English | Telugu

కె.విశ్వనాథ్ కి జయలలిత అంటే ఎందుకంత కోపం?

హీరోయిన్‌ అవ్వాలన్న ఆశతో ఇండస్ట్రీకి వచ్చిన నటి జయలలిత కొన్ని కారణాల వల్ల హీరోయిన్‌ అవ్వలేక వ్యాంప్‌ క్యారెక్టర్లకు, కామెడీ క్యారెక్టర్లకు పరిమితమైపోయింది. ఆమె జీవితంలో జరిగిన కొన్ని ఘటనలను ఆమె ఇటీవల వెల్లడిరచింది. ఆమె జీవితంలోని ఓ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కళాతపస్వి కె.విశ్వనాథ్‌ మేనల్లుడితో తన పెళ్ళి జరగాల్సి ఉండగా, అది ఆగిపోయింది.
విశ్వనాథ్‌ ఇంట్లోనే జయలలిత కుటుంబం అద్దెకు ఉండేది. విశ్వనాథ్‌ మేనల్లుడి కుటుంబానికి జయలలిత నచ్చి తనను కోడలిగా చేసుకుంటామని ముందుకు వచ్చారట. అన్నీ మాట్లాడుకున్న తర్వాత ఎంగేజ్‌మెంట్‌ సమయానికి జయలలిత తండ్రి అందుబాటులో లేకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. దీంతో మగ పెళ్ళివారు ఎదురు చూసి చూసి తమకు ఈ సంబంధం వద్దు అని చెప్పి వెళ్లిపోయారట. అప్పటి నుంచి జయలలిత అంటే విశ్వనాథ్‌కి కోపం. ‘డిగ్రీ చదివి, డాన్స్‌లో మంచి ప్రావీణ్యం ఉన్న నీకు సినిమాలు అవసరమా?’ అని ఆమెను తిట్టేవారట. విశ్వనాథ్‌ చేసిన సినిమాల్లో ‘శ్రుతిలయలు’ సినిమాలో మాత్రమే జయలలితకు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఆర్టిస్టుగా ఆమెను ఎంకరేజ్‌ చెయ్యలేదు విశ్వనాథ్‌.