English | Telugu
'ఆపరేషన్' పైనే వరుణ్ ఆశలు.. ఈ సారైనా గట్టిగా కొడతాడా?
Updated : Sep 14, 2023
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హిట్ ముఖం చూసి చాలా కాలమైంది. గద్దలకొండ గణేశ్ తరువాత తన నుంచి వచ్చిన గని, ఎఫ్ 3, గాండీవధారి అర్జున ఆశించిన విజయం సాధించలేదు. మరీముఖ్యంగా.. గాండీవధారి అర్జున వరుణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో.. తదుపరి చిత్రాలపైనే ఆశలు పెట్టుకున్నాడు వరుణ్ తేజ్.
ప్రస్తుతం వరుణ్ చేతిలో ఆపరేషన్ వేలంటైన్, మట్కా చిత్రాలున్నాయి. వీటిలో ఆపరేషన్ వేలంటైన్ కి రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయింది. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ ఎయిర్ ఫోర్స్ యాక్షనర్ ని డిసెంబర్ 8న విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మరి.. ఆపరేషన్ వేలంటైన్ తోనైనా వరుణ్ సాలిడ్ హిట్ కొడతాడేమో చూడాలి.
కాగా, ఆపరేషన్ వేలంటైన్ కి శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా.. మానుషి ఛిల్లర్ నాయికగా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన డబ్బింగ్ పనులు కూడా పూజా కార్యక్రమాలతో షురూ అయ్యాయి.