English | Telugu

న‌య‌న‌తార కొత్త వ్యాపారం!

ద‌క్షిణాది లేడీ సూప‌ర్‌స్టార్ న‌య‌న‌తార రీసెంట్‌గా విడుద‌లైన ‘జవాన్’ చిత్రంతో భారీ విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంది. ఫుల్ స్వింగులో వ‌చ్చిన ఈ స్టార్ బ్యూటీ ఇప్పుడు కొత్త వ్యాపార రంగంలోకి అడుగు పెట్టింది. ఇంత‌కీ ఈ అమ్మ‌డు మొద‌లు పెట్ట‌నున్న వ్యాపారం ఏంటో తెలుసా!..స్కిన్ కేర్ ప్రొడ‌క్ట్‌ బిజినెస్. ఈ విష‌యాన్ని న‌య‌న‌తార భ‌ర్త‌, ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్ అధికారికంగా ప్ర‌క‌టించారు. ‘‘ఈరోజు మా అధికారిక ఖాతా అయిన 9స్కిన్ అఫిషియ‌ల్‌ను గ‌ర్వంగానూ, సంతోషంగానూ ప్ర‌క‌టిస్తున్నాను. సెల్ఫ్ ఎంతో ముఖ్య‌మ‌ని నేను న‌మ్మాను. ఆరేళ్ల కృషి, ప్రేమ‌ను మీతో పంచుకోవ‌టానికి ఎంతో ఆనందిస్తున్నాను. ఈ సెప్టెంబ‌ర్ 29 నుంచి ప్ర‌యాణం మొద‌లుకానుంది. ఆ రోజు నుంచి మా స్కిన్ కేర్ ప్రొడ‌క్ట్‌ను మా అధికారిక సైట్‌లో కొనుగోలు చేయ‌వ‌చ్చు’’ అని తెలిపారు.

న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్ ఇలా కొత్త వ్యాపార రంగంలోకి ప్ర‌వేశించ‌టంపై అభిమానులు ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. న‌య‌న్‌, విఘ్నేష్‌ల‌కు నెటిజ‌న్స్ అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నారు. సినీ స్టార్స్ చాలా మంది ఇప్ప‌టికే ప‌లు వ్యాపారాల్లో పెట్టుబ‌డులు పెడుతున్నారు. శిల్పా శెట్టి స్కిన్ కేర్ ప్రొడ‌క్ట్స్‌, కత్రినా కైఫ్ మేక‌ప్ ప్రొడ‌క్ట్స్ బిజినెస్‌తో రాణిస్తున్నారు. అలాగే మ‌న సౌత్‌లో చూస్తే సాకీ పేరుతో దుస్తుల వ్యాపారంలోకి స‌మంత ప్ర‌వేశించారు. ర‌కుల్ ప్రీత్ అయితే ఎఫ్ పేరుతో ఫిట్‌నెస్ సెంట‌ర్‌ను ఎప్పుడో స్టార్ట్ చేశారు.

న‌య‌న‌తార విష‌యానికి వ‌స్తే.. షారూఖ్ ఖాన్ హీరోగా న‌టించిన జ‌వాన్ చిత్రంలో హీరోయిన్‌గా న‌టించారు. ప‌క్కా యాక్ష‌న్ రోల్‌లో న‌య‌న్ అద్భుతంగా న‌టించారు. ఈ సినిమా రూ.500 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది. ఇంకా సినిమా స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతుంది. అట్లీ ఈ మూవీని డైరెక్ట్ చేశారు.