండిస్తున్నారు. తాజాగా ప్రముఖ నటి పూనమ్ కౌర్ కూడా ట్విట్టర్ వేదికగా తనదైన శైలిలో స్పందించారు.
"ప్రజా జీవితంలో చాలా కాలం పనిచేసిన వ్యక్తిని 73 ఏళ్ల వయసులో ఇలా బాధపెట్టడం, జైలుకు పంపించడం తగదు. చంద్రబాబు గారి ఆరోగ్యం దృష్ట్యా అయినా మానవతాదృక్పథంతో ఆలోచించండి" అంటూ పూనమ్ కౌర్ ట్వీట్ చేశారు.
ప్రస్తుతం పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్ గా మారింది. చంద్రబాబుతో సన్నిహితంగా ఉండే మరియు బంధువులైన కొందరు స్టార్లే ఆయన అరెస్ట్ మౌనంగా ఉంటే.. పూనమ్ ధైర్యంగా స్పందించిన తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి.